26, డిసెంబర్ 2008, శుక్రవారం

కదళీ వనం ...!


కార్తీక మాసం కావడంతో స్వామివారి దర్శనానికి కష్టపడాల్సి వచ్చింది. దర్శనం చేసుకుని బైటకువచ్చేసరికి, అల్లంత దూరంలో ఉల్లాసంతో నిండివున్న గుంపు అతని కంటపడింది. మాట కలిపితే పోలా అనుకుంటూ వారి వైపుకి దారితీశాడు కార్తీక్.
" ఎక్స్ క్యూజ్ మీ..మీరూ..." అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు, ఆపై ఏమనడగాలో తెలియక -
"ఉయ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ కాస్మిక్ స్పిరిచ్యుయల్ సొసైటీ..ఐ యాం ప్రభాకర్ ఫ్రం కాకినాడ.. " తనని తాను పరిచయం చేసుకున్నాడతను షేక్ హ్యాండ్ ఇస్తూ.
" ఎన్నాల్టినుంచో అనుకుంటున్నా
సార్.. నేను కూడా మీతో జాయిన్ కావచ్చా.." అని అడిగాడు కార్తీక్ తన మనసులోని మాటను తెలియజేస్తూ.
" ఎందుక్కాదు..? అందరం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాం .. మెడిటేషన్ ప్రొగ్రాం లో భాగంగా శ్రీశైలం ట్రెక్కింగ్ కోసమని వచ్చాం వివరించాడు ప్రభాకర్.
" బై ది బై ఐయాం కార్తీక్ ప్రం హైదరాబాద్.. "ఎవరిని కలవమంటారు..? " అని అడిగాడు.
" అదిగో ఆ వైట్ షర్ట్ టక్ చెసుకుని వున్నారే.. ఆయనను కలవండి. హి ఈజ్ మణిశంకర్ ఫ్రం హైదరాబాద్. హి విల్ హెల్ప్ యూ.." ధ్యానమార్గం చూపించాడు ప్రభాకర్. థాంక్స్ చెప్పివెళ్ళాడు కార్తీక్ మణిశంకర్ని కలిసేందుకు .

ఆ సంభాషణ అంతా విన్న ఓ యువతి ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది వెళ్తున్నన కార్తీక్ వంక.ఎక్కడో బాగా పరిచయమున్న వ్యక్తిలా అనిపించింది. 'ఎక్కడా పరిచయం ' అన్న ఆలోచనలో మునిగిపోయిందా యింతి.
* * * * *

మెట్ల దారిలో నడుచుకుంటూ ఒకరి వెంట ఒకరు పాతాళ గంగ వద్దకు చేరారు.
" ఇప్పుడు మనం ఎటువెళ్తున్నాం.." ప్రశ్నించాడు కార్తీక్ ముందున్న వ్యక్తిని.
" కదళీ వనం " బదులిచ్చాడా వ్యక్తి
." ఎలా వెళ్తాం..? " ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కార్తీక్ ఎదురుగా ప్రవహిస్తున్న కృష్ణానదినే చూస్తూ.
" మీరు యోగులైతే నీటిమీదే.." వినిపించింది సమాధాన చిలిపిగా వెనుకనుంచి.
గిర్రున తలతిప్పి చూసిన కార్తీక్ షాకైయ్యాడు,రాశిగా పోసిన సినీతారల లావణ్యంతో నిండిన యువతిని చూసి. తన పక్కనున్న మరోకరితో కలిసి గలగలా నవ్వుతోంది.. ఆ సమాధానం తనకా..? లేక ఆమె ఫ్రెండుకా..?
ఆమెనే చూస్తున్న కార్తీక్ వంక ఓరకంట చూసిందామె. గుండె జల్లుమంది అతనికి. ' ఐశ్వర్యారాయ్ అంతటి అందగత్తే కానీ, ఆ చూపులో కరీనాకపూర్ కైపుంది ' అనుకున్నాడు
* * * * *
10 కి.మీ.లాంచీ ప్రయాణం.." చెప్పాడు మణిశంకర్ దూరంగా వస్తున్న లాంచీనే చూస్తూ.
" ఓహ్..! వండర్ ఫుల్.." అరిచారెవరో గట్టిగా.
" ఆ..ఆ..ఇప్పుడు వండర్ ఫుల్లు గానే వుంటుంది..దిగిన తరువాత..డర్ ఫుల్లు..ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.." చెప్పారెవరో .
" డర్ దేనికీ...? " ప్రశ్నించాడు కార్తీక్ పక్కనున్న వ్యక్తిని. వెనుకనుంచి సమాధానం ఆశిస్తూ.
" మనం నడిచి వెళ్ళే కొండదారిలో పులులు తిరుగుతున్నాయట..." చెప్పాడా వ్యక్తి.
" ఙ్ఞానులను అవేం చేస్తాయ్. . ? " వెటకారంగా ప్రశ్నించాడు కార్తీక్. విన్నవారి నుంచి మెప్పుని ఆశిస్తూ.
అతని ప్రశ్న విని తలతిప్పి నవ్వుతూ చూసారు కొంతమంది -
" వాటికి తిన్న తరువాత గానీ తెలియదు..ఎవరు ఙ్ఞానో..? ఎవరు అఙ్ఞానో..? " వినిపించింది సమాధానం వెనుక నుంచి. గొల్లుమన్నారు జనం ఆ సమాధానం విని. సూటిగా అమెవంకే చూసాడీ సారి.
' నువ్వు పులికి ఆహారంకాక తప్పదన్నట్టు ' -
" కమాన్..స్నిగ్ధా..కమాన్.." అంటూ తిన్నగా దారితీసింది లాంచీ వద్దకు, ఆ యువతి పక్కనున్న సుందరి. "ఓహొ ..అందాల పరువాలతో, ఆనంద పారవశ్యంతో విరిసిన పారిజాతంలా వున్న ఈ ముగ్ధ పేరు స్నిగ్ధా..? అనుకుంటూ ఆమె వెంటే దారితీశాడు కార్తీక్. -
***

లాంచీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. కృష్ణావేణీ ప్రవాహపు ఒంపుసొంపులు, నదీతీరలో ముచ్చట గొలిపే ఆకృతుల్లో అలముకున్న కొండలు , రంపంతో కోసినట్లుగా ఏర్పడిన నునుపైన శిలలు. ఎంతో అలౌకికానందాన్ని అందిస్తున్నాయి చూపరులకు. ' కదళీ వనం ' రేవు చేరింది లాంచీ.
సందడి మెదలైంది లాంచీలో. తన బ్యాగ్ ను అందుకుని లేచినిల్చుంది స్నిగ్ధ. అందరిలోనూ ఒకటే ఆత్రుత ముందుగా తామే కిందకు దిగాలని. అదే ఉత్సాహంతో తొపులాట మొదలైంది. నిల్చుని వున్న స్నిగ్ధను ఎవరో పక్కకి నెట్టేసరికి, పట్టుతప్పి పడిపోయింది,
దూరంగా కొండలవంక చూస్తున్న కార్తీక్ ఒళ్ళో. ఉలిక్కిపడి.. ఒళ్ళో పడిన మనిషిని, అప్రయత్నంగా గట్టిగా పట్టుకున్నాడు కార్తీక్. తన ఒళ్ళోకి వచ్చి వాలింది ఎవరో తెలియగానే, విద్యుత్ ప్రవహించినట్లైంది అతని బాడీలో. ఆ ...విధ్యుద్ఘాతానికి తాను లోనైంది స్నిగ్ధ ... అతని ఒడిలో.. !

నల్లమల కొండల్లో కాలిబాట- ఒకరి వెంట ఒకరు-అలవాటులేని నడక-మనసుకి ఉల్లాసం-శరీరానికి ఆయాసం. స్నిగ్ధ అడుగుల్లో అడుగులేస్తూ నడుస్తున్నాడు కార్తీక్, ఆమె శరీరాకృతిని గమనిస్తూ -తెల్లని శరీరచ్ఛాయ. వయసు సింగారింపుతో, లేత నిమ్మపండులా మాంచి నిగారింపుతో వుంది. ప్రతి అడుగుకి లయబద్దంగా స్పందిస్తూ ఊరిస్తుంది ఆమె నడుము ఒంపు. పైనుంచి వడివడిగా వచ్చి ఆ ఒంపులోకి చేరుకుంటున్నాయి స్వేదబిందువులు -

కాలుమోపుతూ, బరువుగా పైకి ఎక్కేటప్పడు, ఒక చేత్తో చీర కుచ్చిళ్ళను పట్టుకుని పైకెక్కుతుంది స్నిగ్ధ. నిలువునా ఆమె వంటిని అంటిపెట్టుకున్న చీర ఆమె పిరుదుల సొగసుని దాచలేకపోతుంది. చూస్తున్న కార్తిక్ లో కోరికాగ్ని శిఖ రగులుకోవడం ప్రారంభించింది. పాపం..! లగేజితో నడవలేక అవస్థ పడుతున్న, ఆ కన్నియను వీణియగా తన రెండు చేతులపై మోసుకుపోవాలనిపించిందతనికి. అందుకే ఉండబట్టలేక..
" ఇఫ్ యూ డోంట్ మైండ్..ఆ లగేజీ కాస్త యిటివ్వండి..కాస్త దూరం నేను తీసుకువస్తాను.." అన్నాడు.
" మీరేమైనా కూలీనా నా లగేజీ మోయడానికి..? " అంది. నిజంగా ఎంతో కోపం వచ్చినట్లు.
గ్రహించాడు కార్తీక్ ఆమె అంతరంగాన్ని.
" కొంతమంది బరువులు మోయడానికి కూలీగానూ మారవచ్చు..ఎంతో జాలీగా.." చిలిపిగా చూస్తూ చెప్పాడు సమాధానం.
" మాటలు ఎక్కువవుతున్నాయే.." ఈసారి నిజంగానే కోపంగా అంది. " దూరం తగ్గుతుందిగా..! " నవ్వుతూ బదులిచ్చాడు .
" ఒళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి .." మందలిస్తున్నట్లుగా చెప్పిందామె.
" లేదండి..జాగ్రత్తగా వుంచుకోకుండా..ఒళ్ళో వాలిన వాటినే వదిలేస్తాను..ప్చ్..." బాధ పడుతున్నట్లుగా చెప్పాడు - తనుకోల్పోయిన వాటిని గుర్తుచేసుకుంటూ -
చమత్కారంతో కూడిన అతని సమాధానం ఛురికలా వచ్చి గుచ్చుకుంది ఆమె మనసులో.

తాను ఓ.. ముద్దబంతుల మూటలా, ఆతని ఒళ్ళో పడిన దృశ్యం ఆమె కళ్ళముందు కదలాడి, ఆమెను సిగ్గుల మొగ్గను చేసింది. " ఇటివ్వండి.." అంటూ చనువుగా అందుకున్నాడు బ్యాగ్ ను ఆమె చేతిలో నుంచి. అతని ప్రయత్నానికి ప్రతిఘటన లేదు ఆమెలో.

కదళీవనం రేవు నుంచి 11 కి.మీ. కొండదారి వెంట నడిచిన తరువాత, ఒక వాగు కనిపించింది. ఆ వాగుకి, కుడి ప్రక్క క్రిందుగా కనిపిస్తుంది.. లోయలో 'కదళీ వనం ' - ఆ వనంలో సహజాతిసహజంగా ఏర్పడిన శిలామండపం, ప్రకృతి శోభకు పరాకాష్ట. కొండనుంచి వచ్చిన ఓ శిలా కింద ఎలాంటి ఆధారమూ లేకుండా, పైకప్పు లాగా వుండి, మండపం వలే ఏర్పడింది. కింద భాగం చదును చేసినట్లుగా నున్నగా వుంది. అందరూ ఎంతో అలసటగా వాలిపోయారు ఆ బండరాయి మీద. అక్కడ వెయ్యమందికి పైగా జనం, విశ్రాతిగా కూర్చుని చేసుకోవచ్చు 'ధ్యానం ' -
* * * * *
ఒంటరిగా వాగుగట్టుమీద నడుస్తోంది స్నిగ్ధ. వాగులోని ప్రవాహంలానే సాగుతున్నాయి అమెలో ఆలోచనలు. ద్యానం తాలూకూ అనుభవాలు గొప్పవి. క్రమం పద్దతిలో చేసే ధ్యానం సక్రమ ఫలితాలనిస్తుంది.

' ఎక్కడి వాడీ కార్తీక్..? ఇంతకు ముందే ధ్యానంలో కూడా కనిపించాడు. ఇప్పుడు ఇలా ఎంతో దగ్గరవాడులా అనిపిస్తున్నాడు. ఇది తనలో నిక్షిప్తమవుతున్న కాంక్షా..? లేక తాను పొందబోయే భవిష్యత్తా..? '

తీవ్రమైన ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న స్నిగ్ధ తన ఉనికినే మరిచిపోయింది. ఒంపు తిరిగిన కొండ వాగును గమనించక అడుగు ముందుకువేసింది.అంతే..! పెద్దగా ఆర్తనాదం చేస్తూ, గట్టుమీదనుంచి ప్రవాహంలోకి జారిపోయింది.
" హెల్ప్..హెల్ప్.." అని అరుస్తూ,తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ, మునిగితేలుతుంది స్నిగ్ధ.

అంతలో బలమైన రెండు చేతులు గట్టిగా ఆమెను పట్టుకుని, ఒడ్డు వైపుకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి.ఒడ్డుకు చేరిన స్నిగ్ధ నిస్సత్తువతో తన శక్తిని కోల్పోతున్నట్టుగా వుంది. అమాంతం ఆమెను తన రెండు చేతులపై కెత్తుకుని వాగుకు ఒక పక్కగా ఇసుక మేట వేసిన చోట ఆమెను పడుకోబెట్టే ప్రయత్నం చేస్తుండగా, కళ్ళు తెరిచి చూసింది స్నిగ్ధ, స్పృహను కోల్పోతూ - అతను 'కార్తీక్ ' అనుక్షణం తన నీడలా అనుసరిస్తున్న కార్తీక్. పూర్తీగా స్పృహను కోల్పోయింది స్నిగ్ధ.

"స్నిగ్ధా..స్నిగ్ధా.." ఎవరో లోయలో నుంచి పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది ఆమెకి. మెల్లగా స్పృహలోనికి వచ్చిన స్నిగ్ధ, నీరసంతో కళ్ళు తెరవలేదు. ఆమె పొట్టమీద చేతులు వేసి గట్టిగా అదుముతున్నాడు కార్తీక్. బహుశా తను తాగిన నీటిని కక్కించే ప్రయత్నం కాబోలు అనుకుంది మనసులో. వెంటనే మరో విషయం ఆమెను పూర్తీగా స్పృహలోకి తెచ్చింది. ఆమె పొట్టమీద అతని చేతుల ఉనికి గ్రహింపులోకి రాగానే, గగుర్పాటుతో కంపించింది ఆమె శరీరం -

ఆమె స్పృహలోనికి వచ్చిందన్న విషయాన్ని గ్రహించాడు కార్తీక్. కళ్ళు మూసుకుని ఆమె నటిస్తున్న వైనాన్ని గమనించాడు. ప్రేమోద్రేకంతో ప్రధమ చికిత్సను వీడి, కామోత్సుకుడయ్యాడు కార్తీక్ యిప్పుడు.ప్రమాదం తాలూకూ ఉద్వేగంతోనో, ప్రమోదం తాలూకూ ఉద్రేకంతోనో అతనికి తెలియటం లేదుగాని, అదిరిపడుతున్నట్లుగా తెలుస్తుంది ఆమె వక్షస్థలం. కవచంలా వుండాల్సిన ఆమె రవిక తడిసి, రవి కాంచని ఆమె స్తన సంపదను అతనికి బహిర్గతం చేస్తోంది. మరులు గొలిపే లోతైన ఆమె నాభిలో నిలిచిన నీళ్ళు అతనిని శృగారపు వూబిలోకి నెట్టేస్తున్నాయి. ఆమె ఒంటికి అంటుకుపోయిన చీర తడవటం వల్ల తన ఉనికిని కోల్పోయి పారదర్శకంగా మారి ఆమెలోగుట్టును అతనికి రట్టుచేస్తోంది.
ఆమెను నఖశిఖ పర్యంతం గమనించిన కార్తీక్ లో కోరిక కుబుసం విడిచి బుసలు కొట్టడం ప్రారంభించింది.కొండ ఎక్కేటప్పుడు కనిపించిన పిరుదుల సొగసును తడిమాడు కార్తీక్ మెత్తగా. ఝల్లుమంది స్నిగ్ధకు. ఏమి జరుగుతుందో గ్రహించే లోపలే ఆమె నడుముపై అతని అరచేయి ఉడుములా కదలాడుతుంది. ఏం చెయ్యాలో ఎలా ప్రతిస్పందించాలో తెలీని స్థితి ఆమెది.
ఇరవై రెండేళ్ళ ప్రాయపు పరువాలు కామపు పగను పెంచుతున్నాయి, పాతికేళ్ళ పురుషునిలో - ఒకచేత్తో ఆమె బొడ్డుపై నుంచి పైకి, మరోచేత్తో ఆమె తలపై నుండి క్రిందకి అణువణువునూ స్పృశిస్తూ, రెండు చేతులను మెల్లగా జరుపుతున్నాడు కార్తీక్. మోహం అతనిని పూర్తిగా వశపరుచుకుంది. ఆమె మౌనం దానికి మరింత బలాన్నందించింది. అతని రెండు చేతులు ఒకేచోట ఆగే వేళ... పలికింది మెల్లగా స్నిగ్ధ కనులు మూసుకునే --

'నారీ స్తన భర నాభిదేశం .. దృష్ట్యామాగా మోహావేశం ..
ఏతన్మాంస వసాది వికారం .. మనసి విచింతయ వారం ..వారం '

ఇంద్రియ లోలుడై అనుచితముగా స్నిగ్ధ శరీరాన్ని ఆక్రమించుకోబోతున్న కార్తీక్, కొరడా దెబ్బ తగిలినట్లుగా ఉలిక్కిపడ్డాడు. " అంటే.." అడిగాడు ఆశ్చర్యంగా, అంతకంటే అవమానంగా -
" మరులు గొలుపు నారి యొక్క నాభీ స్తనములను చూసి మత్తిలి ఎరలోన పడకు.
అది మాంసపు కండలతో ఏర్పడినది. ఈ విషయం మనసులో మళ్ళీమళ్ళీ భావించకు... "
చెప్పింది స్నిగ్ధ కనులు తెరిచి.
సిగ్గుతో కుచించుకుపోయాడు కార్తీక్. ఆమె మాటల్లోని తీవ్రత ఆమె ముఖంలో లేదు. కానీ మనసులోని బాధ మాత్రం కళ్ళల్లో కనిపించింది. ఇప్పటివరకూ తనకు కనిపించిన యవ్వనవతి ఇప్పుడు కానరావటం లేదు ఆమెలో. ఆత్మఙ్ఞానాన్ని పొందిన ప్రేమమూర్తిని చూశాడు కార్తీకిప్పుడు. ఆమెకు తన మొహం చూపించలేక, లేచి వడివడిగా వెళ్ళిపోయాడు.

* * * * *
మరునాడు పశ్చత్తాపంతో కుమిలిపోతున్నట్టు కనిపించాడు కార్తీక్ ఆమెకి. అతనిలోని పరివర్తన ఆమెనెంతో ఆనందానికి గురిచేసింది. ' తన హృదయం దుర్మార్గాన దరి చేరలేని అబేధ్యమైన దుర్గం... తన జీవితం ధ్యానంతో సమ్మిళితమైన సమ్మోహన మార్గం... మనసు నిండా ఫీలయ్యింది స్నిగ్ధ ఎంతో గర్వంగా -
* * * * *

వీరవిరాగిణిగా ప్రసిద్ధి చెందిన ' అక్క మహాదేవి ' శివ శరణులలో పేరెన్నిక గన్నది. ఆ శ్రీశైల మల్లిఖార్జునుని తన జీవిత భాగస్వామిగా భావించి, కదళీవనంలో తపస్సు చేసి, చివరకు సిద్ధిని పొందిందని కర్ణాటక భక్తుల నమ్మకం. అటువంటి అక్క మహాదేవి తపస్సు నాచరించిన చోటనే, ఒంటరిగా ధ్యానం చేసేందుకు ఉధ్యుక్తురాలై, కన్నులు మూసుకుంది స్నిగ్ధ ఉత్సాహాంగా -
ఆకాశాన్ని తాకుతున్న మహావృక్షాలు, నింగినుండి నేరుగా జాలువారుతున్న జలధారలు, కనుచూపుమేర కానవస్తున్న పచ్చని పచ్చికబయళ్ళు, వాటిలో పురివిప్పి నర్తిస్తున్న నెమళ్ళు, ఇలపై పరుచుకున్నట్లున్న ఇంద్రధనస్సులోని చిత్రవర్ణాలతో నిండిన వనం, సుగంధ పరిమళాలను వ్యాపింప చేస్తున్న పూలవనం..!
అంబరానికి ఆదరువుగా నిల్చిన గిరి శిఖరాలు- సంబరంగా పరుగులిడుతున్న సెలయేరులు- ఆ సెలయేరుల నడుమ మేట వేసిన ఓ ఇసుకతిన్నె-ఆశ్చర్యంగా ఆ తిన్నెపైనే కాంతులీనుతున్న వెండి వెన్నెల - ఆ వెన్నెల వెలుగులో- ఆ ఇసుక తిన్నెపై...ఓ జంట..!!
అంతటి అద్భుతమైన ప్రకృతి చుట్టూ నిలిచివుండగా, దానిని అనుభవించ కుండా, ఇంతకంటే మహాద్భుతమైన దానినేదో అనుభవిస్తున్నట్లున్నారు.. ఆ పురుషుని ఒడిలో తల పెట్టుకుని వున్నట్లుగా వుంది ఆ...స్త్రీ..!వారి మొహాలు కనిపించటం లేదు. అతని శరీరం యొక్క వెనుకభాగం , ఆమె మోకాళ్ళ నుంచి క్రింద భాగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదీ నగ్నంగా - మెల్లగా వారిని సమీపిస్తుండగా, ఏదో అలికిడి అయినట్లుగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడా పురుషుడు. ఆశ్చర్యం..! అతను కార్తీక్..!! అతని ఒడిలో పరవశిస్తున్న ఆ యువతి మరింత కలవరపాటుగా లేచింది. మహాశ్చర్యం.. అది 'తనే '-!!
ధ్యానంలో లీనమైన స్నిగ్ధ శరీరం జలదరించింది ఒక్కక్షణం. అదిరిపడి కళ్ళు తెరిచింది. ' ఏమిటీ విచిత్ర స్వప్నం ? ఏమి సుందర దృశ్యాలు ? ఎన్ని వర్ణాల సుమాలు ? ఎంత అద్భుత పరిమళాలు ?
కానీ, విచిత్రం ? అతనూ..నేనూ..ఏమిటీ..అలా..? మదిని ఆలోచనలు ఉప్పెనలా ముంచివేస్తుండగా పైకిలేచింది స్నిగ్ధ..- ధ్యానం నుంచి - దగ్గరగా వస్తూ కనిపించాడు కార్తీక్.అతనినే చూస్తుండిపోయింది స్నిగ్ధ, మదిలోని చిలిపి సిగ్గుని అదిమి పెట్టుకుంటూ ..
" హల్లో..గుడ్ ఈవినింగ్..స్వచ్చమైన చిరునవ్వుతో పలుకరించాడు కార్తీక్. ఉదయం నుంచి అతనిలో కనిపించిన వ్యధ ఇప్పుడు కనిపించటం లేదు ఆమెకి.
" హాయ్.." బదులిచ్చింది హుషారుగా స్నిగ్ధ.
" అలా వాగు దాకా వెళ్దామా.." రిక్వెష్టుగా అడిగాడు.
" ఈ వేళప్పుడా ?" ప్రశ్నించింది ఆశ్చర్యాన్ని నటిస్తూ
" ఏం చీకటంటే భయమా ?" చమత్కారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కార్తీక్, ఆమె భయానికి కారణం తెలిసీ-"మీరున్నారుగా " వాక్యం పూర్తి చెయ్యకుండా ఆపి, అతని వంక చూసింది. ఉలిక్కిపడ్డాడు ఆ మాటకి. అతని ఉలికిపాటుని చూసి, నవ్వుకుంటూ పూర్తిచేసింది వాక్యం "మీరున్నారుగా.. ఇంక భయం దేనికీ.." అంటూ -
' మాటల ఈటెల ' అనుకున్నాడు మనసులో.
"ఎక్కడ వరకు మన ప్రయాణం..? " హుషారుని కొనితెచ్చుకుంటూ అడిగింది.
" నిన్నటి చోటుకి.." ముక్తసరిగా చెప్పాడు." ఎందుకక్కడికీ ? చిలిపిగా అంది.
" వెళ్ళిన తరువార నీకే తెలుస్తుందిగా " చెప్పాడు ఏ భావం కనిపించనీయకుండా
'' పద..పద..నీకూ తెలుస్తుంది ' అనుకుంది మనసులో స్నిగ్ధ ఆనందంగా.
ఆమె మనసునిండా నిండిపోయింది..కొన్ని నిముషాల ముందు తాను పొందీన ధ్యానానుభవం.
" ఇదే..నిన్న మీరు దివ్యానుభవం పొందిన చోటు.." అంటూ కూలబడింది స్నిగ్ధ ఇసుక తిన్నెపై.
మెల్లగా ఆమె ముందు కూర్చుని, తదేకంగా ఆమెనే చూడసాగాడు. నిజంగా భయమేసింది స్నిగ్ధకిప్పుడు. మెల్లగా ఆమె చేతిని అందుకున్నాడు కార్తీక్. ' కొంపదీసి తన మాటలేం రెచ్చగొట్టడం లేదుకదా..? " అనుకుంది మరింత భయంగా. ఆమె కళ్ళల్లోని బెదురు అతనికి మరింత బాధను పెంచింది.
"నన్ను క్షమించు స్నిగ్ధా..! నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. మనం ఇంతదూరం వచ్చిన ప్రయోజనాన్నే మరిచి, దుర్మార్గంగా ప్రవర్తించాను. రియల్లీ ఐ యాం వెరీసారీ. కామంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించి నందుకు నీకెంతో ఋణపడివున్నాను. " బాధగా చెప్పాడు కార్తీక్ .
" అందుబాటులో వున్న దానిని అనుభవించడం ఆ మృగ లక్షణం..మీ మగ లక్షణం.." అంది ఇంకా ఆ కోపం తనలో వున్నట్టు..తనని దహించి వేస్తున్నట్టు.
" నన్ను క్షమించు స్నిగ్ధా..! నిన్నటి వరకూ నేనెంతో వివేకవంతుడిని, సంస్కారిని అనుకున్నాను. కానీ నిన్నే తెలిసింది, నేను మృగం కంటే హీనమని..." హృదయం లోని కల్మషాన్ని కడిగివేస్తున్నాడు కార్తీక్ పశ్చాత్తాపంతో.
'నా అలోచనే తప్పేమో..? నువ్వు కాపాడ బట్టి బతకగలిగాను. లేదంటే ఏ జలాచరాలకో బలి కావలసిన దానినే కదా ? ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తికి..? " ఆమె వాక్యం పూర్తికానేలేదు , వెంటనే బదులిచ్చాడు కార్తీక్.
" వద్దు స్నిగ్ధా..! వద్దు సూక్ష్మంగా నువ్వు మాట్లాడే ప్రతిమాట ఆ పరమశివుని త్రిశూలంలా నా గుండెల్లోకి దూసుకుపోతోంది. ఎక్కడైతే నేను అకృత్యానికి పాల్పడ్డానో.. అదేచోట నిన్ను క్షమాభిక్ష అడగాలని.. నిన్ను ఇంతదూరం తీసుకొచ్చా.. ఈ తపోభూమి సాక్షిగా చెబుతున్నా.. మరలా ఇలాంటి దుష్కర్మకు ఎప్పుడూ పాల్పడను. ఇది మన స్నేహం పై ఒట్టు.." అంటూ ఆమె చేతిలో గట్టిగా చెయ్యివేసి, వదిలేశాడు వెంటనే
" నిన్న అలా అవకాశం కలగకుండా వుండి వుంటే అసలే తప్పే జరిగి వుండేది కాదుకదా..!" మరింత సానబడుతుంది స్నిగ్ధ, అతని సౌశీల్యాన్ని.
" ఆహా..అవకాశం అందుబాటులోకి రానంత వరకూ అందరూ మహా యోగులే.." చెప్పాడు ఎంతో కసిగా.
ఆ కసి తనమీద తనకే. ఆశ్చర్యంతో మౌనంగా అతనినే చూస్తూ ఆలోచనలలోకి జరిపోయింది స్నిగ్ధ. ఏదో గుర్తొచ్చిన దానిలా ఆలొచనలలో నుంచి బయటపడి చెప్పింది.
" మీ మాటలు వింటుంటే.. శ్రీ ఆదిశంకరుల వారు చెప్పిన శ్లోకం గుర్తొస్తుంది.."
"చెప్పండి దానివలన నాలో ఇంకేం ప్రక్షాళన జరుగుతుందో.." అన్నాడు కార్తీక్ బాధగా.
" ఆయన చెప్పింది మీలో వచ్చిన మార్పును గురించి " వివరించింది నవ్వుతూ.
" అదేంటో..చెప్పండి.." అన్నాడు కార్తీక్ ఉద్వేగంగా-

" సత్సంగత్వే..నిస్సంగత్వం.. నిస్సంగత్వే నిర్మోహత్వం.. నిర్మోహత్వే నిశ్చలతత్వం.. నిశ్చలతత్వే జీవన్ముక్తి.."
అర్ధంకాక ఆమెనే చూస్తుండిపోయాడు.
" అంటే.. సత్సంగం వలన నిష్కామి అవుతాడు. నిష్కామికి మోహభ్రాంతి తొలగుతుంది. మోహం నశిస్తే, ధృఢమైన తాత్వక చింతన కలుగుతుంది. దాని వలన జీవన్ముక్తుడవుతాడు.. కావున సత్సాంగత్యం శ్రేష్ఠమైనది. " చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పింది.

"నిజమే మీ సత్సంగం వలనే.. నాలో ఈ పరివర్తన.." అభినందనగా చెప్పాడు.
" సత్ అంతే నిత్యము.. సంగం అంటే కలయిక.. మరి రేపు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం.. మరి నిత్యమూ ఎలా కలుస్తాం..? " ప్రశ్నించిందామె, ఏ భావం లేకుండా అతని వంకే చూస్తూ.
ఏ సమాధానం దొరకక.. అయోమయంగా ఆమెనే చూస్తుండిపోయాడు కార్తీక్.
" మనం నిత్యమూ కలవాలంటే ఒకటే మార్గం.." అంది ఆలోచన స్ఫురించిన దానిలా.
" ఏమిటీ.." అడిగాడు ఆశగా.
" మనం భార్యాభర్తలం కావడమే..." అంది సీరియస్ గా మొహం పెట్టి. విభ్రాంతుడై చూసాడు కార్తీక్ ఆమె వైపు.
"ఏమిటా వెర్రిచూపులు..? ఇంకా విషయం అర్ధం కాలా..?" ప్రశ్నించింది చిలిపిగా. అదేమిటో అర్ధం కాలేదన్నట్టు తలూపాడు కార్తీక్ యమ హుషారుగా.
" అయ్యా..మగానుభావా..! మిమల్ని దారుణంగా ప్రేమిస్తున్నామ్మయ్యా..! రేపు పెళ్ళి అయిన తరువాత అయ్యవారితో సహచర్యం చేస్తాం.. అయ్యవారికి సపర్యలు చేస్తాం.. " అంది కార్తీక్ ను గాఢంగా కౌగిలించుకుంటూ.
" అయితే మీ అయ్యవారు ఇప్పుడే మీతో సఫా చర్యలు చేబడతారు కాచుకోండి.." అంటూ ఆమెను మరింత గట్టిగా తన బాహువులో బంధిస్తూ ఆమెతో సహా వెనక్కి వాలిపోయాడు .

ఉక్కిరిబిక్కిరి అవుతుంది ముగ్ధ సుకుమారి 'స్నిగ్ధ ' అతని బిగి కౌగిలిలో. ఆమె తనువునా అణువణువునా ముద్దుల మొహరులు అద్దేస్తున్నాడు కార్తీక్. అతను ముద్రించిన ప్రతి ముద్దునీ భద్రపరచుకుంటోంది స్నిగ్ధ తన మది గదిలో.అతని జుట్టుని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, అతని తలని పైకి లాగి ప్రశ్నించింది స్నిగ్ధ తమకంగా.

" ఇది..కచ్ఛా..? నా పై ఇచ్ఛా..?? " పులకరింపుతో కూడిన ప్రశ్న ఆమెది.
" ఇది నాపై ఆ ఈశ్వరేఛ్చ.." పారవశ్యంతో చెలరేగుతున్న జవాబు అతనిది.

పులకరింతలతో తనువులూ, పారవశ్యంతో మనసులూ పరమానందానికి గురీవుతున్నాయి అచ్చోట...
అతి కాంక్షగా... ఆ.. కదళీవనం సాక్షిగా...!

* * * * *

( స్వాతి సపరి వార పత్రిక 4-2-2005 )

కామెంట్‌లు లేవు: