17, మార్చి 2010, బుధవారం

గీతార్ధసారం !!

మానవుడు ఎంత దుర్భలుడు ? సర్వావయవములు సమన్వయంగా పనిచేస్తుంటే, తాను సర్వేశ్వరుడననే గర్వం ! ఇక వాటిలో ఏ ఒక్క అవయవమైనా, తన విధిని విడనాడితే తాను సర్వం కోల్పోయాననే దైన్యం !!

అర్ధమవసాగింది శ్రీపతిరావుకి జీవితం యొక్క పరమార్ధం. ఆలోచిస్తున్నాడు హాస్పటల బెడ్ మీద పరుండి - శరీరంలోని అవయవల్లానే... కుటుంబంలోని వ్యక్తులు, వారితో సంబందాలు, వారి విధులూ, సంఘంలోనివ్యక్తులూ - వారి వృత్తులూ. ఎవరి సహకారం లోపించినా, గమనం గతి తప్పుతుంది.

తాము కష్టపడి పనిచేసి పరిశ్రమకు లాభాలను ఆర్జించి పెట్టామని కార్మికులు, బోనస్ పెంచమైని కోరితే, తన పెట్టుబడితోనూ, పలుకుబడితోనూ, లాభాలను పొందాననే అహంతో వారి కోరికను మన్నించలేదు శ్రీపతిరావు. అది చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, కార్మికుల కోరిక స్ట్రెంగ్త్ పెరిగి స్ట్రైక్ గా మారింది. ఇప్పుడు లాకౌట్ ప్రకటించాల్సిన పరిస్థితులలో వుంది. అయినప్పటికీ శ్రీపతిరావు అహం ఆనందించిందే గానీ, మనసు ఆలోచించలేదు. ఆరోగ్యం మాత్రం చెడింది.

హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పటల్లో జాయిన్ అయినా అమెరికా, కెనడా దేశాలనుంచి వచ్చి చూసేందుకు తన ఇద్దరి కొడుకులకు తీరికలేదు. అతి కష్టం మీద ఎలాగొలా తీరిక చేసుకోవాంటే నష్టం తప్ప లాభం లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో వి.వి.ఐ.పి. ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీపతిరావు, ధనంతో అనారోగ్యాన్ని నివారించగలిగాడే కానీ, అనుబంధాన్ని మాత్రం పొందలేకపోయాడు.

*****

ఆ రోజే శ్రీపతిరావు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాడు. బాల్య స్నేహితుడు సీతా రామారావు దగ్గరే వుండి ప్రత్యేకమైన శ్రద్దతో, అన్ని విషయాలు చూస్తున్నాడు. హాస్పటల్ గుమ్మందాటి ఆవరణలోకి వచ్చిన శ్రీపతిరావు కళ్ళముందు కనిపిస్తున్న నిజాన్ని చూసి నమ్మలేకపోయాడు. తనతో వాదించి, విభేదించి... తనని హాస్పటల్ పాలుచేసిన కార్మికులు... తన శక్తితో ఎవరినైతే అణచివేయాలని తపిస్తున్నాడో ఆ కార్మికులు... తన కళ్ళెదుట ? విషాద వదనాలతో, కన్నీళ్ళ ప్రవాహంతో, మండుటెండను సైతం సహిస్తూ, పసిబిడ్డలతో సహా, తనని చూసేందుకు వేచివున్నారు.

"బాబుగారూ..." ఘొల్లుమన్నారందరూ ఒక్కసారిగా శ్రీపతిరావుని చూసి.

ఎంతో దర్పంగా, ఆడంబరంగా వుండే శ్రీపతిరావునే చూశారు ఇంతకాలం. ఇలా దైన్యంతో చూసే సరికి వారి హృదయాల్లో తెలియనంత బాధ సుళ్ళు తిరిగిపోయింది. వారి దు:ఖాన్ని చూసిన శ్రీపతిరావు హృదయం కూడా చలించింది.

" మమ్మల్ని క్షమించండి... మా వల్లనే మీకిన్ని కష్టాలొచ్చాయి " ఘొల్లుమని విలపించాడు కార్మిక నాయకుడు రాఘవ.
" మీ ఉప్పు తిని మీ మీదే కత్తి కట్టినాం... మేము దుర్మార్గులం బాబు...దుర్మార్గులం..." భోరుమని విలపించాడు యాదయ్య. అతను శ్రీపతిరావు వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఎన్నడూ చూడలేదు యజమానిని.

" ఊర్కో... రాఘవా ! యాదయ్యా ! ఊర్కోండి ! మీ అందరి దయవల్ల నేను బాగానే వున్నానుగా ? కూల్ డౌన్..కూల్ డౌన్.." మమత నిండిన గుండెతో ఓదారుస్తున్నాడు శ్రీపతిరావు కన్నతండ్రిలా.

అక్కడ గుమిగూడివున్న కార్మికుల బాధ మరింత పెరిగింది యజమాని ప్రేమార్తికి.

" ఇంతమంది హృదయాల్లో కొలువై వున్న మీ సారుకి ఏం కాదు. పదండి... భగవంతుడు కూడా మిమ్మల్నుంచి ఆయన్ని వేరుచెయ్యలేడు..." కారు వద్దకు దారి తీసూ చెప్పాడు సీతారామారావు.

రెండు చేతులతో వారందరికీ నమస్కరిస్తూ మెల్లగా కారు ఎక్కాడు శ్రీపతిరావు. అశ్రునయనాలతో, చెమర్చిన హృదయాలతో వీడ్కోలు పలికారు కార్మికులంతా. కారు కదిలింది మెల్లగా.

" సీతా ! ఏమిటిరా ఇదంతా ? నమ్మలేకుండా వున్నాను..." ఆశ్చర్యం నిండింది శ్రీపతిరావు స్వరంలో.

" దిసీజ్ క్వైట్ నేచురల్ శ్రీపతి ! సుఖాలు మనుషుల్ని దూరం చేస్తాయి. కష్టాలు దరికి చేరుస్తాయి. నువ్వు మామూలు మనిషిగా వున్నంతవరకూ, వాళ్ళు తమ డిమాండుని సాధించుకునేందుకు నీతో పోరాడే యోధులయ్యారు. నువ్వు హాస్పటలైజ్ అయ్యావని తెలిసిన మరుక్షణం సర్వం కోల్పోయిన అనాధలయ్యారు ..." వివరించాడు సీతారామారావు కార్మికుల మానసికస్థితిని.
" మరి ఫ్యాక్టరీ, స్ట్రైక్, లాకౌట్...? " సందేహంతో ఆగిపోయాడు శ్రీపతిరావు.
"ఎప్పుడైతే నువ్వు హాస్పటల్లో చావు బతుకుల మద్య ఊగిసలాడుతున్నావని తెలుసుకున్నారో, అప్పుడే వారిలో మథనం ప్రారంభమైంది. వాళ్ళ వల్లనే నీకు ఇంతటి కష్టం వచ్చిందని, ఆ పాపం వారిదేనని విలపించి, తమ కోరికను త్యాగం చేసి యథాప్రకారంగా మరలా పనుల్లోకి వచ్చారు..." వివరంగా చెప్పాడు సీతారామారావు.

వింటున్న శ్రీపతిరావుకి తన మనసుని ఎవరో మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. రక్త్తం పంచుకుని పుట్టిన కొడుకులు ఇలాంటి సమయంలోనే రాలేకపోతే మరి ఎప్పుడొస్తారు ? తన భార్య చనిపోయినప్పుడు కూడా పెద్దకొడుకు రాలేదు. తల్లికి తలకొరివి పెట్టే బాధ్యత చిన్నకొడుక్కి వుంది కాబట్టి వాడైనా వచ్చివుంటాడు. డాలర్స్ కి తప్పా మమ్మీ,డాడీలకు విలువలేని దేశంలో జీవనం గడుపుతున్నవారు, అంతకుమించి ఎలా స్పందిస్తారు ?

న్యాయమైన కోర్కెను సైతం త్యజించి, తమ ఆశల్నీ, ఆనందాలనీ త్యాగంచేసి , మరలా పనిలోకి వచ్చి చేరారంటే...ఎవరు వీళ్ళు ? వీరికీ, తనకు మద్యగల సంబంధమేమిటీ ? తన సంపద తన మిత్రునికి ఏనాడూ సహాయపడకున్నా, బాద్యతగల ప్రభుత్వోద్యోగంలో వుండీ, తన సేవలో నిమగ్నమయ్యాడంటే...ఈ సీతారామారావుకీ, తనకూ మద్యగల అనుబంధమేమిటీ ? స్నేహబంధం కాకుండా -' ఆలోచిస్తూనే వెనక్కివాలాడు శ్రీపతిరావు.

*****

సీతా ! నీలాగ సంతోషంగా వుండాలంటే ఏం చెయ్యాలిరా ? " ప్రశ్నించాడు శ్రీపతిరావు దీక్షగా తన ముక్కల్ని చూస్తున్న సీతారామారావుని.
" త్యాగం చెయ్యాలి...ఇదిగో ఇలాంటివాటిని... " ఆఠీన్ రాణిని విసిరేస్తూ చెప్పాడు సీతారామారావు.
"త్యాగం చెయ్యాల్సింది డబ్బుల్నా ?" మరలా ప్రశ్నించాడు శ్రీపతి శాంతంగా.
"దాంతో పాటు చాలా వాటిల్ని... అనుబంధాల్ని... ఆప్యాయతల్నీ... మొహాల్నీ... మోసాల్ని... ఆశల్నీ... ఇటువంటి ఆసుల్నీ..." ఇస్పేట్ ఆసుని డిస్ కార్డ్ చేస్తూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు.
"వీటినన్నింటిని నువ్వు వదిలేశావా ?" అదే ముక్కని తీసుకుంటూ అడిగాడు శ్రీపతిరావు.
"వదిలి పెట్టాల్సిన భాధేలేకుండా అసలు పెంచుకోలేదు వేటినీ కూడా... పెంచుకుంటే పెరిగేది కౌంటే... అది పి.సి గానీ, బి.పి గానీ...నాది షో ..." అన్నాడు సీతారామారావు ముక్కని మూస్తూ.

"నీలాగా ఒక సీక్వెన్సూ..రెండు జోకర్ల ఆట కాదురా నాది... ఏ.సి.. డి.సి..." చెప్పాడు శ్రీపతిరావు సీతా రామారావు జీవితంతో తన పేకముక్కల్ని పోలుస్తూ.
" అందుకే కదరా నీకు కౌంటో... ఎమౌంటో తగుల్తావుంటాయి " చెప్పాడు సరసంగా.
" ఇది నిజమే " మనస్పూర్తిగా ఒప్పుకున్నాడు శ్రీపతిరావు గొల్లుమని నవ్వుతూ -
ఎంతో హాయిగా వుంది శ్రీపతిరావుకి ఆ సంభాషణ. ఓర్వలేని మనసు శ్రీపతిరావుకి కొడుకుల సంగతిని గుర్తుచేసింది ఆసమయంలో.
" సీతా ! వీళ్ళు నిజంగా కొడుకులే నంటావా ? " ప్రశ్నించాడు ధీర్ఘంగా ఆలోచిస్తూ. పంచిన పేకముక్కల్ని ఎత్తుకోలేదు శ్రీపతిరావు . అతని మూడ్ అర్ధమైంది సీతారామారావుకి.
" శ్రీపతి డోంట్ ఫీల్..జనరేషన్ పూర్తిగా మారిపోయింది. దానికి తగ్గట్టుగా మనమూ మారాలి..."
"వాట్స్ ద బ్లడీ జనరేషన్ ? జనరేషన్ మారిందని ఆడవాళ్ళు నవమాసాలు మోయటం మానివేశారా ? తల్లితండ్రులు పిల్లల బాగోగులు చూడటం మానివేశారా ? వాళ్ళలాగే మనం కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించివుంటే, ఇవాళ ఇటువంటి పరిస్థితులు వుండేవా ? " ఆవేశం కట్టలు తెంచుకునే ప్రయత్నం చేస్తుంది శ్రీపతిరావు గుండెలో -
" నిదానంగా ఆలోచించు శ్రీపతి ! తాము కన్నవాళ్ళు తమని వృద్ధాప్యంలో చూస్తారో ? లేదో ? అన్న సంశయం కనుక కలిగితే, ఏ తల్లితండ్రులైనా ప్రాణమిచ్చి ప్రేమగా పెంచగలరా పిల్లల్నీ ?" ప్రశ్నించాడు సీతారామారావు ప్రశాంతంగా.
" ఈ ప్రశంకు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పే జనరేషన్ " విసుగ్గా చెప్పాడు శ్రీపతిరావు.
" నిజమే శ్రీపతి! నేను చెప్పేదేమిటంటే ఇవాళ ప్రతిఫలాపేక్షలేని జీవే...చిరంజీవి. మనం పంచి ఇచ్చే దేనినుంచైనా, ప్రతిఫలం ఆశించకపోవటం ఉత్తమ లక్షణం " చెప్పాడు సీతారామారావు కూలుగా.
" ఏమిటిరా ఆశించకూడనిది ? చావుబతుకుల్లో ఉన్నప్పుడు కన్నకొడుకుల్ని చూడాలనుకోవడం, వారి సమక్షంలో గడపాలనుకోవడం...ఆపేక్ష అవుతుంది గానీ, ప్రతిఫలాపేక్ష ఎలా అవుతుందిరా ? వారి పిల్లలు ఇటువంటి స్థితిలో వుంటే పరుగులు పెట్టిరారూ ? ఈ వయసూలోనూ మనం పరుగులుపెట్టి పోమూ " చెప్పాడు శ్రీపతిరావు శూన్యంలోకి చూస్తూ.

" అదేరా నేనూ చెప్పేది. తండ్రి బాధ్యతే అలా పరుగులు పెట్టిస్తుంది..." అన్నాడు సీతారామారావు.
" వృద్ధాప్యం కూడా బాల్యం లాంటిదే కదరా ? మరో మనిషి ఆసరా అవసరం కాదా ? వారికోసం తపించి వారి మంచిస్థితిని అందించి వారు సంపాదనలో ఉన్నతమైన స్థితిలో వుండేలా చేయగలిగానే కానీ, సంస్కారంలో ఉన్నతుల్ని చేయలేకపోయాను " తీవ్రమైన నైరాశ్యం శ్రీపతిరావు మాటల్లో ధవినించి కన్నుల్లో తడిలా కనిపించింది. గుండెల్లో బాధ కవ్వంలా చిలుకుతుంటే వెన్నలా వస్తుందా విలాసం ?
శ్రీపతిరావు మానసిక ఆందోళన అర్ధంకానిదేమెకాదు సీతారామారావుకి.
"శ్రీపతీ! ఋణానుబంధంతో సంతానం ప్రాణానుబంధంతో సంతోషసంతాపాలు పుడతాయి. ఏదీ మనం ఊహించైంది కాబోదు. జరిగిన దాన్ని స్వీకరించడం, జరుగబోయేదాన్ని స్వాగతించడం మన విధి..." ఉపశమనంగా చెప్పాడు.
సీతారామారావు మటులు కొంత ప్ రశాంతతను అందించాయి శ్రీపతిరావుకి.
అది గమనించి మరలా చెప్పాడు సీతారామావు " ఇప్పుడు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వుండు " చెబుతూఒ శ్రీపతిరావు చెయ్యి నొక్కాడు అనునయంగా స్పృశిస్తూ-
"ఎక్కడుందిరా ప్రశాంతత ? డబ్బులతో కొనగలమా దాన్ని?" ప్రశ్నించాడు వెంటనే.
" ప్రశాంతతకు అడ్రస్సు మన మనసేరా ! దానికున్న మహత్తు ఏమిటో తెలుసా ? దేన్ని మనం గాఢంగా కోరుకుంటామో దాన్నే పొందమని ప్రోత్సహిస్తుంది, దాన్నే అందిస్తుంది. నువ్వు ఒక మనిషిపై ప్రేమను పెంచుకుంటే ప్రేమించమంటుంది. ద్వేషాన్ని పెంచుకుంటే వార్ని దహించమంటుంది... వైదికుడు కోరే యోగమైన వైశికుడు కోరే భోగమైనా అందించే సరస్సు ఈ మనసు. అందుకే దాన్ని మానస సరోవరం అంటారు. ఇప్పుడు నీ మానస సరోవరంలో ఎటువంటి కలతల కెరటాలు ఎగసిపడకుండా, కల్లోల అలలు చెలరేగకుండా నిన్ను ప్రశాంతంగా వుంచే శక్తి కావాలి ! ఆ శక్తి నీ బాధకు ఉపశమనాన్ని అందించి. నీకు సేద తీర్చాలి. అలాంటి శక్తి ఆ గీతకే వుంది. ఎస్...ఇప్పుడు నీకు ఆ గీతే కావాలి..." తర్కించుకుంటూ చెప్పాడు చివరి వాక్యాన్ని సీతారామారావు.
" గీతా ? గీత ఎవరూ ? " ఆశ్చయంగా అడిగాడు శ్రీపతిరావు. కుతూహలమూ వుంది అందులో-
" ఎవరో ? ఏమిటో ? తొందరెందుకూ ? వీలైతే రేపే పరిచయం చేస్తా ! ఇక నాతోడు కూడా వద్దంటావు..." నర్మగర్భంగా చెప్పాడు సీతారామారావు చివరిమాటని.
సిగ్గుతో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీపతిరావుకి కరచాలనం చేసి కదిలాడు సీతారామారావు.
" ఎవరీ గీత ?? " అన్న తీవ్రమైన అలోచనలో నిమగ్నమైపోయాడు శ్రీపతిరావు.

******

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

దృష్టి ...!

'సిడాడే-డి-గోవా ' అది ముప్ఫై అయిదు ఎకరాల్లో కట్టిన స్టార్ హోటల్. అందులో పోర్చుగీస్ కాలాన్ని తలపింపచేసే లగ్జరీ సూట్ 'వాస్కోడిగామా '- ఆ విశాలమైన గదికి ఓ ప్రక్కగా కనిపిస్తుంది బ్లూలాగూన్ లాంటి నీలిసముద్రం. ఆ సముద్రాన్ని చూస్తూ పెయింటింగ్ వేసుకోవడానికి వీలుగా ఏర్పాటుచేయబడ్డ 'ఈసిల్ ' దానికి ఆ గదిలో స్థానాన్ని కల్పించిన కళాకారుడు " యశస్ "- అందుకే ఆ గది అతనికి హాట్ ఫేవరేట్. అతనికి సరిజోడైన యువతి " స్వప్నిక" ఆతని 'హార్ట్ మేట్ '!

*****

ఆకాశానికి నీలిరంగునద్ది అక్కడి నీటితో కుంచెలను శుభ్రంగా కడిగినట్లున్నాడు ఎవరో చిత్రకారుడు. అది నిజమన్నట్లు తలలూపుతున్నాయి పోకచెట్లు. గోవా బీచ్ లన్నింటిలోకి అందమైన బీచ్ 'కొలావా ' దీనికి సమానమైనది ఇండియాలోనే లేదు.

గాలి తీవ్రతకు బీతిల్లి యశస్ మొముని హత్తుకుంది స్వప్నిక చీరచెంగు. ఆ చెంగుమాటున వూరిస్తూ కవ్విస్తున్న ఆమె ఎదపొంగును చూస్తున్నాడు. అతని చిలిపి చూపుల తాకిడిని గమనించి వడివడిగా చేరింది ఆమె గుండెలోతుల్లోని సవ్వడి ఎదపైకి. విసురుగా లాగివేసింది అతని మొహంపై నుంచి తన చీరచెంగును స్వప్నిక.
" ఏమిటీ చోరబుద్దీ?" ప్రశ్నించింది కసరుతూ.
" అది చోరబుద్ధికాదు...వాటిదరి చేరబుద్ది" అన్నాడు.
" కళాకారుడికి కవిత్వం పొంగుకొస్తుదే ?" అడిగింది ఎగిరే ముంగురులని సవరించుకుంటూ.
" రంగుల్నీ, పొంగుల్నీ, హంగుల్నీ చూస్తే నాకు తెలియకుండానే కవిత్వం పొంగుకొస్తుంది. అది నా ఇన్ హెరంట్ క్వాలిటీ.."
చెప్పాడు గర్వంగా.
" ఆహా అయ్యవారి క్వాలిటీ కంట్రోలులో వుండటం మంచిదేమో " చెప్పింది స్వప్నిక తన చీరచెంగు ఎగిరిపోకుండా బిడ్డువద్ద దోపుకుంటూ.
" సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ నేచర్స్ ఫష్ట్ లా అన్నారు..తప్పు నీది కాదు.." అన్నాడు ఆమె చర్యని ఎత్తిపొడుస్తూ
" ఎంతో రసికుడు దేవుడు..సుకుమారమైన పూలనీ ఆహ్లాదాన్నిచ్చే ప్రకృతినీ, ఆనందాన్నిపంచే స్రీకి బదులుగా ఇచ్చాడు మాకు..." అన్నాడు మరల.

సరసమైన ఛలోక్తులతో కూడిన ఆ సంభాషణ ఎంతో పరవశానికి గురిచేసింది స్వప్నికను . ఒక ప్రక్క ప్రకృతి ఒడి, మరో ప్రక్క మనసు మెచ్చిన జోడి. " అటుచూడు..." అరిచి చెప్పాడు దూరంగా బీచ్ వైపు చూపిస్తూ, తలతిప్పి చూసింది స్వప్నిక.

గోల్డెన్ కలర్ లా మెరుస్తున్న శాండ్ పైన చాపలాంటిది పరిచివుంది. దానిపై శాటిన్ కలర్ టర్కీ టవల్, బ్రా, ప్యాంటీ మాత్రమే వేసుకుని బోర్లాగా పడుకుని వుంది ఓ ఇరవై యేళ్ళ యువతి. ఆమె ముందు మోకాళ్ళను ఇసుకలో ఆనించి, మొలకు లుంగీలాంటిది బిగించి, చాతీమీద ఏ ఆచ్ఛదనా లేని కుర్రాడు. కసరత్తుతో మెలికలు తిరిగిన కండలతో-

" ఏంటీ నువ్వు చూడమన్నదీ ?" అడిగింది అమాయకంగా.
" సుకుమారమైన ఆ ఇంతి క్లాంతితో తన మేనును కౌమారం దాటిన ఆ కుర్రాడికి కౌలు కిచ్చినట్లుంది. అరచేతులనే హలాలుగా మార్చి, చూడు ! నేర్పుగా చేస్తున్నాడు మసాజ్ సాగు " చెప్పాడు అలానే చూస్తూ.

తలతిప్పి చూసింది స్వప్నిక వారివైపు. బాడీ ఆయిల్ ని ఆమె వీపు మీదపోసి, మెడ నుంచి కాళ్ళ వరకు రుద్దసాగాడు అతను. మర్ధనలో సమర్ధవంతమైన ఆతని పనితనం ఆ యువతి శరీరానికి కాంతిని, మనసుకి తీరని అశాంతిని అందించింది.

ఇప్పుడు వెల్లకిలా పడుకుని వుంది ఆ అమ్మాయి. సూర్యరశ్మి తన కళ్ళను తాకకుండా వుండేందుకో, లేక తన కళ్ళల్లోని కాంక్షారశ్మి అతని శరీరానికి తాకి అతడిని ' భస్మీపటలం ' కావించకుండా వుండేందుకో తెలియదుగానీ, ఆమె కళ్ళకు ఛష్మా ధరించివుంది. కళ్ళముందు పరిచివున్న శృంగారగనిని కన్నులారా పరవశంతో చూస్తున్నాడు ఆ కుర్రాడు. వసి నింపుకుంటున్న అమె తొడల సొగసుని చూసి ఆతని శరీరంలోనూ 'అంతర్మథనం' ప్రారంభమైంది. ఆమె తాగింది 'ఫెన్నీ మద్యం '- చేను లాంటి ఆమె మేనుపై అతను చేస్తున్నాడు 'ఫన్నీ సేద్యం'- చూస్తున్న స్వప్నికకు చిరాకువేసింది.

" ఈ బ్లడీ సీన్ చూడమనా పిలిచింది " ? కసిరింది.
" అది బ్లడీ సీన్ కాదు మేడం...అందమైన అమ్మాయి బాడీ సీన్ " కొంటెగా బదులుచ్చాడు యశస్.
" ఒళ్ళు బలిసినోళ్ళకది " విసుక్కుంక్ది.
" కాదు ఒళ్ళు అలసినోళ్ళకది " సరిదిద్దాడు.
" తమరువెళ్ళీ చేయించుకోవచ్చుగా... ఏపిల్లతోనో ? " విసురుగా ముందుకు కదిలింది స్వప్నిక.

' క్వీన్ ఆఫ్ గోవా బీచెస్ ' అని పిలవబడే ఈ 'కొల్వా బీచ్' లోని ఈ సీన్ చూసే లావాలా పొంగింది కోపం. మరి జనాల మోజుని తీర్చే ' అంజునా బీచ్ 'ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ? మనసులోనే నవ్వుకున్నాడు యశస్.

*****

ఏడు నదులు, నలభైకి పైగా సముద్రతీరాలు గోవా నగర కన్యక మెడలోని హారాలు. వీర విహారానికి, తీరని విరహానికి తగిన వరాలు. హింధూ, క్రిష్టియన్, ముస్లీం, మతాల సామరస్య మమైకం, విభిన్న సంస్కృతుల సమైక్య లోకం, స్నేహం, సమానత్వం, సాహచర్యం వీటన్నింటి మిశ్రమాల ఫలితమే ప్రశాంత ' గోవా ' -

మూడవ శతాబ్ధం నాటి మౌర్యుల కాలంలో గుర్తింపు పొందిన ఓ చిన్న ప్రాంతం. తదనంతరం చాళుక్యుల, ముస్లీముల, విజయనగరరాజుల, బహమనీ సుల్తానుల, పోర్చుగీసుల, బ్రిటిషర్ల ఏలుబడిలో తన పలుకుబడిని పెంచుకుంటూ, నేడు భారతదేశంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన విహారస్థలంగా పేరుగాంచి, జనం తరించేలా అవతరించింది 'గోవా '- మానవుల మనోవికాసానికి ప్రకృతి ఇచ్చిన వరం... బహుమతి... ఈ ...గోవా !

*****

ప్రపంచంలోని అన్నిరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులందరూ అక్కడే వున్నారా ? అన్నట్లుంది ఆక్కడ చేరిన వారిని చూస్తుంటే ! ఆనందానికి, దాని మూలానికి అదే సరైన వేదికేమో అన్నట్లుంది 'అంజునా బీఛ్- గోవాలో అత్యంత ప్రజాదరణ పొందిన బీచ్ అది.

వయోబేధం, లింగబేధం లేకుండా ఆనందం పొందుతున్నారు అక్కడివారు. ఒక ప్రక్క మసాజులతో సేద, మరోప్రక్క మత్తు పానీయాలతో రొద. ఎక్కడా చూసినా ఆనందపు హేల. అందరి కళ్ళల్లోనూ కాంక్షల జ్వాల. అక్కడి ప్రకృతిని, మనుషుల శరీరాకృతిని, విభిన్న వ్యక్తుల భిన్న సంస్కృతిని, విపరీత జనాల విచిత్ర వికృతిని గమనిస్తూ తీరం వెంట నడుస్తున్నారిద్దరూ. ఆ వాతావరణం మెల్లగా...మత్తుగా...వారినీ కమ్మేస్తోంది !

" ఏలావుందీ అంజునా ?" అడిగాడు యశస్ ఆమె నడుముపై చెయ్యివేసి మెత్తగా నిమురుతూ.
" రంజుగా " అంది చిలిపిగా ఆతని కళ్ళల్లోకి చూస్తూ.
" రంజుగా వుంది ఈ బీచ్చా ? నా టచ్చా ?" ప్రశ్నించాడు ఆమెను కౌగిలిలో బంధిస్తూ.
" రెండూ కాదు . అబ్బాయి గారి పిచ్చి " చెప్పింది ఆతని సంకెలను విడిపించుకుని పరిగెడుతూ.
" ఏయ్ ఆగు..ఆగు.." అంటూ ఆమె వెనుకనే తనుకూడా పరుగు అందుకున్నాడు యశస్.

హరిణిలా పరిగెడుతుంది ఆ తరుణి ఆతని చేతికి చిక్కకుండా. అలా పరిగెడుతున్న స్వప్నిక ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి స్థాణువైపోయింది.

ఎదురుగా ఆడా-మగా జంటలు జంటలుగా, ఏమాత్రం సిగ్గూ-ఎగ్గూ లేకుండా, ఎవరినీ గమనించే స్థితిలో లేరు ఎవ్వరునూ, తమకంతో తమలోకంలో వున్నారందరూ 'జలయఙ్ఞం ' చేస్తూ పూర్తి ' నగ్నంగా'-

" కమాన్..సిట్ డౌన్.." అంటూ ఇసుకపై ఒరిగిపోయాడు యశస్ వెల్లకిలా.
" ఇదేం చోటయ్యా బాబూ ? " ప్రశ్నించింది స్వప్నిక ఇసుకలో తనూ కూలబడుతూ.
ఆమె మొహలోకి చూశాడు యశస్. సిగ్గూనవ్వు లవ్వాడుకుంటున్నాయి ఆమె మోముపై.
" ఇది భోగపరాయణులైన దేవతల స్వర్గ సంబంధమైన ఆటస్థలం. ది సెలస్టియల్ ప్లే గౌండ్ ఆఫ్ వొలాప్టుయస్ గాడ్స్ " అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.

అతను చెప్పిన తీరు ముచ్చటగా వుంది ఆమెకి. నిజమే కదా ! ఇటువంటి విలాసం కోసమే కదా ఎంతో ప్రయాసపడి వచ్చేది ఇంతదూరం ? తన ఆలోచనలలో వస్తున్న మార్పును గమనించింది స్వప్నిక.

గోవా ! నువ్వు తక్కువ దానివేం కాదు ! అనుకుంది మనసులో - నీటితో సయ్యాటలాడుతున్న ఆ అనిమిషులవైపు చూసింది ఓ నిముషం పాటు. విచిత్రం ఇందాక వారిని చూసినప్పుడు కలిగిన 'అసహ్యం ' స్థానే ఇప్పుడు 'ఈప్సితం ' చోటుచేసుకుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే కదా ! ఇచ్ఛ కలిగేది ? అంకురమౌతున్న కొత్త ఆలోచనలను అవలోకిస్తోంది స్వప్నిక.

*****
" నిన్నూ ఇన్ స్పైర్ చేసిన చిత్రకారులెవరు యశస్ ?" ప్రశ్నించింది వైన్ సిప్ చేస్తూ. కొత్తరుచులు అనుభవిస్తోంది స్వప్నిక. ఆమెకు అదే మొదటిసారి మత్తుపానీయం సేవించటం. అతి బలవంతం మీద మరలా ఎప్పుడూ అడగననే 'హామీ ' మీద తాగేందుకు ఒప్పుకుంది.

" చాలా మందే వున్నారు..సర్. గాడ్ ఫ్రే నెల్లర్ అని బ్రిటీష్ ఆర్టిష్ట్..షేక్స్ ఫియర్ ఇన్ పొయిట్రీ నెల్లర్ ఇన్ పెయింటింగ్ అంటారు. ఆయనతో పాటు సర్ థామస్ లారెన్స్, వాన్ డిక్, ది ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆర్ట్... పికాసో, ద లాస్ట్ సప్పర్ పెయింట్ చేసిన లియోనార్డ్ డావెన్సీ...ఈయన గీసిన మరో అద్భుతమే ' మోనాలిసా '...

ఓహ్..గ్రేట్ మిష్టర్ లియోనార్డ్..చీర్స్..హేట్సాఫ్ " అంది గ్లాస్ పైకెత్తి. మత్తు మర్యాదను చిత్తుచేస్తోంది.
" మన రాజా రవివర్మ..ఏ పెయింటింగ్ ఆన్ సెల్యూలాయిడ్..గజగామిని..ఎం.ఎఫ్.హుస్సేన్, మన తెలుగు కళాకారులు... దామెర్ల రామారావు.. వడ్డాదిపాపయ్య.. మన బాపు ..ఇలా ఎందరో మహానుభావులు నా జీవితాన్ని ప్రభావితం చేశారు...వారందరికీ వందనాలు...చెప్పటం ఆపి తలవంచాడు ఒక్కక్షణం. వెంటనే విస్కీ గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు మరల.

" ఈ వర్షాన్ని చూస్తుంటే ఏదైనా అద్భుతాన్ని సృష్టించాలని వుంది నాకు. అంత అద్భుతమైనది ఏమిటన్నదే అర్ధం కావడంలేదు..." అన్నాడు సిగరెట్ ముట్టిస్తూ.
" నేను చెప్పనా ?" అడిగింది గోముగా. చెప్పమన్నట్లు చూశాడు పొగవదులుతూ.
" మోనాలిసాను సృష్టించిన డావెన్సీలా... నువ్వు నీ ఫియాన్సీని సృష్టించు.." అంది గర్వంగా.

పిచ్చినవ్వు మెరిసింది ఆతని మోముపై. ఆతని చేతిలోని సిగరెట్ లానే భగ్గుమని ఆమె హృదయం ఆ నవ్వును చూసి.
" ఏంటా పిచ్చి నవ్వు ? నేను అందగత్తెను కానా ? " కోపంగా ప్రశ్నించింది ఆ రోషనారి.
" నో డౌట్. నువ్వు అద్భుతమైన అందగత్తెవే ! అంత అందాన్ని నేను చిత్రించగలనా ? లేదా ? అనేది ప్రశ్న..." చెప్పాడు యశస్ కూల్ గా సిప్ చేస్తూ.

పౌరుషం బుసలుకొట్టింది ఆమెలో తనకు తెలుసు అది పొగడ్త కాదు. తన అందం అతడిని ఇన్ స్పైర్ చేసే స్థాయిలో లేదా? లేకుంటే తనని అతను ప్రేమించటం ఎలా సాద్యం ? ఇంతకీ తనని ప్రేమిస్తున్నాడా ? లేదా ? ఇది తేల్చుకోవాలి ముందు. స్థిర నిర్ణయం తీసుకుంది స్వప్నిక. మైల్డ్ గా వుంది మెదడు... వైల్డ్ గా మారింది మనసు.

" మైడియర్ స్వప్నిక ! ఆర్ట్ ఈజ్ ఇమ్మోర్టల్ బట్ నాట్ ద బ్యూటీ ! శాశ్వతంగా నిలిచిపోయే చిత్రరాజం కావాలి అంటే అది అద్భుతమైన క్రియేషన్కావాలి గానీ అందం కాకూడదు..." అన్నాడతను.

ఆతని మాటలకు బదులివ్వలేదు స్వప్నిక. మౌనంగా అతడినే చూస్తుంది తీక్షణంగా.

" అటువంటి అద్భుతాన్ని నేను సృష్టించగలను. బట్...నువ్వే తెగించలేవు..." అన్నాడు కవ్వింపుగా.
అమెను అందలం ఎక్కిస్తూ, ఆమె కోరికను అందకుండా చెస్తూ-

" నువ్వేసే గొప్ప బొమ్మకి నేనెలా తెగించాలంటావ్ ?" ప్రశ్నించింది వెటకారంగా.
" వద్దు స్వప్నికా ! పట్టుదలకు పోవద్దు. నీ వల్లకాదు. కొన్ని కోరికలు తీరకుండా వుంటేనే తీపి గుర్తుగా మారతాయి.
అదే అనుభవమైతే చేదుగానూ మారవచ్చు..."
"యూడోంట్... యూ కాంట్... అనే పదాలకి కాలం చెల్లిపోయింది యశస్ ! నీకెలా కావాలి ?"
" రూముకెళ్ళిన తరువాత మాట్లాడుకుందాం..." కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పాడు .
" నథింగ్ డూయింగ్. ఇప్పుడే...ఇక్కడే..." బల్లమీద గట్టిగా చరుస్తూ అరిచి చెప్పింది.

గ్లాసులోని విస్కీని గొంతులోకి వంపుకుంటూ చెప్పాడు మెల్లగా " నగ్నంగా "

లాగోవా అజుల్ డెక్ బార్ 'లో... 'ది లింబో ' పైర్ డాన్స్ మొదలయ్యింది అప్పుడే!!

*****
" డీడ్స్ ఆర్ మేల్-వర్డ్స్ ఆర్ ఫిమేల్.. అన్నారు. వాగినంతసేపు పట్టలేదు నోరు మూతబడటానికి " భాస్వరాన్ని మండిస్తున్నాడు గదిలోకి అండుగిడినంతలోనే.
" ఓ.కే...మిష్టర్ యశస్... ఐయాం రెడీ. యు గెట్ రడీ ఫర్ ద జాబ్... బట్ రిమెంబర్ ఒన్ థింగ్. ఈవిల్ పర్ స్యూట్స్... బ్రింగ్ ఈవిల్ రెప్యుటేషన్ " కటువుగా చెప్పింది స్వప్నిక చివరి వాక్యాన్ని.

ఆమె మెంటల్ టెంపర్మెంట్ ఆతనికి తెలియంది కాదు. ఎం.బి.ఏ చదువు. మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద హోదా. దానికి తోడు అందానికి వీనస్ దేవతననే గర్వం. వెరశి అమె అహానికి ఆభరణాలు. ఇప్పుడు వాటినన్నింటినీ విడిచేయడానికి, ఆతనికి విడిదికియ్యడానికి సిద్దమవుతున్నది ఆ ' స్నిగ్ధ సౌందర్యవతి '-

*****

ఈజిల్ పై కాన్వాసు క్లాతును బిగిస్తున్నాడు యశస్. స్వప్నిక ఒంటిపై దుస్తులు నేలకు వాలుతున్నాయి. ఆమె రూప,లావణ్యాలను గమనిస్తున్న యశస్ ని చూసి ఆమె చెంపలు కెంపులయ్యాయి. మేను కనక పుష్యరాగ వర్ణమైంది. మనసు వజ్ర తుల్యమైంది.

" ఈ కళాకారుడు భయపడేలా ఆ కోపరూపమేమిటి అపరకాళీ ? నిక్షేపాల గనివి..ఏ ఎమ్రాల్డ్సునో , డైమండ్స్ నో చూపించి... మెరిపించక !" అన్నాడు యశస్ ముడిబిగించిన ఆమె సిగపాయలను వదులుచేస్తూ.

" ముందు లైట్స్ ఆఫ్ చెయ్ " అంది స్వప్నిక లోతొడుగులతో అర్ధనగ్నంగా నిలుచుని.

" ఓ హో...రేపు ప్రపంచం వెలుగు చూసే ఓ అద్భుతం... నేడు ఈ చీకట్లోనే ప్రారంభమౌతుందన్నమాట..." అంటూ ఆ రూములోని లైట్స్ ఆఫ్ చేశాడు యశస్.

మైఖెలాంజిలో మలచిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది స్వప్నిక నగ్నంగా. వెన్నెల జడివానలో తడిసి, అలసి సేద తీర్చుకుంటున్న ' గ్రీకుదేవత ' లా వుంది. పరిశీలిస్తున్నాడు యశస్ ప్రశాంతంగా ఆమె సౌందర్యాన్ని -

నల్ల త్రాచు కురులు...వక్షోజాలు గిరులు... మేను పసిడి సిరులు... ఆమె తనువునా అణువణువనా ఉప్పొంగుతున్న సోయగాల నయాగరా - అవయవ సౌష్టవంతో కళాకారులకు స్పూర్తినిచ్చే రూపలావణ్యాల వైభవమూర్తి. నగ్నంగా, ఉద్విగ్నంగా వున్న ఆమె... సురులు కనలేని అందాల యేరు...సౌందర్యాల తేరు !

కళ్ళు మూసుకుని వుంది ఆమె. " స్వప్నికా " పిల్చాడు మృధువుగా. మధువుని గ్రోలి మాధుర్యాన్ని ఒలికిస్తూ. కళ్ళు తెరిచి చూసింది ఆతని వంక ' ఏమిటన్నట్లు '

" నీ చిత్తరువుని చిత్రించే ముందు చిన్న కండీషన్ " అన్నాడు యశస్ మెల్లగా.
"మరలా ఏమిటీ? " విసుగా అడిగింది.
" ఆహా...ఏమీలేదు...నేను చూపంచేంత వరకూ దీన్ని నువ్వు చూడకూడదు..." చెప్పాడు స్పష్టంగా.
"బుల్షిట్..మరి ముందెందుకు చెప్పలేదు " అరిచింది.

ఆమె ఆవేశానికి తగినట్లుగా కదలాడుతున్నాయి ఆమె వక్షోజాలు. వాటివంకే కన్నార్పకుండా సూటిగా చూస్తూ చెప్పాడు సంజాయిషీ ఇస్తున్నట్లుగా-

" నువ్వు ఒప్పుకోవని..."
" మరి ఇప్పుడెందుకు చెబుతున్నావ్ ? " అరిచింది స్వప్నిక మరింత గట్టిగా.
" నీకు నచ్చకపోతే డ్రాప్ అయిపోవచ్చనీ ! "
" యూ..స్టుపిడ్..డ్రాప్ అవడానికా అన్నింటిని వదిలేసింది ?" ఆవేశం ఆమె శరీరం మీద తాండవం చేస్తోంది. కన్నులు మూసుకుంది గట్టిగా.
" ఇంతకీ తమరు ఆమోదిస్తున్నట్టా ? లేదా ? " అడిగాడు సీరియస్ గా, తన్నుకొచ్చే నవ్వును అదిమి పెట్టుకుంటూ.
" అయ్యా ! మహానుభావా! మీ చిత్తం.. మాభాగ్యం.. మీ దయే.. మా అదృష్టం.. కానివ్వు " అని రెండు చేతులెత్తి దణ్ణంపెట్టి, మరలా కోపంగా కళ్ళు మూసుకుంది స్వప్నిక.
" అవును మీ చిత్రమే...మా భాగ్యం ! మీద..యే... మాదృష్టం ! " అన్నాడు యశస్ నవ్వుతూ అక్షరాలని మారుస్తూ... ద్వంద్వార్ధాలకు చేరుస్తూ -

ఉలిక్కిపడింది స్వప్నిక. మీ 'దయే ' అన్నపదంలోని మొదటి రెండక్షరాలని కలిపి, ఈ సందర్భంలో అతను పలికిన తీరుకీ, ఆ పదంలోని 'శ్లేషకి ' ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచింది. నయనాలు పగడాల పువ్వులయ్యాయి.

కొంచెం ఒక పక్కగా ఒరిగిపడుకుని వుంది స్వప్నిక. ముంగురులని ఆమె తల వెనుకగా పరిచాడు. ఆమె ఎద పొంగులు రెండూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అతి రసమ్ములు సుకియాలమృత కలశమ్ములు... కూనిరాగం తీస్తున్నాడు యశస్ కాన్వాసుపై రంగులద్దుతూ.

" మొహానికి కవిత్వమొకటీ " గొణికింది స్వప్నిక.
" చెప్పాగా ! రంగులని చూసినా...పొంగులని చూసినా..."
" చాలు..చాలు.. విన్నాం ఒకసారి..ముదు పనిచెయ్యి " అరిచింది స్వప్నిక విసుగ్గా.
" ఛీ...ఛీ..కోపంలో నువ్వేం బూతులు మాట్లాడుతున్నావో...నీకే తెలియటం లేదు.." అన్నాడు యశస్ చిలిపిగా చూస్తూ, కొంటెగా నవ్వుతూ.
" నువ్వు ఈడీయట్ వే అనుకున్నా... స్టుపిడ్ వి కూడా.." అంది కోపంగా కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ.

ఆవేశపడితే సుఖమేముంది ? కొరివితో తల గోక్కుంటే మంటకాక మరేమిటీ ? చటుక్కున మౌనం వహించిది స్వప్నిక కన్నులుమూసుకుంటూ
*****

బద్దకంగా కళ్ళు తెరిచింది స్వప్నిక. ఉదయం 11 గంటలు దాటుతుంది. తన వంటిపై బెడ్ షీట్ కప్పి వుంది. కుర్చీలో తల ఒక పక్కకు వాల్చి నిదురబోతున్నాడు యశస్. తన పోట్రెయిట్ చూడాలన్న కోరిక కలిగింది.

ఆతను లేచే లోపేచూడాలి. కొన్ని విషయాలలో ఎంతో జనరస్ గా వున్నా, కొన్ని విషయాలలో పరమ మూర్ఖుడు ! మెల్లగా లేచింది బెడ్ పై నుంచి. పెయింటింగ్ బోర్డ్ పైన క్లాత్ వేసివుంది.

" ఆహా...నేను చూడకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నావ్ నాయనా ! " అనుకుంది మనసులో.

బోర్డుపై వున్న క్లాత్ ని తొలగిస్తుండగా " స్వప్నికా ! డొంట్ సీ ! మన కండీషన్ మర్చిపోకూ ! " హెచ్చరింపుగా వుంది యశస్ వాయస్.
" అది అప్పటిమాట...తెలివి నీ ఒక్కడి సొత్తే కాదు ! కీప్ క్వైట్ " అంటూ తొలగించి, చూసిన స్వప్నిక షాకైపోయింది.

ఎదురుగా కనిపిస్తున్న పెయింటింగుని చూసి గిర్రున నీళ్ళు తిరిగాయి ఆమె కళ్ళల్లో. " ఏమిటిదీ ? " అరిచింది పిచ్చి కోపంగా. పగలబడి నవ్వుతున్నాడు యశస్. కాన్వాస్ క్లాత్ మీద చిత్రించబడివుంది... చాలా అసహ్యంగా... పళ్ళు ఇకిలిస్తూ... ' ఓ ముసలి కోతి ' -
*****
గోవా నుంచి తిరిగివచ్చి పది పదిహేను రోజులవుతున్నా, తనని కలిసే అవకాశం యివ్వలేదు స్వప్నిక యశస్ కి. ఆ రోజు అతని బర్త్ డే అవడం వలన అతని ఆహ్వానాన్ని మన్నించింది. డిన్నర్ కి వస్తానని మాట ఇచ్చింది. అందుకే పంక్చువల్ గా టైముకు వచ్చింది.

' గ్రాండ్ కాకతీయ హోటల్ ' ఎంట్రన్స్ వద్దనున్న గ్లాసుడోర్ నుంచి కనిపిస్తోంది, ఎదురుగా గోడకు తగిలించిన పెయింటింగ్- చూపరులను దిమ్మెరపరచే అద్బుతమైన పెయింటింగ్- పున్నమి వెన్నెల కాంతులలో తనువు ఆరబోసుకుంటున్న స్త్రీ ! అదీ నగ్నంగా !!


చూస్తున్న స్వప్నిక గుండెలయ తప్పింది. ఆ కలర్ కాంపోజిషన్ అంతా యశస్ మెయింటైన్ చేసేదే. భయంతో మొద్దుబారిపోయింది స్వప్నిక మెదడు. కొంపదీసి ముఖ కవళికలను స్పగోవా నుంచి తిరిగివచ్చి పది పదిహేను రోజులవుతున్నా, తనని కలిసే అవకాశం యివ్వలేదు స్వప్నిక యశస్ కి. ఆ రోజు అతని బర్త్ డే అవడం వలన అతని ఆహ్వానాన్ని మన్నించింది. డిన్నర్ కి వస్తానని మాట ఇచ్చింది. అందుకే పంక్చువల్ గా టైముకు వచ్చింది.

' గ్రాండ్ కాకతీయ హోటల్ ' ఎంట్రన్స్ వద్దనున్న గ్లాసుడోర్ నుంచి కనిపిస్తోంది, ఎదురుగా గోడకు తగిలించిన పెయింటింగ్- చూపరులను దిమ్మెరపరచే అద్బుతమైన పెయింటింగ్- పున్నమి వెన్నెల కాంతులలో తనువు ఆరబోసుకుంటున్న స్త్రీ . అదీ నగ్నంగా ! చూస్తున్న స్వప్నిక గుండెలయ తప్పింది. ఆ కలర్ కాంపోజిషన్ అంతా యశస్ మెయింటైన్ చేసేదే. భయంతో మొద్దుబారిపోయింది స్వప్నిక మెదడు. కొంపదీసి ముఖ కవళికలను స్పష్టంగా చిత్రించాడా ? అదిరే గుండెతో వడివడిగా వెళ్ళింది ఆ చిత్రం వైపు -

ఆ వర్షం కురిసిన రాత్రి- గోవాలో- వాస్కోడిగామాలో - తనని నగ్నంగా చేసి, యశస్ వేసిన పెయింటింగే అది. ఆశ్చర్యం ! దూరాన్నుంచి చూస్తే నగ్నంగా కనిపించిన ' స్త్రీ మూర్తి ' దగ్గరకు వచ్చి చూస్తే ' ఎడారి సోయగం ' లా మారిపోయింది.

తన తల వెనుకన పరిచిన జుట్టు సూర్యరశ్మితో దాగుడుమూతలాడుతున్న మేఘాల నీలినీడలుగా మారిపోయింది. అమృతకలశాలంటూ తీర్చిదిద్దిన తన ' ఎద భాగం ' రాశిగా పోసిన ' ఇసుకదిబ్బలుగా ' రూపాంతరం చెందింది. వాటిపై మేనువాల్చి శిరస్సునెత్తి చూస్తున్న ' ఉష్ట్రపక్షులు రెండూ... ' కుచ శిఖరాగ్రాలుగా ' కనిపిస్తున్నాయి - అనుదిన సాధనతో నాజూకైన తన ' నడుము ' ఈదురుగాలికి ఖచించబడిన ' ఇసుకతిన్నెలా ' తరిగి, వంపు తిరిగి వుంది. తన పసిడివన్నె ' మేను ' సూర్యకిరణాలలో మెరుసున్న ' సైకతపానుపుగా ' మారింది.

దీక్షగా, పరీక్షగా చూస్తున్న స్వప్నిక సిగ్గుల వూబిలో కూరుకుపోయింది ఒక్క క్షణం. ' భగవంతుడు తనలానే సృష్టించేందుకు స్త్రీలకే ఇచ్చిన గొప్ప వరం ....' మాన సరోవరం ' - ఖర్జూలాలను పండించే ' ఒయాసిస్సులా ' ఒదిగిపోయింది.

అందమైన ఓ స్త్రీ శరీరాకృతిని ప్రకృతితో అన్వయించి, యశస్ తన ' మనోదృష్టిచే ' సృషించబడిన అద్భుత చిత్రరాజమది. వర్ణాలతో ప్రాణాలు పోసుకున్న సజీవమైన సుందర దృశ్య రూపమది.

ఆనందభాష్పాలు నయన పుష్పాలవుతున్న వేళ అస్పష్టంగా కనిపించాడు యశస్ ఆమె కళ్ళకి. ఎప్పుడు వచ్చి ఆమె దగ్గర నిల్చున్నాడో తెలియలేదామెకు. " వెళ్దాం పదా " అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు రెస్టారెంట్ వైపుకి.

ఉవ్వెత్తున లేచిన ఖేధ తరంగం తీరాన్ని తాకి మోదమైంది. అంతవరకూ కలతతో వర్షించిన ఆమె మనసు, హర్షంతో వెలసిన సప్తవర్ణాల ఇంధ్రధనస్సైంది.

" దీన్ని ఏ పద వర్ణాలతో వర్ణిస్తావో... ఏ వర్ణాలతో చిత్రిస్తావో చెప్పు యశస్ ? " అడిగింది స్వప్నిక తన దిగంబరమైన రూపం యొక్క ప్రతిరూపాన్ని అంబరమంటిన సంబరంతో తదేకంగా చూస్తూ -
" అణోరణియాన్...మహతో సుహియాన్ " అన్నాడు ప్రేమగా, ఆమె చేతిని వత్తుతూ.
" అంటే ?? "
" అణువు కన్నా చిన్నది...మహత్తు కన్నా గొప్పది " చెప్పాడు ప్రేమార్తి నిండిన స్వరంతో.
" ఏమిటది ?" అడిగింది ఆతని ప్రేమ కడలిలో నిలువెల్లా మునిగిపోతా.
" నా మనసు " చెప్పాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.

బలమైన ఆతని ప్రేమ పవనాలకి పారవశ్యంతో తేలిపోతున్న ఆ భామ అతను చేస్తున్న చర్యను గమనించలేదు.

" ఏమిటిదీ యశస్ ? " అడిగింది ఆశ్చరంగా తన వేలుకి తొడిగిన అంగుళీయకాన్ని చూస్తూ.
" వీ వంటిదే... వజ్రం ! " చెప్పాడు ఆమె చేతిని స్పృశిస్తూ.

' నీవంటిదే ' అన్న పదం లోని శ్లేష. వజ్రంతో పోలికా, ఆమెను అనిర్వచనీయమైన ఆనందాంబుధిలో ముంచివేసింది.

యశస్ భావ రేతస్సుకు హిమికమై కరిగిపోతున్నది స్వప్నిక. ఆతని ప్రేమాతీంద్రియ శక్తికి సమ్మోహితురాలై ' యతీంద్రుడైన ' యశస్ ఎదపై వాలిపోయింది ' స్నిగ్ధ సౌందర్య లతిక ' స్వప్నిక అతని వశమయ్యేందుకు !!!

శుభం !


స్వాతి వార పత్రిక 20-9-2002.

30, డిసెంబర్ 2008, మంగళవారం

మనసే వెన్నెల...!!!


కాలింగ్ బెల్ మోగేసరికి ఉలిక్కిపడింది స్నిగ్ధ. ఆలోచనలను వదిలించేసుకుని విసుగ్గా లేచింది బెడ్ మీదనుంచి. ఈ వేళప్పుడు భర్త ఇంటికిరాడు. మరెవరై వుంటారు అనుకుంటూ తలుపు తెరిచిన స్నిగ్ధ, ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి "హాయ్..మైడియర్ " అంటూ అమాంతంగా వచ్చి వాటేసుకుంది ఆనందాన్ని పట్టలేక. వచ్చిన అతిధి స్నిగ్ధ చిన్ననాటి నేస్తం 'కాంక్షిత '-
స్నేహితురాళ్ళ ఆత్మీయానుబంధాన్ని ఆనందంగా చూస్తున్నాడు కాంక్షిత భర్త జోసెఫ్.
" వెల్ కం సార్..రావే నిన్నుకూడా ఆహ్వానించాలా..? అంటూ సాదరంగా ఆహ్వానించింది స్నిగ్ధ ఆ ఇద్దర్నీ.
ఓళ్ళంతా ఉత్సాహాన్ని నింపుకుంటూ లోపలికి అడుగుపెట్టింది కాంక్షిత భర్త జోసెఫ్ తో. భోజన కార్యక్రమాలను ముగించి నడుంవాల్చాడు జోసెఫ్.
"రావే..మనిద్దరం బెడ్ రూంలో కూర్చుంద్దాం.. అంటూ బెడ్ రూం వైపు దారితీసింది స్నిగ్ధ. ఆమె వెనకాలే నడిచింది కాంక్షిత.
స్నిగ్ధ బాత్ రూంలోకి వెళ్ళేసరికి బెడ్ రూం ని పరిశీలించసాగింది కాంక్షిత. అంతా ఆశ్చర్యంగా వుంది ఆమెకి.

అందానికి, ఆకర్షణకి ఎంతో ప్రాధాన్యతనిచ్చే స్నిగ్ధ, తన ఇంటిని యిలా ఉంచుకోవడమేమిటీ..? ప్రభుత్వాఫీసుల్లో ఫైళ్ళలా దుమ్ము పేరుకున్న ఫైళ్ళు, ఇంటినిండా షేర్స్ తాలూకు పేపర్స్, టోటల్ గా బెడ్ రూం నీటుగా వున్న స్టోర్ రూంలా వుంది. కాలేజీ డేస్ లో ఎలా వుండేది స్నిగ్ధ ?

ఓ మెరుపుతీగలా.. ఓ విరిసిన పువ్వులా..ఎంతో అందంగా ,చలాకీగా వుండేది? సన్నని నడుము నయాగరా జలపాతాన్ని గుర్తుచేస్తూ, ఎక్కుపెట్టిన ధనస్సులా కనిపించేది. కుర్రకారుని కనికట్టు చేసేది ఎదుగుతున్న చనుదోయ .. ఆ భ్రాంతి నుంచి కష్టపడి చూపు మరల్చుకుంటే, చూసినంతనే మది జారిపోయేలా చేసేది ఆమె లోతైన నాభి లోయ. ఆ లోయలోనే తమ చూపు నిలిపి, మతి పోగొట్టుకున్న కుర్రకారు, సైకిళ్ళతో, స్కూటర్లతో ఎదురుగా వచ్చే వారిని గుద్దేసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. సీనియర్సే కాదూ..జూనియర్సూ, ఆబగా చూసేవాళ్ళు ఆమె వంక. క్లాస్ మేట్స్ ఐతే, స్నిగ్ధమాల మా క్లాస్ మేట్ అని చెప్పుకోవడాన్నే ప్రివిలేజ్ గా భావించేవాళ్ళు.

' నా స్వప్న లోకాన మెరిసే తరుణీ తటిల్లత..నాపై ప్రేమజల్లులు కురిపించే తరుణం వాటిల్లదా..? అంటూ తమ ప్రేమని కవిత్వరూపంలో ముద్రించేశారు చాలామంది కాలేజీ సావనీర్లో. అలా కాలేజీని తన అందచందాలతో ఉర్రూత లూగించిన సుందరి ఇలా తయారైందేమిటీ..? కొంపదీసి దాంపత్య జీవితం అన్యోన్యంగా లేదా..? అన్న సందేహం కలిగింది కాంక్షితకి.
అంతలో బాత్ రూ లోనుంచి ఫ్రెష్ గా తయారై బయటకు వచ్చింది స్నిగ్ధ.
"ఎలా వుందే నీ ముంబయి జీవితం ? అడిగింది స్నిగ్ధ బెడ్ పై కూర్చుంటూ.
"హాయిగా వుంది..కోరుకున్న ప్రియుడు ..పైగా అంతో..యింతో పేరున్న చిత్రకారుడు..? చెప్పింది కాంక్షిత.
"ఆయన వేసిన పెయింటింగ్స్ ఆల్బం..వుందా ఇప్పుడు..? కుతూహలంగా ప్రశ్నించింది స్నిగ్ధ .
" తరువాత చూపిస్తాగానీ, మీవారు ఏ టైముకు వస్తారు రెగ్యులర్ గా ? " అడిగింది కాంక్షిత.
" జనరల్ గా సెవన్ ఎయిట్ అవుతుంది.."
" అంతదాకా ఒంటరిగా వుండాలంటే బోర్ కదే ..? "
" ఏం చెయ్యగలం..? ఏ టీ.వి నో చూడటం తప్ప.."
" బిజినెస్ బాగుందా..? " ప్రశ్నించింది కాంక్షిత.
"కాంట్రాక్ట్ వర్క్స్ బాగానే వున్నాయి. బిల్స్ క్లియరెన్సే సరిగ్గా జరగటం లేదు. ఆ మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ స్ట్రైక్, ఆ తరువాత ట్రాన్స్ పోర్ట్ వాళ్ళ స్ట్రైక్, ఆ తరువాత పీపుల్స్ వార్ వాళ్ళు, ఆ తరువాత రాజకీయ పార్టీల వాళ్ళు..ఇలా స్ట్రైక్స్ ఎఫెక్ట్స్ తో వర్క్ డిలే.. ఎగైన్ పెనాల్టీస్..పెండింగ్ బిల్స్..! చచ్చిపోతున్నాం..తెచ్చిన చోట ఇవ్వలేకపోతున్నాం.. ఇంట్రెష్టులు చూస్తే పాపంలా పెరిగిపోతున్నాయి..."
మౌనంగా స్నిగ్ధనే చూస్తూ వింటుంది కాంక్షిత.

" ఇంత కష్టపడి వ్యాపారం చేసి, గవర్నమెంట్ కు టాక్స్ లు కట్టాలి.. ఆఫీసర్లకు లంచాలు ఇవ్వాలి.. నష్టపోతే..ఈ ఇన్ కం టాక్స్ వాళ్ళు తిరిగి మనకేమిస్తారు..? కనీసం అప్పుగానైనా యివ్వరు.." ఆవేశంగా వుంది స్నిగ్ధ వాయస్.
"బిజినెస్ అంటేనే అంత. అయినా ఆ తలనొప్పి మనకెందుకు గానీ,..ఆల్బం పట్టుకోస్తానుండు.." అంటూ లేచింది కాంక్షిత. స్నిగ్ధ వ్యాపార వ్యవహారాల తలనొప్పి ఆమెకు పట్టేవేసింది అప్పటికే -
*****
రాత్రి పదకొండు గంటలు దాటుతుండగా, ఇంటికి వచ్చాడు అరవింద్. తలుపుతీసిన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. బయటకు వెళ్ళేటంకుంకు నీట్ గా ముస్తాబై నట్ట్లుగా వుంది స్నిగ్ధ. ఆ వేళ్ళప్పుడు రోజులా నిద్రపోకుండా ఎదురుచూస్తూ

" వ్వాట్టే గ్రేట్ చేంజ్..? ఏమిటీ విశేషం ? స్నిగ్ధాదేవి గారు ఈ వేళ్ళప్పుడు ఇంత అందంగా..అదీ నిద్రపోకుండా..? "
ఆశ్చర్యంగా అడిగాడు అరవింద్.
"ష్..అరవకండీ.. గెష్ట్స్ వచ్చారు..." అంది స్నిగ్ధ నోటిమీద వేలువేసుకుని, పక్క గదివంక చూపిస్తూ.
" అదీ సంగతీ..అందాలు అతిధులకి..మందలిపులు మొగుడికి .. ఇంతకీ వచ్చిందెవరూ ?" గట్టిగా నవ్వుతూ ప్రశ్నించాడు అరవింద్.
"ముందు గదిలోకి రండి చెబుతా.." అంది స్నిగ్ధ తలుపుమూసి బెడ్ రూం వైపు

" గదిలోకి వస్తే చెప్పడమేమిటీ.. చక్కగా చూపించాలి గానీ.." మళ్ళీ గట్టిగా నవ్వాడు అరవింద్.
' బుద్ధివుందా..?' అన్నట్టు చూసింది స్నిగ్ధ భర్త వైపు. మరింతగా నవ్వుతున్నాడు అరవింద్ మందు మత్తులో.

వినిపిస్తూనే వున్నాయా మాటలు .. శృంగారానికి తిధులు,నక్షత్రాలు పరిశీలించుకుంటున్న అతిధులకు. ఫలహారాలకంటే ముందుగానే తన భర్త అరవింద్ ని అతిధులకి పరిచయం చేసింది స్నిగ్ధ.
" రాత్రి బాగా పొద్దుపోయిందా వచ్చేసరికి..." అడిగాడు జోసెఫ్,
"కొత్త టెండర్కి వర్కవుట్ చేస్తున్నాం.. దాంతో కొంచెం లేట్ అయ్యింది.." చెప్పాడు అరవింద్.
" బిజినెస్ ఎలా వుంది..?" ప్రశ్నించాడు జోసెఫ్.
" లాభనష్టాల రైలు పట్టాలపై రైలు ప్రయాణం మా వ్యాపారం..." చెప్పాడు అరవింద్.
" ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేద్దామనుకుంటున్నాను.. ఎంక్వైరీ కోసమే వచ్చా.." చెప్పాడు జోసెఫ్ తన రాక గురించి.
" వెరీగుడ్ వెళ్దాం..పావుగంటలో రెడీ అవుతా.." అంటూ లేచాడు అరవింద్ డైనిగ్ టేబుల్ వద్ద నుంచి.

* * * * *
డైనింగ్ టేబుల్ వద్ద చేరాయి రెండు జంటలు. ఉదయం నుంచి కలిసి తిరగటం వలన పురుషుల మధ్య పరిచయం, మందుకొట్టే వరకు పుంజుకుంది. జోసెఫ్ కి రమ్ము అంటే యిష్టమని, అదే తాగాడు అరవింద్ కూడా. రెండు పెగ్గులు వేసి విందుకి సిద్దమయ్యారు .

" నేర్చుకో..కాయగూరల్ని కూడా ఎంత రుచికరంగా వండవచ్చో.." అన్నాడు జోసెఫ్ భార్యతో.
ఆనందం తొంగి చూసింది స్నిగ్ధ మోములో.
" పొరుగింటి పుల్లకూర రుచి.." అంది కాంక్షిత మూతి ముడుస్తూ.
" అన్నయ్యగారు తిన్నది ఆకుకూర కాదు..దుంపల కూర.." చెప్పింది స్నిగ్ధ కాంక్షితను రెచ్చగొడుతూ.
" స్నిగ్ధ ఏమి చేసినా దుంపల కూరలానే వుంటుంది.చికిన్ వండిందంటే, చిలకడదుంప కూరలా ,తియ్యగా వుంటుంది.." ఎగతాళి చేశాడు అరవింద్ భార్యని.
"బహుశా మీకు మా ఆవిడ చేసిన వంట నచ్చినట్లుంది. ఎందుకంటే కాంక్షిత చికెన్ వండిందంటే, బంగాళాదుంపల కూరాలా వుంటుంది.." చెప్పాడు జోసెఫ్ నవ్వుతూ.

అలా నవ్వులతో కాలాన్ని పువ్వులు పూయించి, తమ తమ గదుల్లోకి చేరాయా జంటలు, తమ మదిలోని కోరికల గంట మోత మోగించేటందుకు -

ఇంటి తలుపులకు గడియ వేసి, పడక గదిలోకి చేరిన అరవింద్ కి మది తలుపులు తెరిచి ఎదురుచూస్తున్న స్నిగ్ధ కనిపించింది కనులుమూసుకుని. మెల్లగా ఆమె పక్కన వాలాడు అరవింద్. మూసిన ఆమె కనురెప్పల మాటున పరిగెడుతున్న కోరికల సెలయేరు . చూస్తున్న అతని కన్నుల్లో కాంక్షల జోరు.

చీర ముసుగు వేసుకున్న గిరులనూ, నారీ బరువులనూ చూస్తున్నాడు అరవింద్ ప్రశాంతంగా. గుండె లోతుల్లో భూకంపం వచ్చినట్లుగా ప్రకంపిస్తున్నాయి గిరులు. ఫ్యాన్ గాలి తీవ్రతకు భీతిల్లి తొలగిపోయింది చీరచెంగు. చూపుల చుట్టానికి స్వాగతం పలుకుతుంది ప్రధాన ద్వారం.. నాభీ రంద్రం.. చూపుడువేలుతో ఆ రంధాన్ని మూసే ప్రయత్నం చేసాడు అరవింద్.ఆలోచనలతో అనుభూతి అంచులకు చేరిన స్నిగ్ధ, ఆ చర్యతో అనుభవాల ఒడ్డుకు చేరింది.

రమ్మంటూ రెచ్చగొడుతుంది ఆమె ఎదసొమ్ము. లెమ్మంటూ లేపుతుంది అతనిలో రమ్ము. ఆమె ఒంటిపై జోడు చేతుల సవ్వారీ మొదలెట్టాడు అరవింద్ మెల్లగా.అతని చేతివేళ్ళు ఛురికల్లా మారి, ఆమె చీర కుచ్చిళ్ళను తెగవేశాయి. కోరిక వెల్లువతో పెల్లుబుకుతున్న ఎదపొంగుల ఒత్తిడికి తెగిపడ్డాయి ఆమె జాకెట్ హుక్స్. బట్టబయలయ్యాయి ఆమె ఎద సంపదలు.. గుప్త నిధులు.. వెంటనే వాటిపై పడ్డాయి ఆ గజదొంగ లుక్స్.

ఆమెపై పడి, దోచుకుంటున్నాడు అరవింద్ ఎదురులేని మగసిరితో ఆమె సిరిని. తనువుతో పోరాడుతూ తనూ కలబడసాగింది స్నిగ్ధ. అది హోరాహోరి పోరు. ప్రేమ పారవశ్యపు కసితో, కోరికల పగతో, ఒకరికొకరు వశం కాని ఆవేశంతో, సాగిస్తున్నారు కారణం లేని రణం. అది భయంకరమైన స్త్రీ పురుషుల శృంగార రణం.

అవిశ్రాంతంగా పోరాడుతున్న స్నిగ్ధకు తెలిసిపోతూనే వుంది, సోలిపోతున్న తన స్థితి. తూలిపోయే శరీరంతో తను, తూనీగలా తన శరీరంపై అతను. వాలిపోతున్నది స్నిగ్ధ ఓటమిలో, అయినా సరే వదలటంలేదు అరవింద్ ఆమెను తన ఫోరాటంలో. ఆ....అనే మూలుగుతో సోలిపోయింది, పూల పుప్పొడి గ్రోలుతున్న గండు తుమ్మెద - తనువు మరిచి తరిచెను పువ్వు ఎద. చిరు చెమటల చిత్తడిలో తడిసి అలసి సొలసి పోయారు ప్రేమ కామపు శత్రువులు. చాలాకాలం తరువాత వారి సుఖసంసారంలో అది .... 'అమృతం కురిసిన రాత్రి ' -

*****

కాంక్షిత లేచేసరికి వంటగదిలో కాఫీ రెడీచేసే ప్రయత్నంలో వుంది స్నిగ్ధ. మెల్లగా వెళ్ళి వెనుకనుంచి ఆమెను బంధించింది కాంక్షిత మాట్లాడకుండా.

" అరవిందునుకి రాత్రి విందు కడుపు నింపలేదా ? పరగడుపునే ఏంటీ ఆకలి కౌగిలి..? " ప్రశ్నించింది స్నిగ్ధ తనని వాటేసుకున్నది భర్తేనని తలపోస్తూ. రాత్రి తలుకూ అనుభూతులు ఇంకా పొడారి పోలేదు ఆమెలో -

"అతిధులను అవతలకి నెట్టి, నీ మొగుడికిచ్చిన విందేమిటే చెలి..? " నవ్వుతూ చిలిపిగా ప్రశ్నించింది కాంక్షిత. సిగ్గుపడింది స్నిగ్ధ తన తొందరపాటుకి.

" వేడివేడిగా అతిధులు ముందు ఆరగించిన విందే, నేనూ మా ఆయనా పంచుకుంది.." చెప్పింది స్నిగ్ధ తనేం తక్కువేం కాదన్నట్టు. అప్పుడే కనిపించింది కాంక్షితకు ఆమె బుగ్గపై పంటిగాటు.

" సొట్టబుగ్గలో పంటిగాటు చుక్కైందేమిటే చిత్రంగా...? " అంది కాంక్షిత స్నిగ్ధ బుగ్గమీద పొడుస్తూ -

" మీ వారు పాన్ వేసుకుంటే నీ నోరు పండలా విచిత్రంగా..? " కాంక్షిత పెదవులమీద మృదువుగా తన చూపుడు వేలుతో రుద్దుతూ చెప్పింది స్నిగ్ధ.

" సరేగాని,రాత్రి మీ ఆయన మిగిలిన రమ్ముని నీతో పాటు రూంలోకి తీసుకువెళ్ళాడు కదా ? నిన్ను రమ్మనలా ? " అడిగింది కాంక్షిత కూతూహలంగా.ఎందుకలా అడిగిందో అర్ధంకాలేదు స్నిగ్ధకు.

" నన్నెందుకు రమ్మంటారు..? ప్రశ్నించింది

అమాయకంగా" రమ్మిస్తాం ..రా..అన్లేదా..? " చిలిపిగా చూస్తూ అడిగింది కాంక్షిత.క్షణకాలం పట్టింది స్నిగ్ధకు ఆ పదంలోని శ్లేష అర్ధమయ్యేందుకు.

" నిన్నూ ..." అంటూ కాంక్షితను పొడవటానికన్నట్లు షేపింగ్ నైఫ్ ని అందుకుంది స్నిగ్ధ.

" ఓ..మై గాడ్ .." అంటూ పరుగుపెట్టింది తన గదిలోకి కాంక్షిత చిన్నపిల్లలా -

*****

ఏదో అద్భుతమైన లోకాల్లో విహరిస్తున్నట్లుగా వుంది రామోజీ ఫిలంసిటీని చూస్తుంటే.

" రియల్లీ..వండర్ ఫుల్..అత్యంత అద్భుతమే యిది. కనువిందు కలిగించే అందాల స్వర్గం.. " అనుభూతిని మదిలో నిక్షిప్తం చేసుకుంటుంది స్స్నిగ్ధ. వెంటనే బదులిచ్చింది కాంక్షిత

" దీన్ని చూసి నువ్వంటున్నావుగానీ, నేనూ ఇలానే అనుకున్నా.. ఉదయం మనం బయలు దేరేటప్పుడు నిన్నుచూసి.." ఆ అభినందన అందలాన్నెక్కించింది స్నిగ్ధను.

స్నిగ్ధమోములోని వెలుగుని చూసి వెన్నెల రేడు మండిపడితే, ఆ వెలుగుమంటలో స్నిగ్ధ నడుమును గిచ్చుతూ తెగ మురిసిపోయాడు అరవిందుడు.

' ప్యార్ డైజ్ హోటల్ 'లో చవులూరించే బిర్యానీతో డిన్నర్ ముగించేసి ఇంటికి చేరారు అందరూ. బెడ్ రూములోకి స్నిగ్ధ కాలు పెట్టిందో లేదో వెనకగా వచ్చి వాటేసుకున్నాడు ఆమెను అరవింద్.

"అబ్బ వదలండీ చీర నలిగిపోతుంది..! " అంది యిబ్బందిగా

" అవును పాపం.. అనవసరంగా చీర నలుగుతుంది .." అన్నాడు చిలిపిగ.

"నోరుముయ్యండి..అవతల గదిలో వాళ్ళూ.."

" ఇదే పనిలో వుండివుంటారు.." అంటూ ఆమె విప్పుతున్న చీరని చకాచకా పీకి పారేసాడు.

" అయ్యో చీర.." అంది స్నిగ్ధ కంగారుగా.

" నువ్వనవల్సింది చీర..కాదు..చీరాల అనాలా.." అన్నాడు అరవింద్ అమాంతం ఆమెను పైకెత్తుతూ. "ఛీ..ఛీ.." అంది స్నిగ్ధ బిగి కౌగిలిలో నలిగిపోతూ.

*****

" ఇక్కడ బాగా ఉక్కబోస్తున్నట్లుగా వుంది కదా..? " అడిగింది కాంక్షిత జోసెఫ్ ని.

" అవును ఈ కిటికీలు తెరిస్తే..కొంచెం గాలి తగిలి హాయిగా వుంటుంది.." అంటూ ఆమె జాకెట్ కున్న హుక్స్ ని వూడదీసేశాడు జోసెఫ్ -
గుండెల గూట్లోనుంచి బయటపడ్డాయి రెండు గువ్వపిట్టలు అనందంగా కదులుతూ.

" అబ్బ నిదరొస్తుంది జోసెఫ్.." అంది మగతగా కళ్ళుమూసుకుంటూ.

" అయితే నిద్దరపో..నే జో కొడతాను.." అంటూ జోకొట్టనారంభించాడు.

అతను జో కొట్టే ప్రతిసారి, అతని చేతివేళ్ళ కొసలు ఆమె ఎదపొంగుల అంచులను తాకుతున్నాయి . అతని తీరు చూస్తే, ఆమెను నిద్ర పుచ్చడం కంటే, రెచ్చ గొట్టడమే 'పనిగా' పెట్టు కున్నట్లుంది. ఇప్పుడు అదే జరుగుతుంది . అతను జోకొడుతున్న చోటు అటువంటిది మరి..!

మెల్లగా కాంక్షిత హృదయంలో కోరికల బావి ఊటవేయటం ప్రారంభించింది. నిదర్శనంగా కనిపిస్తున్నయి పొంగుతున్న అవయవాలు. పారవశ్యాన్ని తప్ప మరే వస్త్రాన్ని భరించే స్థితిలో లేదు కాంక్షిత. విలువైన వలువలు ఆమె శరీరం నుండి ఊడి వెలవెల బోతున్నాయి. బెడ్ లైట్ కాంతిలో మెరిసిపోతుందామె పసిడివన్నె శరీరం.

నఖశిఖపర్యంతం పరికించసాగాడు కాంక్షిత సౌందర్యాన్ని జోసెఫ్. నల్లత్రాచు వంటి కురులు. నారింజ రంగులో నయనాలు, దొండపండు ఎరుపు అధరాలు, పసుపువన్నె ఎదపొంగులు, వాటి అంచున ద్రాక్షపళ్ళ ఊదారంగు, నాభిలోయ నీలం, చివురించిన కాంక్షలలో ఆమె తనువైంది హరితం. కళ్ళు తెరిచిందికాంక్షిత. కోరికల సెగతో రగిలిపోతూ, జోసఫ్ ని చూసి సన్నగా కసిరింది.

" ఏమిటా తీక్షణ దృష్టి..దిష్టి తగెలేలా ..? "

" సృష్టి తెర మీద భగవంతుడు గీసిన సప్త వర్ణాల చిత్రమే స్త్రీ అనిపిస్తుంది నిన్నిలా చూస్తుంటే..." చెప్పాడు జోసెఫ్. చిత్రకారుడు విచిత్రానుభూతి పొందుతున్నాడు.

" చూసింది చాలు.. చలి చంపేస్తుంది..ఏదైనా కప్పండి బాబు ఒంటిమీద .." అర్ధించిందా అర్ధాంగి.

" ఇది చలికాదు చెలి..! కాంక్షల గిలి..ఇప్పుడు కప్పుకోవలసిన దుప్పటి 'కౌగిలి '.." అంటూ పెనవేశాడామెను.

అతని శరీరపు వేడితో చలిమంటలు కాచుకుంటోంది కాంక్షిత. ఇద్దరి శరీరాలు సెగపెట్టనారంభించాయి. ఆమె చేతివేళ్ళు గిచ్చుతూ , రెచ్చగొడుతున్నాయతనిని. ఇద్దరి మధ్యా భగ్గుమంది నిప్పుకణిక. మంటలు ఎగిసాయి వారిపైకి. కాలిపోతున్నారు.. కామపు మంటల్లో మైకంగా.. కరిగిపోతున్నారు మైనలా....

*****

ఈ మూడురోజులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడిచిపోయాయి నలుగురికి. చాలాకాలం తరువాత గత వైభవాన్ని గుర్తుచేసింది ఈ సమయం . స్నిగ్ధకు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే దిగులు కలిగింది. బయటకు వేళ్ళారు భర్తలిద్దరూ. స్నిగ్ధ, కాంక్షితలే మిగిలారక్కడ. మౌనంగా,ఎవరి ఆలోచనలలో వారున్నారు. ఆ మౌనాన్ని భంగం చేస్తూ చెప్పింది కాంక్షిత.

" నీ భర్త గురించి తెలియక, ఇంత నిస్సరంగా ఎందుకు బతుకీడుస్తున్నావని అపోహపడ్డాను. ఈ రెండు మూడు రోజులు మనం చాలా దగ్గరగా గడిపాం కదా అతనిలో ఏ తప్పూలేదు..! తప్పంతా నీదే..!

చూడు స్నిగ్ధ..! మనం ఆడవాళ్ళం బయటకు వెళ్ళేటప్పుడు ఎంతో అందంగా ముస్తాబవుతాం. కానీ, అదంతా ఎవరికోసం..? ముక్కూ మొహం తెలియనివాళ్ళెవరో, మన అందం చూసి కన్నెగరేయాలనుకుంటాం. మన అందాన్ని మెచ్చి వాళ్ళొచ్చి అభినందించగలరా..? మన అందం అక్కడ ఏమవుతుంది ? అడవిన కాచిన వెన్నెలవుతుంది..

ఎవరితో నైతే శరీరాన్ని, జీవితాన్ని పంచుకుంటామో, వారికోసం మనం ముస్తాబు కాము. వారిని మన అందంతో ఆనందపరచే ప్రయత్నమే చెయ్యము. వెన్నెల కోసం ఎదురు చూసే కనులకు, కనీసం నక్షత్రాల వెలుగునైనా చూపించే ప్రయత్నం చెయ్యము. ఇది నీ గురించి..నా గురించి కాదే.. మన ఆడవాళ్ళందరం ఇంతే..! అన్వునా..? కాదా..? " అడిగింది కాంక్షిత సీరియస్ గా -

ఆమె చెప్పినదానికి అవునన్నట్లు తలూపింది స్నిగ్ధ.

" ఈ మూడు రోజులూ నీలో అందం క్షణక్షణం ప్రవర్ధమానమైంది. కారణం..? పెండింగ్ బిల్స్ క్లియరయ్యాయా..? కాదే..! మనసు ఆనందంతో నిండింది. మగాడు ఎన్నో వ్యాపార సమస్యలతో సతమతమై ఇంటికి వస్తాడు. వాటినుంచి చాల దూరంగా తీసుకెళ్ళి, మరో లోకాన్ని చూపించే దిక్సూచీ కావాలి భార్య. ఆడది భర్తకి జీవిత భాగస్వామి కావాలే గానీ, వ్యాపార భాగస్వామి కాకూడదు. అయితే వారి సంసారం కూడా లాభం లేని వ్యాపారమే అవుతుంది.

ఇంటి వాతావరణం స్వప్నలోకంలా, స్వర్గలోకంలా ఉండాలే కానీ, ట్రేడ్ సెంటర్ లానో, టెండర్ హాలులానో కనిపించగూడదు. అలా కనిపిస్తే, ఏ బారో, క్లబ్బో, వాళ్ళకి స్వర్గం అవుతుంది. మీవారి లాభనష్టాల ఖాతాకాదు నువ్వు చూడాల్సింది, సుఖసంతోషాల ఖాతా.. అదే నీ బిజినెస్..!ప్రేమ వాకిట్లో.. నీ అందాలను ఆరబోసి.. నీ మురిపాలను ఒలకబోసి నీ ప్రియ సఖుని శృంగారపు జడివానలో తడవనియ్యి. అదే ఇల్లాలుగా నీ డ్యూటీ. ఐ యాం వెరీవెరీ సారీ. ఇఫ్ ఐ హర్ట్ యు.."

కాంక్షిత అపాలజీ చెప్పిందే తడవు.. అమాంతం కౌగిలించుకుంది స్నిగ్ధ ఆమెను. వర్షిస్తున్నాయి కళ్ళు.. తనకు తెలియకుండానే జరిగిపోయిన గ్రహాపాటు తెలియవచ్చింది ఆమెకు.

" కాంక్షి నీ ప్రెండ్ ని అవ్వటం నిజంగా నా అదృష్టం.." ఆనందాభాష్పాలు వారి అనుబంధానికి పుష్పాలుగా మారాయి.
*****
ఇల్లంతా సర్దిపెట్టి నీట్ గా వుంది. బెడ్ రూంలో అగరువత్తుల పరిమళం. అశ్చర్యపోయాడు అరవింద్. శృంగార దేవతలా మనోహరంగా కనిపిస్తుంది స్నిగ్ధ.

" బయటకు వెళుతున్నామా..?" అడిగాడు అనుమానంగా

" లేదు ఇంక అన్నీ లోపలే " అంది సిగ్గుగా.

" ఏమిటీ శుక్లపక్షపు వెన్నెల..బహుళ పక్షంలో.."

" మనసున క్లేశం లేకుంటే ప్రతి తిధి పున్నమే.. ప్రతి మది వెన్నెలే.. అందుకే.." ఆగింది స్నిగ్ధ.

" ఊ అందుకే.." అన్నాడు కౌగిలిలో బంధిస్తూ.

" మనసే వెన్నెల.. అంది అతడ్ని హత్తుకుంటూ.ఇక ప్రతిరాత్రీ ఇదే కళా..? " ప్రశ్నిస్తూ, ఆమె అధరాను బంధించాడు తన అధరాలతో, జవాబునివ్వనీకుండా.

" ఊ ' అంటూ మూలిగింది స్నిగ్ధ సమాధానంగా. శృంగార సమరానికి సంకేతంగా...!!
*****

( స్వాతి సపరి వార పత్రిక 26-12-2003 )

26, డిసెంబర్ 2008, శుక్రవారం

కదళీ వనం ...!


కార్తీక మాసం కావడంతో స్వామివారి దర్శనానికి కష్టపడాల్సి వచ్చింది. దర్శనం చేసుకుని బైటకువచ్చేసరికి, అల్లంత దూరంలో ఉల్లాసంతో నిండివున్న గుంపు అతని కంటపడింది. మాట కలిపితే పోలా అనుకుంటూ వారి వైపుకి దారితీశాడు కార్తీక్.
" ఎక్స్ క్యూజ్ మీ..మీరూ..." అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు, ఆపై ఏమనడగాలో తెలియక -
"ఉయ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ కాస్మిక్ స్పిరిచ్యుయల్ సొసైటీ..ఐ యాం ప్రభాకర్ ఫ్రం కాకినాడ.. " తనని తాను పరిచయం చేసుకున్నాడతను షేక్ హ్యాండ్ ఇస్తూ.
" ఎన్నాల్టినుంచో అనుకుంటున్నా
సార్.. నేను కూడా మీతో జాయిన్ కావచ్చా.." అని అడిగాడు కార్తీక్ తన మనసులోని మాటను తెలియజేస్తూ.
" ఎందుక్కాదు..? అందరం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాం .. మెడిటేషన్ ప్రొగ్రాం లో భాగంగా శ్రీశైలం ట్రెక్కింగ్ కోసమని వచ్చాం వివరించాడు ప్రభాకర్.
" బై ది బై ఐయాం కార్తీక్ ప్రం హైదరాబాద్.. "ఎవరిని కలవమంటారు..? " అని అడిగాడు.
" అదిగో ఆ వైట్ షర్ట్ టక్ చెసుకుని వున్నారే.. ఆయనను కలవండి. హి ఈజ్ మణిశంకర్ ఫ్రం హైదరాబాద్. హి విల్ హెల్ప్ యూ.." ధ్యానమార్గం చూపించాడు ప్రభాకర్. థాంక్స్ చెప్పివెళ్ళాడు కార్తీక్ మణిశంకర్ని కలిసేందుకు .

ఆ సంభాషణ అంతా విన్న ఓ యువతి ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది వెళ్తున్నన కార్తీక్ వంక.ఎక్కడో బాగా పరిచయమున్న వ్యక్తిలా అనిపించింది. 'ఎక్కడా పరిచయం ' అన్న ఆలోచనలో మునిగిపోయిందా యింతి.
* * * * *

మెట్ల దారిలో నడుచుకుంటూ ఒకరి వెంట ఒకరు పాతాళ గంగ వద్దకు చేరారు.
" ఇప్పుడు మనం ఎటువెళ్తున్నాం.." ప్రశ్నించాడు కార్తీక్ ముందున్న వ్యక్తిని.
" కదళీ వనం " బదులిచ్చాడా వ్యక్తి
." ఎలా వెళ్తాం..? " ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కార్తీక్ ఎదురుగా ప్రవహిస్తున్న కృష్ణానదినే చూస్తూ.
" మీరు యోగులైతే నీటిమీదే.." వినిపించింది సమాధాన చిలిపిగా వెనుకనుంచి.
గిర్రున తలతిప్పి చూసిన కార్తీక్ షాకైయ్యాడు,రాశిగా పోసిన సినీతారల లావణ్యంతో నిండిన యువతిని చూసి. తన పక్కనున్న మరోకరితో కలిసి గలగలా నవ్వుతోంది.. ఆ సమాధానం తనకా..? లేక ఆమె ఫ్రెండుకా..?
ఆమెనే చూస్తున్న కార్తీక్ వంక ఓరకంట చూసిందామె. గుండె జల్లుమంది అతనికి. ' ఐశ్వర్యారాయ్ అంతటి అందగత్తే కానీ, ఆ చూపులో కరీనాకపూర్ కైపుంది ' అనుకున్నాడు
* * * * *
10 కి.మీ.లాంచీ ప్రయాణం.." చెప్పాడు మణిశంకర్ దూరంగా వస్తున్న లాంచీనే చూస్తూ.
" ఓహ్..! వండర్ ఫుల్.." అరిచారెవరో గట్టిగా.
" ఆ..ఆ..ఇప్పుడు వండర్ ఫుల్లు గానే వుంటుంది..దిగిన తరువాత..డర్ ఫుల్లు..ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.." చెప్పారెవరో .
" డర్ దేనికీ...? " ప్రశ్నించాడు కార్తీక్ పక్కనున్న వ్యక్తిని. వెనుకనుంచి సమాధానం ఆశిస్తూ.
" మనం నడిచి వెళ్ళే కొండదారిలో పులులు తిరుగుతున్నాయట..." చెప్పాడా వ్యక్తి.
" ఙ్ఞానులను అవేం చేస్తాయ్. . ? " వెటకారంగా ప్రశ్నించాడు కార్తీక్. విన్నవారి నుంచి మెప్పుని ఆశిస్తూ.
అతని ప్రశ్న విని తలతిప్పి నవ్వుతూ చూసారు కొంతమంది -
" వాటికి తిన్న తరువాత గానీ తెలియదు..ఎవరు ఙ్ఞానో..? ఎవరు అఙ్ఞానో..? " వినిపించింది సమాధానం వెనుక నుంచి. గొల్లుమన్నారు జనం ఆ సమాధానం విని. సూటిగా అమెవంకే చూసాడీ సారి.
' నువ్వు పులికి ఆహారంకాక తప్పదన్నట్టు ' -
" కమాన్..స్నిగ్ధా..కమాన్.." అంటూ తిన్నగా దారితీసింది లాంచీ వద్దకు, ఆ యువతి పక్కనున్న సుందరి. "ఓహొ ..అందాల పరువాలతో, ఆనంద పారవశ్యంతో విరిసిన పారిజాతంలా వున్న ఈ ముగ్ధ పేరు స్నిగ్ధా..? అనుకుంటూ ఆమె వెంటే దారితీశాడు కార్తీక్. -
***

లాంచీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. కృష్ణావేణీ ప్రవాహపు ఒంపుసొంపులు, నదీతీరలో ముచ్చట గొలిపే ఆకృతుల్లో అలముకున్న కొండలు , రంపంతో కోసినట్లుగా ఏర్పడిన నునుపైన శిలలు. ఎంతో అలౌకికానందాన్ని అందిస్తున్నాయి చూపరులకు. ' కదళీ వనం ' రేవు చేరింది లాంచీ.
సందడి మెదలైంది లాంచీలో. తన బ్యాగ్ ను అందుకుని లేచినిల్చుంది స్నిగ్ధ. అందరిలోనూ ఒకటే ఆత్రుత ముందుగా తామే కిందకు దిగాలని. అదే ఉత్సాహంతో తొపులాట మొదలైంది. నిల్చుని వున్న స్నిగ్ధను ఎవరో పక్కకి నెట్టేసరికి, పట్టుతప్పి పడిపోయింది,
దూరంగా కొండలవంక చూస్తున్న కార్తీక్ ఒళ్ళో. ఉలిక్కిపడి.. ఒళ్ళో పడిన మనిషిని, అప్రయత్నంగా గట్టిగా పట్టుకున్నాడు కార్తీక్. తన ఒళ్ళోకి వచ్చి వాలింది ఎవరో తెలియగానే, విద్యుత్ ప్రవహించినట్లైంది అతని బాడీలో. ఆ ...విధ్యుద్ఘాతానికి తాను లోనైంది స్నిగ్ధ ... అతని ఒడిలో.. !

నల్లమల కొండల్లో కాలిబాట- ఒకరి వెంట ఒకరు-అలవాటులేని నడక-మనసుకి ఉల్లాసం-శరీరానికి ఆయాసం. స్నిగ్ధ అడుగుల్లో అడుగులేస్తూ నడుస్తున్నాడు కార్తీక్, ఆమె శరీరాకృతిని గమనిస్తూ -తెల్లని శరీరచ్ఛాయ. వయసు సింగారింపుతో, లేత నిమ్మపండులా మాంచి నిగారింపుతో వుంది. ప్రతి అడుగుకి లయబద్దంగా స్పందిస్తూ ఊరిస్తుంది ఆమె నడుము ఒంపు. పైనుంచి వడివడిగా వచ్చి ఆ ఒంపులోకి చేరుకుంటున్నాయి స్వేదబిందువులు -

కాలుమోపుతూ, బరువుగా పైకి ఎక్కేటప్పడు, ఒక చేత్తో చీర కుచ్చిళ్ళను పట్టుకుని పైకెక్కుతుంది స్నిగ్ధ. నిలువునా ఆమె వంటిని అంటిపెట్టుకున్న చీర ఆమె పిరుదుల సొగసుని దాచలేకపోతుంది. చూస్తున్న కార్తిక్ లో కోరికాగ్ని శిఖ రగులుకోవడం ప్రారంభించింది. పాపం..! లగేజితో నడవలేక అవస్థ పడుతున్న, ఆ కన్నియను వీణియగా తన రెండు చేతులపై మోసుకుపోవాలనిపించిందతనికి. అందుకే ఉండబట్టలేక..
" ఇఫ్ యూ డోంట్ మైండ్..ఆ లగేజీ కాస్త యిటివ్వండి..కాస్త దూరం నేను తీసుకువస్తాను.." అన్నాడు.
" మీరేమైనా కూలీనా నా లగేజీ మోయడానికి..? " అంది. నిజంగా ఎంతో కోపం వచ్చినట్లు.
గ్రహించాడు కార్తీక్ ఆమె అంతరంగాన్ని.
" కొంతమంది బరువులు మోయడానికి కూలీగానూ మారవచ్చు..ఎంతో జాలీగా.." చిలిపిగా చూస్తూ చెప్పాడు సమాధానం.
" మాటలు ఎక్కువవుతున్నాయే.." ఈసారి నిజంగానే కోపంగా అంది. " దూరం తగ్గుతుందిగా..! " నవ్వుతూ బదులిచ్చాడు .
" ఒళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి .." మందలిస్తున్నట్లుగా చెప్పిందామె.
" లేదండి..జాగ్రత్తగా వుంచుకోకుండా..ఒళ్ళో వాలిన వాటినే వదిలేస్తాను..ప్చ్..." బాధ పడుతున్నట్లుగా చెప్పాడు - తనుకోల్పోయిన వాటిని గుర్తుచేసుకుంటూ -
చమత్కారంతో కూడిన అతని సమాధానం ఛురికలా వచ్చి గుచ్చుకుంది ఆమె మనసులో.

తాను ఓ.. ముద్దబంతుల మూటలా, ఆతని ఒళ్ళో పడిన దృశ్యం ఆమె కళ్ళముందు కదలాడి, ఆమెను సిగ్గుల మొగ్గను చేసింది. " ఇటివ్వండి.." అంటూ చనువుగా అందుకున్నాడు బ్యాగ్ ను ఆమె చేతిలో నుంచి. అతని ప్రయత్నానికి ప్రతిఘటన లేదు ఆమెలో.

కదళీవనం రేవు నుంచి 11 కి.మీ. కొండదారి వెంట నడిచిన తరువాత, ఒక వాగు కనిపించింది. ఆ వాగుకి, కుడి ప్రక్క క్రిందుగా కనిపిస్తుంది.. లోయలో 'కదళీ వనం ' - ఆ వనంలో సహజాతిసహజంగా ఏర్పడిన శిలామండపం, ప్రకృతి శోభకు పరాకాష్ట. కొండనుంచి వచ్చిన ఓ శిలా కింద ఎలాంటి ఆధారమూ లేకుండా, పైకప్పు లాగా వుండి, మండపం వలే ఏర్పడింది. కింద భాగం చదును చేసినట్లుగా నున్నగా వుంది. అందరూ ఎంతో అలసటగా వాలిపోయారు ఆ బండరాయి మీద. అక్కడ వెయ్యమందికి పైగా జనం, విశ్రాతిగా కూర్చుని చేసుకోవచ్చు 'ధ్యానం ' -
* * * * *
ఒంటరిగా వాగుగట్టుమీద నడుస్తోంది స్నిగ్ధ. వాగులోని ప్రవాహంలానే సాగుతున్నాయి అమెలో ఆలోచనలు. ద్యానం తాలూకూ అనుభవాలు గొప్పవి. క్రమం పద్దతిలో చేసే ధ్యానం సక్రమ ఫలితాలనిస్తుంది.

' ఎక్కడి వాడీ కార్తీక్..? ఇంతకు ముందే ధ్యానంలో కూడా కనిపించాడు. ఇప్పుడు ఇలా ఎంతో దగ్గరవాడులా అనిపిస్తున్నాడు. ఇది తనలో నిక్షిప్తమవుతున్న కాంక్షా..? లేక తాను పొందబోయే భవిష్యత్తా..? '

తీవ్రమైన ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న స్నిగ్ధ తన ఉనికినే మరిచిపోయింది. ఒంపు తిరిగిన కొండ వాగును గమనించక అడుగు ముందుకువేసింది.అంతే..! పెద్దగా ఆర్తనాదం చేస్తూ, గట్టుమీదనుంచి ప్రవాహంలోకి జారిపోయింది.
" హెల్ప్..హెల్ప్.." అని అరుస్తూ,తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ, మునిగితేలుతుంది స్నిగ్ధ.

అంతలో బలమైన రెండు చేతులు గట్టిగా ఆమెను పట్టుకుని, ఒడ్డు వైపుకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి.ఒడ్డుకు చేరిన స్నిగ్ధ నిస్సత్తువతో తన శక్తిని కోల్పోతున్నట్టుగా వుంది. అమాంతం ఆమెను తన రెండు చేతులపై కెత్తుకుని వాగుకు ఒక పక్కగా ఇసుక మేట వేసిన చోట ఆమెను పడుకోబెట్టే ప్రయత్నం చేస్తుండగా, కళ్ళు తెరిచి చూసింది స్నిగ్ధ, స్పృహను కోల్పోతూ - అతను 'కార్తీక్ ' అనుక్షణం తన నీడలా అనుసరిస్తున్న కార్తీక్. పూర్తీగా స్పృహను కోల్పోయింది స్నిగ్ధ.

"స్నిగ్ధా..స్నిగ్ధా.." ఎవరో లోయలో నుంచి పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది ఆమెకి. మెల్లగా స్పృహలోనికి వచ్చిన స్నిగ్ధ, నీరసంతో కళ్ళు తెరవలేదు. ఆమె పొట్టమీద చేతులు వేసి గట్టిగా అదుముతున్నాడు కార్తీక్. బహుశా తను తాగిన నీటిని కక్కించే ప్రయత్నం కాబోలు అనుకుంది మనసులో. వెంటనే మరో విషయం ఆమెను పూర్తీగా స్పృహలోకి తెచ్చింది. ఆమె పొట్టమీద అతని చేతుల ఉనికి గ్రహింపులోకి రాగానే, గగుర్పాటుతో కంపించింది ఆమె శరీరం -

ఆమె స్పృహలోనికి వచ్చిందన్న విషయాన్ని గ్రహించాడు కార్తీక్. కళ్ళు మూసుకుని ఆమె నటిస్తున్న వైనాన్ని గమనించాడు. ప్రేమోద్రేకంతో ప్రధమ చికిత్సను వీడి, కామోత్సుకుడయ్యాడు కార్తీక్ యిప్పుడు.ప్రమాదం తాలూకూ ఉద్వేగంతోనో, ప్రమోదం తాలూకూ ఉద్రేకంతోనో అతనికి తెలియటం లేదుగాని, అదిరిపడుతున్నట్లుగా తెలుస్తుంది ఆమె వక్షస్థలం. కవచంలా వుండాల్సిన ఆమె రవిక తడిసి, రవి కాంచని ఆమె స్తన సంపదను అతనికి బహిర్గతం చేస్తోంది. మరులు గొలిపే లోతైన ఆమె నాభిలో నిలిచిన నీళ్ళు అతనిని శృగారపు వూబిలోకి నెట్టేస్తున్నాయి. ఆమె ఒంటికి అంటుకుపోయిన చీర తడవటం వల్ల తన ఉనికిని కోల్పోయి పారదర్శకంగా మారి ఆమెలోగుట్టును అతనికి రట్టుచేస్తోంది.
ఆమెను నఖశిఖ పర్యంతం గమనించిన కార్తీక్ లో కోరిక కుబుసం విడిచి బుసలు కొట్టడం ప్రారంభించింది.కొండ ఎక్కేటప్పుడు కనిపించిన పిరుదుల సొగసును తడిమాడు కార్తీక్ మెత్తగా. ఝల్లుమంది స్నిగ్ధకు. ఏమి జరుగుతుందో గ్రహించే లోపలే ఆమె నడుముపై అతని అరచేయి ఉడుములా కదలాడుతుంది. ఏం చెయ్యాలో ఎలా ప్రతిస్పందించాలో తెలీని స్థితి ఆమెది.
ఇరవై రెండేళ్ళ ప్రాయపు పరువాలు కామపు పగను పెంచుతున్నాయి, పాతికేళ్ళ పురుషునిలో - ఒకచేత్తో ఆమె బొడ్డుపై నుంచి పైకి, మరోచేత్తో ఆమె తలపై నుండి క్రిందకి అణువణువునూ స్పృశిస్తూ, రెండు చేతులను మెల్లగా జరుపుతున్నాడు కార్తీక్. మోహం అతనిని పూర్తిగా వశపరుచుకుంది. ఆమె మౌనం దానికి మరింత బలాన్నందించింది. అతని రెండు చేతులు ఒకేచోట ఆగే వేళ... పలికింది మెల్లగా స్నిగ్ధ కనులు మూసుకునే --

'నారీ స్తన భర నాభిదేశం .. దృష్ట్యామాగా మోహావేశం ..
ఏతన్మాంస వసాది వికారం .. మనసి విచింతయ వారం ..వారం '

ఇంద్రియ లోలుడై అనుచితముగా స్నిగ్ధ శరీరాన్ని ఆక్రమించుకోబోతున్న కార్తీక్, కొరడా దెబ్బ తగిలినట్లుగా ఉలిక్కిపడ్డాడు. " అంటే.." అడిగాడు ఆశ్చర్యంగా, అంతకంటే అవమానంగా -
" మరులు గొలుపు నారి యొక్క నాభీ స్తనములను చూసి మత్తిలి ఎరలోన పడకు.
అది మాంసపు కండలతో ఏర్పడినది. ఈ విషయం మనసులో మళ్ళీమళ్ళీ భావించకు... "
చెప్పింది స్నిగ్ధ కనులు తెరిచి.
సిగ్గుతో కుచించుకుపోయాడు కార్తీక్. ఆమె మాటల్లోని తీవ్రత ఆమె ముఖంలో లేదు. కానీ మనసులోని బాధ మాత్రం కళ్ళల్లో కనిపించింది. ఇప్పటివరకూ తనకు కనిపించిన యవ్వనవతి ఇప్పుడు కానరావటం లేదు ఆమెలో. ఆత్మఙ్ఞానాన్ని పొందిన ప్రేమమూర్తిని చూశాడు కార్తీకిప్పుడు. ఆమెకు తన మొహం చూపించలేక, లేచి వడివడిగా వెళ్ళిపోయాడు.

* * * * *
మరునాడు పశ్చత్తాపంతో కుమిలిపోతున్నట్టు కనిపించాడు కార్తీక్ ఆమెకి. అతనిలోని పరివర్తన ఆమెనెంతో ఆనందానికి గురిచేసింది. ' తన హృదయం దుర్మార్గాన దరి చేరలేని అబేధ్యమైన దుర్గం... తన జీవితం ధ్యానంతో సమ్మిళితమైన సమ్మోహన మార్గం... మనసు నిండా ఫీలయ్యింది స్నిగ్ధ ఎంతో గర్వంగా -
* * * * *

వీరవిరాగిణిగా ప్రసిద్ధి చెందిన ' అక్క మహాదేవి ' శివ శరణులలో పేరెన్నిక గన్నది. ఆ శ్రీశైల మల్లిఖార్జునుని తన జీవిత భాగస్వామిగా భావించి, కదళీవనంలో తపస్సు చేసి, చివరకు సిద్ధిని పొందిందని కర్ణాటక భక్తుల నమ్మకం. అటువంటి అక్క మహాదేవి తపస్సు నాచరించిన చోటనే, ఒంటరిగా ధ్యానం చేసేందుకు ఉధ్యుక్తురాలై, కన్నులు మూసుకుంది స్నిగ్ధ ఉత్సాహాంగా -
ఆకాశాన్ని తాకుతున్న మహావృక్షాలు, నింగినుండి నేరుగా జాలువారుతున్న జలధారలు, కనుచూపుమేర కానవస్తున్న పచ్చని పచ్చికబయళ్ళు, వాటిలో పురివిప్పి నర్తిస్తున్న నెమళ్ళు, ఇలపై పరుచుకున్నట్లున్న ఇంద్రధనస్సులోని చిత్రవర్ణాలతో నిండిన వనం, సుగంధ పరిమళాలను వ్యాపింప చేస్తున్న పూలవనం..!
అంబరానికి ఆదరువుగా నిల్చిన గిరి శిఖరాలు- సంబరంగా పరుగులిడుతున్న సెలయేరులు- ఆ సెలయేరుల నడుమ మేట వేసిన ఓ ఇసుకతిన్నె-ఆశ్చర్యంగా ఆ తిన్నెపైనే కాంతులీనుతున్న వెండి వెన్నెల - ఆ వెన్నెల వెలుగులో- ఆ ఇసుక తిన్నెపై...ఓ జంట..!!
అంతటి అద్భుతమైన ప్రకృతి చుట్టూ నిలిచివుండగా, దానిని అనుభవించ కుండా, ఇంతకంటే మహాద్భుతమైన దానినేదో అనుభవిస్తున్నట్లున్నారు.. ఆ పురుషుని ఒడిలో తల పెట్టుకుని వున్నట్లుగా వుంది ఆ...స్త్రీ..!వారి మొహాలు కనిపించటం లేదు. అతని శరీరం యొక్క వెనుకభాగం , ఆమె మోకాళ్ళ నుంచి క్రింద భాగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదీ నగ్నంగా - మెల్లగా వారిని సమీపిస్తుండగా, ఏదో అలికిడి అయినట్లుగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడా పురుషుడు. ఆశ్చర్యం..! అతను కార్తీక్..!! అతని ఒడిలో పరవశిస్తున్న ఆ యువతి మరింత కలవరపాటుగా లేచింది. మహాశ్చర్యం.. అది 'తనే '-!!
ధ్యానంలో లీనమైన స్నిగ్ధ శరీరం జలదరించింది ఒక్కక్షణం. అదిరిపడి కళ్ళు తెరిచింది. ' ఏమిటీ విచిత్ర స్వప్నం ? ఏమి సుందర దృశ్యాలు ? ఎన్ని వర్ణాల సుమాలు ? ఎంత అద్భుత పరిమళాలు ?
కానీ, విచిత్రం ? అతనూ..నేనూ..ఏమిటీ..అలా..? మదిని ఆలోచనలు ఉప్పెనలా ముంచివేస్తుండగా పైకిలేచింది స్నిగ్ధ..- ధ్యానం నుంచి - దగ్గరగా వస్తూ కనిపించాడు కార్తీక్.అతనినే చూస్తుండిపోయింది స్నిగ్ధ, మదిలోని చిలిపి సిగ్గుని అదిమి పెట్టుకుంటూ ..
" హల్లో..గుడ్ ఈవినింగ్..స్వచ్చమైన చిరునవ్వుతో పలుకరించాడు కార్తీక్. ఉదయం నుంచి అతనిలో కనిపించిన వ్యధ ఇప్పుడు కనిపించటం లేదు ఆమెకి.
" హాయ్.." బదులిచ్చింది హుషారుగా స్నిగ్ధ.
" అలా వాగు దాకా వెళ్దామా.." రిక్వెష్టుగా అడిగాడు.
" ఈ వేళప్పుడా ?" ప్రశ్నించింది ఆశ్చర్యాన్ని నటిస్తూ
" ఏం చీకటంటే భయమా ?" చమత్కారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కార్తీక్, ఆమె భయానికి కారణం తెలిసీ-"మీరున్నారుగా " వాక్యం పూర్తి చెయ్యకుండా ఆపి, అతని వంక చూసింది. ఉలిక్కిపడ్డాడు ఆ మాటకి. అతని ఉలికిపాటుని చూసి, నవ్వుకుంటూ పూర్తిచేసింది వాక్యం "మీరున్నారుగా.. ఇంక భయం దేనికీ.." అంటూ -
' మాటల ఈటెల ' అనుకున్నాడు మనసులో.
"ఎక్కడ వరకు మన ప్రయాణం..? " హుషారుని కొనితెచ్చుకుంటూ అడిగింది.
" నిన్నటి చోటుకి.." ముక్తసరిగా చెప్పాడు." ఎందుకక్కడికీ ? చిలిపిగా అంది.
" వెళ్ళిన తరువార నీకే తెలుస్తుందిగా " చెప్పాడు ఏ భావం కనిపించనీయకుండా
'' పద..పద..నీకూ తెలుస్తుంది ' అనుకుంది మనసులో స్నిగ్ధ ఆనందంగా.
ఆమె మనసునిండా నిండిపోయింది..కొన్ని నిముషాల ముందు తాను పొందీన ధ్యానానుభవం.
" ఇదే..నిన్న మీరు దివ్యానుభవం పొందిన చోటు.." అంటూ కూలబడింది స్నిగ్ధ ఇసుక తిన్నెపై.
మెల్లగా ఆమె ముందు కూర్చుని, తదేకంగా ఆమెనే చూడసాగాడు. నిజంగా భయమేసింది స్నిగ్ధకిప్పుడు. మెల్లగా ఆమె చేతిని అందుకున్నాడు కార్తీక్. ' కొంపదీసి తన మాటలేం రెచ్చగొట్టడం లేదుకదా..? " అనుకుంది మరింత భయంగా. ఆమె కళ్ళల్లోని బెదురు అతనికి మరింత బాధను పెంచింది.
"నన్ను క్షమించు స్నిగ్ధా..! నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. మనం ఇంతదూరం వచ్చిన ప్రయోజనాన్నే మరిచి, దుర్మార్గంగా ప్రవర్తించాను. రియల్లీ ఐ యాం వెరీసారీ. కామంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించి నందుకు నీకెంతో ఋణపడివున్నాను. " బాధగా చెప్పాడు కార్తీక్ .
" అందుబాటులో వున్న దానిని అనుభవించడం ఆ మృగ లక్షణం..మీ మగ లక్షణం.." అంది ఇంకా ఆ కోపం తనలో వున్నట్టు..తనని దహించి వేస్తున్నట్టు.
" నన్ను క్షమించు స్నిగ్ధా..! నిన్నటి వరకూ నేనెంతో వివేకవంతుడిని, సంస్కారిని అనుకున్నాను. కానీ నిన్నే తెలిసింది, నేను మృగం కంటే హీనమని..." హృదయం లోని కల్మషాన్ని కడిగివేస్తున్నాడు కార్తీక్ పశ్చాత్తాపంతో.
'నా అలోచనే తప్పేమో..? నువ్వు కాపాడ బట్టి బతకగలిగాను. లేదంటే ఏ జలాచరాలకో బలి కావలసిన దానినే కదా ? ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తికి..? " ఆమె వాక్యం పూర్తికానేలేదు , వెంటనే బదులిచ్చాడు కార్తీక్.
" వద్దు స్నిగ్ధా..! వద్దు సూక్ష్మంగా నువ్వు మాట్లాడే ప్రతిమాట ఆ పరమశివుని త్రిశూలంలా నా గుండెల్లోకి దూసుకుపోతోంది. ఎక్కడైతే నేను అకృత్యానికి పాల్పడ్డానో.. అదేచోట నిన్ను క్షమాభిక్ష అడగాలని.. నిన్ను ఇంతదూరం తీసుకొచ్చా.. ఈ తపోభూమి సాక్షిగా చెబుతున్నా.. మరలా ఇలాంటి దుష్కర్మకు ఎప్పుడూ పాల్పడను. ఇది మన స్నేహం పై ఒట్టు.." అంటూ ఆమె చేతిలో గట్టిగా చెయ్యివేసి, వదిలేశాడు వెంటనే
" నిన్న అలా అవకాశం కలగకుండా వుండి వుంటే అసలే తప్పే జరిగి వుండేది కాదుకదా..!" మరింత సానబడుతుంది స్నిగ్ధ, అతని సౌశీల్యాన్ని.
" ఆహా..అవకాశం అందుబాటులోకి రానంత వరకూ అందరూ మహా యోగులే.." చెప్పాడు ఎంతో కసిగా.
ఆ కసి తనమీద తనకే. ఆశ్చర్యంతో మౌనంగా అతనినే చూస్తూ ఆలోచనలలోకి జరిపోయింది స్నిగ్ధ. ఏదో గుర్తొచ్చిన దానిలా ఆలొచనలలో నుంచి బయటపడి చెప్పింది.
" మీ మాటలు వింటుంటే.. శ్రీ ఆదిశంకరుల వారు చెప్పిన శ్లోకం గుర్తొస్తుంది.."
"చెప్పండి దానివలన నాలో ఇంకేం ప్రక్షాళన జరుగుతుందో.." అన్నాడు కార్తీక్ బాధగా.
" ఆయన చెప్పింది మీలో వచ్చిన మార్పును గురించి " వివరించింది నవ్వుతూ.
" అదేంటో..చెప్పండి.." అన్నాడు కార్తీక్ ఉద్వేగంగా-

" సత్సంగత్వే..నిస్సంగత్వం.. నిస్సంగత్వే నిర్మోహత్వం.. నిర్మోహత్వే నిశ్చలతత్వం.. నిశ్చలతత్వే జీవన్ముక్తి.."
అర్ధంకాక ఆమెనే చూస్తుండిపోయాడు.
" అంటే.. సత్సంగం వలన నిష్కామి అవుతాడు. నిష్కామికి మోహభ్రాంతి తొలగుతుంది. మోహం నశిస్తే, ధృఢమైన తాత్వక చింతన కలుగుతుంది. దాని వలన జీవన్ముక్తుడవుతాడు.. కావున సత్సాంగత్యం శ్రేష్ఠమైనది. " చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పింది.

"నిజమే మీ సత్సంగం వలనే.. నాలో ఈ పరివర్తన.." అభినందనగా చెప్పాడు.
" సత్ అంతే నిత్యము.. సంగం అంటే కలయిక.. మరి రేపు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం.. మరి నిత్యమూ ఎలా కలుస్తాం..? " ప్రశ్నించిందామె, ఏ భావం లేకుండా అతని వంకే చూస్తూ.
ఏ సమాధానం దొరకక.. అయోమయంగా ఆమెనే చూస్తుండిపోయాడు కార్తీక్.
" మనం నిత్యమూ కలవాలంటే ఒకటే మార్గం.." అంది ఆలోచన స్ఫురించిన దానిలా.
" ఏమిటీ.." అడిగాడు ఆశగా.
" మనం భార్యాభర్తలం కావడమే..." అంది సీరియస్ గా మొహం పెట్టి. విభ్రాంతుడై చూసాడు కార్తీక్ ఆమె వైపు.
"ఏమిటా వెర్రిచూపులు..? ఇంకా విషయం అర్ధం కాలా..?" ప్రశ్నించింది చిలిపిగా. అదేమిటో అర్ధం కాలేదన్నట్టు తలూపాడు కార్తీక్ యమ హుషారుగా.
" అయ్యా..మగానుభావా..! మిమల్ని దారుణంగా ప్రేమిస్తున్నామ్మయ్యా..! రేపు పెళ్ళి అయిన తరువాత అయ్యవారితో సహచర్యం చేస్తాం.. అయ్యవారికి సపర్యలు చేస్తాం.. " అంది కార్తీక్ ను గాఢంగా కౌగిలించుకుంటూ.
" అయితే మీ అయ్యవారు ఇప్పుడే మీతో సఫా చర్యలు చేబడతారు కాచుకోండి.." అంటూ ఆమెను మరింత గట్టిగా తన బాహువులో బంధిస్తూ ఆమెతో సహా వెనక్కి వాలిపోయాడు .

ఉక్కిరిబిక్కిరి అవుతుంది ముగ్ధ సుకుమారి 'స్నిగ్ధ ' అతని బిగి కౌగిలిలో. ఆమె తనువునా అణువణువునా ముద్దుల మొహరులు అద్దేస్తున్నాడు కార్తీక్. అతను ముద్రించిన ప్రతి ముద్దునీ భద్రపరచుకుంటోంది స్నిగ్ధ తన మది గదిలో.అతని జుట్టుని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, అతని తలని పైకి లాగి ప్రశ్నించింది స్నిగ్ధ తమకంగా.

" ఇది..కచ్ఛా..? నా పై ఇచ్ఛా..?? " పులకరింపుతో కూడిన ప్రశ్న ఆమెది.
" ఇది నాపై ఆ ఈశ్వరేఛ్చ.." పారవశ్యంతో చెలరేగుతున్న జవాబు అతనిది.

పులకరింతలతో తనువులూ, పారవశ్యంతో మనసులూ పరమానందానికి గురీవుతున్నాయి అచ్చోట...
అతి కాంక్షగా... ఆ.. కదళీవనం సాక్షిగా...!

* * * * *

( స్వాతి సపరి వార పత్రిక 4-2-2005 )

22, డిసెంబర్ 2008, సోమవారం

కదలడూ - వదలరూ ...!!!


నిలువుటడ్డం ముందు నిల్చున్న కేశవమూర్తికి ఒళ్ళు కుతకుతలాడింది. ఏమాత్రం ఫేసూ-ఫీలింగ్సూ లేనివాళ్ళు..ఆ టీ.వి లో..ఈటీ.వి లో పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ, తామేదో పెద్ద స్టార్స్ ల ఫీలవుతూ ఫోజులు కొడుతుంటే, సూపర్ స్టార్ కావడానికి అన్ని అర్హతలు వున్న తను, ఇంకా ప్రేక్షకుడిలా ప్రజల మధ్యనే వుండిపోవడం భరించలేని బాధనే కాదు..పిచ్చి కోపాన్నీ తెప్పించింది. లాభంలేదు..! ఇక బయలుదేరక పోతే, తన ముందున్న ఉజ్వలమైన భవిష్యత్తు ఖాయం..! సందేహం లేదు..!! ఓ..భయంకరమైన నిర్ణయానికొచ్చేశాడు ' పిండం కేశవ మూర్తి '

మొన్నటి కమల్ హాసన్ లా, నిన్నటి అరవింద స్వామిలా, నేడు కేశవమూర్తి..! సినీ వినీలాకాశంలో మరో వెన్నెల రేడు..! తెలుగు తెరకు మరో కొత్త అందగాడు..!' అంటూ పరిశ్రమ, పత్రికలూ తనని మోసెయ్యడం తథ్యం..! అనుకున్నాడు ఎంతో గర్వంగా - తన సొట్ట బుగ్గలను చూసుకుంటూ -

నిజానికి కేశవ మూర్తి తను ఫీలయ్యేంతటి అందగాడేమీ కాదు. తమతో పోల్చుకున్నందుకు, కమల్ హాసన్, అరవింద స్వాములే ఫీలవుతారు. ఎందుకంటే, కేశవ మూర్తి చిన్నప్పటి 'సొట్ట బుగ్గలు ' అతని వయసుతో పాటే పెరిగి పెద్ద పెద్ద 'లొట్టలయ్యాయి '... అవి తమకు లేనందుకు -

* * * * *
చలనచిత్ర సీమలో గొప్ప నటుడవ్వాలని, ఇంటి నుంచి ఒక్క అడుగు ముందుకేసిన కేశవ మూర్తి , అనుకోకుండా నటుడిగా, సహ నిర్మాతగా రెండు కాళ్ళు బలంగా మోపాడు సినీరంగం మీద. అదీ నిర్మాత 'గాలి వాలేశ్వరరావు ' అందించిన ఉత్సాహ,ప్రోత్సాహాల వలన - వాలేశ్వరరావు తీయబోయే అద్భుత చిత్రానికి సహ నిర్మాత అయిపోయాడు కేశవమూర్తి.
వాలేశ్వరావు జి మూవీస్ కాస్తా, జి.పి మూవీస్ గా మారిపోయింది పిండం కేశవమూర్తి పార్టనరై పోయేసరికి. మొదటి విడత మొత్తంగా ఓ పాతిక లక్షలు క్యాషుతో పాటు, కొత్తగా రంగేసిన పాతకారూ పట్టుకొచ్చాడు.ఆ డబ్బుల్తోనే ఆఫీసు , ఫర్నీచరూ గట్రా చకచకా ఏర్పాటు చేసేశాడు వాలేశ్వరరావు . వెరైటీగా వుంటుందని నార్త్ ఇండియా నుంచి హీరోయిన్ని కాకుండా , డైరక్టర్ని బుక్ చేయడానికి ముంబై వెళ్ళాడు వాలేశ్వర రావు ఒంటరిగా -
* * * * *
"మూర్తి గారు..! వీరు 'మటాండ్కోర్ ' గారని ముంబైలో మన దోస్త్ ..మన సినిమాకు డైరక్టర్..! ఈయన కేశవమూర్తి గారని..కో-ప్రొడ్యూసర్.. మాంఛి నటులు కూడా. మన సిన్మాలో ముఖ్యపాత్ర చేయించాలి మీరు..! " అంటూ వారిద్దరిని ఒకర్నొకరికి పరిచయం చేశాడు వాలేశ్వర రావు.
" నమస్కారం " ఎంతో వినయం గా రెండు చేతులు జోడించి నమస్కరించాడు కేశవమూర్తి.
నోట్లో కసాపిసా నముల్తున్న పాన్ పరాగ్ పేస్ట్ ని ' థూ ' అంటూ పిచికారీ చేసి, " నమష్కార్.." అన్నాడు మటాండ్కోర్ గార పట్టిన పళ్ళతో యికిలిస్తూ -
" పూర్వం బొమ్మేటైనా తీసినారా ..? " అడిగాడు కేశవమూర్తి ఉత్సాహంగా.
కేశవమూర్తి అడిగిందేమిటో అర్ధంకాలేదు మటాండ్కోర్ కి, విస్తుబోయి చూశాడు వాలేశ్వరరావు వంక. " లేదు..లేదు..సుభాష్ ఘాయ్ .. ఖల్ నాయక్..సినిమాతో .. డైరక్షన్ డిపార్ట్ మెంట్లోకి దిగాడు. ఆ తరువాత మనోడి వర్క్ చూసి, సుబాష్ ఘాయ్ గోవింద నిహలానీతో చెబితే, ఆయన ఇల్లాంటోడు నా 'ద్రోహకాల్ ' కి కావాలంటే, అటు వెళ్ళాడు.. " వివరంగా చెప్పాడు వాలేశ్వరరావు డైరక్టర్ ప్రొఫైల్ని.
" ఇస్కా బాద్..నిహలానీ..రామూకొ బోలా...! " చెప్పాడు మటాండ్కోర్ పిసరంత గర్వంతో.
" రామూ ఎవరు..? " అమాయకంగా అడిగాడు కేశవమూర్తి.
" అదే..మన రాం గోపాల్ వర్మ..! అని కేశవమూర్తికి చెప్పి, వెంటనే మటాండ్కోర్ వైపు తిరిగి..
" ఏ సిన్మాకి వర్క్ చేశావ్..? " అని అడిగాడు వాలేశ్వరరావు -
నోట్లోని పేష్ట్ ఎక్కడ మీద పడుతుందోనని టెంక్షన్ పడుతూ, ఆకాశం వైపు తలెత్తి, అడ్డంగా ఆడిస్తూ...
" నై..నై..కాం నై కరా.." అని చెప్పాడు మటాండ్కోర్.
" వర్మతో ప్రోబ్లం ఏటీ..? " ఎంతో కుతూహంగా అడిగాడు కేశవమూర్తి.
" నై..నై.. ఉనో బహుత్ అచ్చా ఆద్మీ హై..వెరిగుడ్ జంటిల్ మాన్.. ఆ..టైంలా..మేరికో హాలివుడ్ ఫిల్మ్ కేలియే,
కాల్ ఆయా.." చెప్పాడు మటాండ్కోర్ మరోసారి పిచికారీ చేసి.
కేశవమూర్తి మరలా ఏదో అడగబోయేంతలోనే, చెప్పాడు వాలేశ్వరరావు
." ఫస్ట్ టైం మన పిక్చర్ ద్వారానే డైరక్టర్ గా పరిచయం కాబోతున్నారు....అదే మన లక్.." ఏంతో ఆనందంగా చెప్పాడు వాలేశ్వర రావు.
' కలిసొచ్చే కాలమొస్తే..అన్నీ ఇలాగే కుదురుతాయి ' అనుకున్నాడు కేశవమూర్తి ఆనందంగా.
అంతలో అక్కడికి కో-డైరక్టర్ బి.యస్.మయ్యా తో కలిసి, చెదిరిన క్రాఫ్ ని దువ్వుకుంటూ, చెదరని చిరునవ్వుతో ఒక వ్యక్తి వచ్చాడు.
" సార్..నేను చెప్పలా..? డైలాగ్స్ అదరగొట్టే రైటరని..ఈయనే..చీకుల...." పరిచయం చేస్తున్న బి.యస్.మయ్య మాటలను ఓవర్ లాప్ చేస్తూ
"..చీకుల కావ్య చరణ్.." తనని తాను పరిచయం చేసుకున్నాడు రచయిత చీకుల కొమరయ్య ఉరఫ్ కావ్య చరణ్, ఎంతో కంగారుగా -
" కధేటైనా రడి చేసినారా...? " అడిగాడు కేశవమూర్తి డైరక్టర్ని.
" స్టోరీ..టైటిల్..సబ్ రడీ హువా.." చెప్పాడు మటాండ్కోర్ చిరునవ్వుతో.
" టైటిలేటి..? " హుషారుగా అడిగాడు కేశవమూర్తి.
" కదల్డూ-వదల్రూ..ఏ హైనా..? " కేశవమూర్తికి సమాధానం చెబుతూ, వాలేశ్వరరావుతో కంఫర్మ్ చేసుకున్నాడు మటాండ్కోర్. అదేనన్నట్టు తలాడించాడు వాలేశ్వరరావు.
" ఓల్డ్ టైటిల్ లాగుంది...? " కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి చెప్పాడు కేశవమూర్తి, సహ నిర్మాత హోదాలో.
" స్టోరీ నయా హై..! ఆప్ కదల్డూ...నా కేరక్టర్ కి మంచి లైఫ్ యిష్టార్.." యాసగా చెప్పడు మటాండ్కోర్ తెలుగు బాషలో.
" మరి వదల్రూ..అంటే హీరోనేటీ..? " ఉత్సాహం గా అడిగాడు కేశవమూర్తి..
"నై..నై..హీరో అవుర్ విలన్స్...అండ్రూ వష్టార్...ఆ..టైటిల్ల.." పొంగిపోయాడు కేశవమూర్తి.
' అదృష్టం ఎక్కడికో యీడ్చికెళ్ళిపోతుంది ' మురిసిపోయాడు మనసులోనే..!
పొంగిన కేశవమూర్తి మొహం చూస్తూ చెప్పాడు మటాండ్కోర్.
" సీ..కేషవ్ మూర్టీ సాబ్..! నా క్రియేషన్ల మీ కారెక్టర్ హాలివుడ్ని టచ్ చేష్టుంది..ఇస్ ఫిల్మ్ రిలీజ్ హోనేకాబాద్ ..మటాండ్కోర్ ..బోలేతో.. బి.వో.సి.డి..అంటార్ ..అంద్రూ.."చెప్పాడు మటాండ్కోర్ ఎంతో గర్వంగా అందరి వంకా చూస్తూ -
'బి.వో.సి.డి అంటే..?? ' అనే ఎక్స్ ప్రెషన్ వచ్చేసింది అందరిమొహాల్లోకి చాలా కాజువల్ గా -
కాని అది ఎక్స్ ప్రెషన్ లా కాకుండా, యక్షప్రశ్నలా వచ్చింది కేశవమూర్తి నోటి వెంట.
" బి.వో.సి.డి అంటే ఏటీ..? "
"బాక్సాఫీస్ క్రియేటివ్ డైరక్టర్..! " చెప్పాడు మటాండ్కోర్ కూల్ గా, అంత కంటే ఎంతో కాంఫిడెంట్ గా-
ఈసారి 'నో..డౌట్ !' అనే ఎక్స్ ప్రెషన్ వచ్చేసింది అందరి మొహాల్లోకి చాలా నేచురల్ గా.
" అబ్బా..! రియల్లీ అదిరిపోయింది సార్..! " ఉబ్బిపోతూ చెప్పాడు కో-డైరక్టర్ బి.యస్.మయ్యా.
"వండర్ ఫుల్ డైరక్టర్ సాబ్..! సిన్సియర్ గా చెబుతున్నా..! అసలు మీకు నేనే పెడదామనుకున్నా.." ఎమోషన్ లో వాక్యాన్ని పూర్తి చేయలేదు రచయిత చీకుల.
తెల్లబోయి చూసారందరూ అతని వైపు. ' రచయిత చీకుల డైరక్టరుకు పెడదామనుకున్నదేమిటో అర్ధంగాక.' -
"ఇంతకీ స్టోరీ ఏటీ ..? " పెద్ద స్టార్ డం వున్న హీరోలా అడిగాడు కేశవమూర్తి.
కోపం తన్నుకువచ్చింది బి.వో.సి.డి గా ఫీలయ్యే మటాండ్కోర్ కి. కానీ తమాయించుకుని చెప్పాడు సమాధానం..
" ఇది చెప్పే స్టోరీ కాదు..తీషి చూపించాలా..టోటల్ హైటెక్ ఫిల్మ్..ఆల్ మిక్సింగ్..సోషల్..హిష్టారికల్..మైథాలజీ..మిక్సిడ్ విత్ ఫాంటసీ..." చెప్పాడు కూల్ గా, అతన అద్భుతమైన స్టొరీ పాయింట్ ని-
అది విన్న వెంటనే భయంతో వణికిపోయాడు కేశవమూర్తి.
"ఏటి పులుసులా అనీ కలిపేసి తీత్తే ..సూత్తారంటారా జనం..? " ప్రశ్నించాడు వెంటనే,
తన టాలెంట్ నే శంకించేసరికి పిచ్చికోపం వచ్చేసింది మటాండ్కోర్ కి -
" సీ..కేషవమూర్టీ సాబ్..! ఆప్ కో.. డైరక్టర్ మటాండ్కోర్ కా టాలెంట్ నహీ మాలూం..! హం కో మిఠాసఖే యిస్ జమానా కో థం నహీ..జమానా చల్తీ హై హం సే..! హం జమానా సే నహీ..!!" ఆవేశంతో వూగిపోతూ, కవిత్వం చెప్పినట్టు చెప్పాడు మటాండ్కోర్.
ఆవేశం వచ్చినప్పుడు కవిత్వం అట్లా వూపేస్తుంది అతడ్ని.
"ఆహా...! ఏం చెప్పార్ సార్..! మాకు నేర్పించే దమ్ము ఈ కాలానికి లేదు..కాలం నడుస్తుంది మాతోటే.. మేము కాలంతో పాటు కాదు...ఆహా..అద్భుతం సార్..! ఎవరు చెప్పారో గానీ, మీగురించీ, మీ టాలెంటు గురించీ చెప్పినట్లుంది..," తెలుగు తర్జుమాతో ఫీలవుతూ, భజనమోత మోగించాడు రచయిత చీకుల.
లక్షలు పెట్టుబడి పెడుతున్న నిర్మాత తను. తనకే డౌట్ గా వుంటే, రేపు సిన్మా ఎలా హిట్ అవుతుంది..?
అందుకే కోపం వచ్చింది కేశవమూర్తికి.
"నానేటి అంతన్నను.. మీకేటి అంత సీరియస్సు...? " కోపంగా అడిగాడు కేశవమూర్తి.
కోపం వచ్చేసరికి గాలి వాలేశ్వరరావుకి పనిబడింది.
' వీడి మొహం మండా..! వీడికి అప్పుడే కోపం వచ్చేస్తే ఎలా..? కొంపలంటుకుపోవూ..? " అనుకున్నడు వాలేశ్వరావు మనసులో. వెంటనే కలుగజేసుకుని ...
"జగదేక వీరుడు - అతిలోక సుందరీ .. మన రాఘవేంద్ర రావు గారు తీస్తే, ఎగపడి చూడలేదాండీ జనం..? " చెప్పాడు సమాధానం కేశవమూర్తి భయాన్ని కొట్టిపారేస్తూ -
"నిజమే కదా ? నాబుర్రకెందుకు తట్టనేదూ..? " మనసులో అనుకోవాల్సిన మాటలను అమితాశ్చర్యంతో ఒళ్ళు మరిచి.. పైకే అనేసాడు కేశవమూర్తి -
" మీ రాఘవేండ్ర రావ్...అవుర్.. డాషరి నారయణ్ రావ్.. డైరక్షన్ అంటే ఏమిటో నేర్చుకుంటార్...మన ఫిల్మ్ చూషి.." చెప్పాడు మటాండ్కోర్ శూన్యం లోకి చూస్తూ-
ఉబ్బిన మటాండ్కోర్ మొహం చూసి, 'బహుశా వాళ్ళు నేర్చుకుంటున్న సీన్ కనిపిస్తుంది కాబోలు ' అనుకున్నారు మిగతా వాళ్ళు...
" సౌత్ లో మణిరత్నం ఒకడండి..గ్రేట్ డైరక్టర్..." తర్వాత ఏం చెప్పిచావాలో తోచక ఆగిపోయాడు రచయిత చీకుల.

చీకుల అసలు ఏం చెప్పదలుచుకున్నాడో, మణిరత్నం పేరు అసలు ఎందుకు చెప్పాడో, ఎవరికీ అర్ధంగాలేదు. విన్నవారికి మాత్రం ' పాపం మణిరత్నాన్ని మాత్రం వదిలిపెట్టండి..' అన్న్న అర్ధం స్ఫురించింది.

"ఓ..హో.. ఉనో బహుత్ అచ్చా కిలాడీ..! హమారా ఫిల్మ్ ఉన్ కో భీ సిఖానా..స్క్రీన్ ప్లే బోలేతో క్యా హై.." కసిగా చెప్పాడు మటాండ్కోర్, మణిరత్నం మీద పగబట్టినట్టు -
బి.వో.సి.డి. భయంకరమైన కసికి మురిసిపోతున్నాడు నిర్మాత గాలి వాలేశ్వరరావు , తన సిన్మా సూపర్ హిట్ ని తలుచుకుని-
ఉద్రేకంతో వూగిపోతున్నాడు రచయిత చీకుల, తన అద్భుతమైన డైలాగ్స్ తో ప్రేక్షకుల మైండ్స్ అదరగొట్టాలని -ఉత్సాహంతో కొట్టుకుంటున్నాడు కో-డైరక్టర్ బి.యస్.మయ్యా -తన సహకారంతోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రద్దలవుతాయని -
భయంకరంగా వణికిపోతున్నాడు సహ నిర్మాత కేశవమూర్తి, లాక్స్ లో పెట్టిన పెట్టుబడి కాకుండా, ఓన్లీ బాక్సులే తిరిగొస్తాయేమోనని -

* * * * *
కేశవమూర్తి గదిలోకి వచ్చేసరికి మిగతా నలుగురూ, ఏదో ధీర్ఘాలోచనలో వున్నట్టు కనిపించారు. విషయం తెలియక కేశవమూర్తిలో టెంక్షన్ ప్రారంభమైంది.
"కధ బాగా వచ్చింది..ఎంతో ఎక్సైటింగ్ గా వుంది. ఎంత బడ్జెట్ అయినా ఫర్వాలేదు..చిరంజీవి గార్నే ప్రయత్నిద్దాం..ఏమంటారు మూర్తిగారు..? అడిగాడు వాలేశ్వరరావు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా -
" ఇప్పుడాయన పోలిటిక్స్ లోకి వచ్చారు కదా ఒప్పేసుకుంటారా అని..? " ఎంతో ఉద్రేకంగా అడిగాడు కేశవమూర్తి.
" ఏమండీ..! యన్.టి.ఆర్. సి.యం. అయిన తరువాతనే కదా..శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తీసింది..? " టక్కున ప్రశ్నించాడు వాలేశ్వరరావు. తెల్లమొహం వేసాడు కేశవమూర్తి. ఆ తెల్ల మొహం లోకి తొంగిచూస్తూ చెప్పాడు వాలేశ్వరరావు...
" చూడండి మూర్తిగారు..! చిరంజీవి గారు పోలిటిక్స్ లోకి వచ్చేముందు ఎలాగైనా ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చెయ్యలా..? స్టోరి కుదరక ప్రొజెక్ట్ డ్రాప్ చెసారు గానీ..లేకుంటే ఒక పక్క యాక్షన్ని...మరో పక్క ఎలక్షన్ని ఒక పట్టు పట్టేవారు..అంతేకదా..?
"అయినా మనం కొత్త వాళ్ళం గదా..? ఎంత స్టోరీ బాగున్నా మనకి ఓ.కే. అంటారా అని..? "
"మూర్తిగారు ! ఫీల్డు మీకు కొత్త గానీ, నాకూ, చిరంజీవి గారికీ కొత్త కాదు కదా..? అయినా, ఠాగూర్, శంకర్ దాదా సిన్మాలు తీసినోళ్ళు, అంతకు ముందు ఆయనతో ఏ సినిమాలు తీసారో చెప్పండి..? సూపర్ డూపర్ అయ్యే స్టోరీలు కాబట్టే కదా..ఆయన డేట్లిచ్చింది..? రేపు మన కధ విన్న తరువాత, ఆయన ఏ పరిస్థితిలో వున్నా ఓ.కే అనాల్సిందే..నో..డౌట్.." తన ఇరవై ఏళ్ళ అనుభవాన్ని రంగరించి పరిశ్రమ తత్వాన్ని, చిరంజీవి మనస్తత్వాన్ని వివరించాడు వాలేశ్వరరావు.
కేశవమూర్తి శంకలన్నీ పటాపంచలైపోయాయి..
" ఆయనకు నచ్చితే,తెలుగుతో పాటే ,హింథీలోనూ తీద్దామనొచ్చు..! " తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు చీకుల.
" ఆయన ఎక్కడ తీద్దామన్న..ముందు మనం ప్రిపేర్ అయివుండాలి..అడ్వాన్స్ మనీతో..." కేశవమూర్తినే చూస్తూ చెప్పాడు వాలేశ్వర రావు.
'ఒకవేళ చిరంజీవి గారు డేట్స్ గానీ యిస్తే..ఎవరితో క్లాప్ కొట్టిచ్చాలి..ఎవరితో కెమెరా నొక్కిచాలి.. ఎంత గ్రాండ్ గా ఓపినింగ్ చెయ్యాలి..' అన్న ఆలోచనలో అప్పటికే డీప్ గా మునిగిపోయి వున్నాదు కేశవమూర్తి -
*****
కాలంతో పాటే కధాచర్చలు జరుగుతున్నాయి. యథాప్రకారం రూపాయిలు ఖర్చవుతున్నాయి తన సినిమా ఏమిటో ? తన పాత్ర ఏమిటో ? అసలేమీ తెలియటం లేదు కేశవమూర్తికి. అందరూ కలిసి గదిలోకి దూరి నవ్వుకుంటారు. తను వెళ్ళేసరికి నవ్వటం ఆపేస్తారు. మొత్తానికి ఎదో గూడుపుఠాణి జరుగుతుంది. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కేశవమూర్తి, ఏలా తేల్చుకోవాలో తెలియక -
"పి.కే గారు అర్జంటుగా.. ఓ .. ఐదు లక్షలు క్యాష్ కావాలండీ..! " సీరియస్ అడిగాడు ప్రొడక్షన్ మేనేజర్ నూకరాజు. అతని వెనుక నుంచుని వున్నాడు క్యాషియర్ భిక్షపతి, చేతిలో కాళీ బ్రీఫ్ కేస్ తో -నూకరాజు అందరిని ఇంగ్లీష్ పొడి అక్షరాలతో పిలుస్తుంటాడు. 'పి.కే ' అన్నందుకు కోపం తన్నుకువచ్చింది పిండం కేశవమూర్తికి. సీరియస్ గా చూసాడు నూకరాజు వంక.
'ఎందుకేటి అంత సొమ్ము..? ' అన్న అర్ధాన్ని తీసుకున్నాడు నూకరాజు ఆ చూపుల్లోంచి.
"బ్రహ్మానందం, భరణి,కోట గార్లకు అడ్వాన్స్ యివ్వడానికి...ఏమంటారు పి.కే గారు ..అవతల లైన్లో గుండు గారున్నారు.." తొందర పెడుతూ చెప్పాడు నూకరాజు.
"ఉంటే ఉండానీయస్సా...! ఏటివాయ్..మంచి-మర్యాదా లేదా..? పి.కే ఏటి..? ఏటి పీకియ్యాలా ? సిరంజీవన్నారు...నాగార్జునన్నారు..సివరికి మరి ఉత్తదో నిజమో ? ఎంకటేసు సంతకం ఎట్టిన కాయితం సూయించి, మరో పదిలక్షలు తెప్పించేసినారు. ఇంకెక్కడి పైకం..? మావోల్లందరూ వోపినింగెప్పుడా ? సూటింగెప్పుడా అని ఎదురు సూత్తావున్నారు...ఇక్కడేమో సుయ్యీ-సయ్యీ నేదు.." బాగా మురికిపట్టిన గుడ్డని బండకేసి బాదినట్లు వుతికిపారేశాడు కేశవమూర్తి నూకరాజుని. బిక్క చచ్చిపోయాడు నూకరాజు.
"హీరోయిన్ని తేవటానికి జీ.వి.గారు బొంబాయి ఎళ్ళారు కదండీ..? లేకుంటే ఆయన్నే అడుగుదును.." వూపిరి తీసుకుంటూ మరలప్రయత్నం మొదలెట్టాడు నూకరాజు.
అతను చెప్పింది నిజమన్నట్టు గట్టిగా తలూపుతున్నాడు భిక్షపతి కాళీ బ్రీఫ్ కేస్ ను వదిలిపెట్టకుండా -
" ఏటివాయ్.. ..తెత్తారు బొంబాయి నుంచి ? అలవా ? " ఈసడింపుగా అడిగాడు.
'అలవా ' అంటే ఏమిటీ అన్నట్టు చూశాడు నూకరాజు భిక్షపతి వంక.'
హల్వా...హల్వా ' అంటూ లిప్ మూమెంట్ యిచ్చాడు భిక్షపతి నీరసంగా వెనక్కి తిరుగుతూ -
* * * * *
" సిన్మా హిట్ కి కదలడు పాత్రే ఆయువుపట్టు. .." నవ్వుతూ చెప్పాడు చీకుల.
" ఆ పాత్రే అటువంటిది. ఆడియన్స్ నీ యిట్టేపట్టు.. " నవ్వాపుకోలేక ఇబ్బంది పడుతూ చెప్పాడు కో-డైరక్టర్ బి.యస్.మయ్యా.
" టెరిబుల్ సీన్స్..అండ్ ..డెడ్లీ కామెడీ..." పగలబడి నవ్వుతున్నాడు మటాండ్కోర్.
"మనోడేమో పిండం...పాత్రేమో బ్రహ్మాండం..." తుళ్ళుతూ చెప్పాడు వాలేశ్వరరావు.
' ఓ..హో..." ఘొల్లుమన్నారందరూ ఒక్కసారిగా -
అప్పుడే లోపలికి వస్తున్న్న కేశవమూర్తి చెవిలో పడ్డాయామాటలు. నిర్ఘాంతపోయాడు. సహనం చచ్చిపోయింది సహనిర్మాతకి. ఈ రోజు తనేమిటో ? తనకిచ్చిన పాత్రేమిటో ? తేల్చుకోవాలి. ఎంతో ప్రశాంతంగా వాళ్ళున్న గదిలోకి అడుగుపెట్టాడు కేశవమూర్తి.
"డైరక్టర్ గారు మీరు సెప్పే గొప్ప కదలడు పాతరేమిటండీ ..? " చాలా కూల్ గా అడిగినప్పటికీ, కేశవమూర్తి మాటల్లోని తీవ్రతకు అదిరిపడ్డారందరూ. చెప్పనా ? వద్దా ? అన్నట్లు చూసాడు మటాండ్కోర్ వాలేశ్వరరావు వంక. చెప్పమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు వాలేశ్వరరావు. బిగుసుకుపోయి కూర్చున్నారు మిగతావారందరూ.
'కదలడు పాత్ర, సినిమాలో దాని నిడివి, హీరో, విలన్స్ మిగతా అన్ని పాత్రలు దాని చుట్టూ తిరగడం, దాని వల్ల పుట్టుకొచ్చే చచ్చేటంతటి కామెడీ... మొత్తం వివరించాడు మటాండ్కోర్ ధైర్యంగా- తన అద్భుతమైన హాలివుడ్ పాత్రని - ఓపికగా విన్న కేశవమూర్తి ఉగ్రరూపం దాల్చాడు ఒక్కసారిగా -
" ఛస్..ఊర్కోయస్సా..! ఏటిరా ? ఏటది గొప్ప పాతరా ? కద ఇంటావుంటేనే రోత పుడతా వుంది...డబ్బులెట్టి ఎవడు చూత్తాడురా దీన్నీ..? ఇలాంటి సెత్త కద నట్టుకుని ఇంతర్ నేసనల్ బొమ్మ తీసేత్తన్నానని కలలుగంతన్నావా ? నువ్వు తీసి సూపిత్తే ఆలివుడ్ ని టచ్ చేత్తదా ? మరి చెయ్యదేటి..? కళాకండం కదా ? థూ..నీ యమ్మా..! ఇలాటి సెత్త సినిమా తీసి సూపిత్తే..జనం తీసినోల్లని..చేసినోల్లని..కండలు..కండలుగా నరికి పోగులేట్టేత్తారు..నీ పాతరా వొద్దూ, పాడి వొద్దూ..నీ కాడే వుంచీసుకో.. " ఖాండ్రించి వూసినంత పనిచేసాడు కేశవమూర్తి. ఉగ్ర నరసింహుడిలా వున్నాడు ఊగిపోతూ -
బిక్క చచ్చిపోయాడు పాపం ..! 'బాక్సాఫీస్ క్రియేటివ్ డైరక్టర్ మటాండ్కోర్.... '
" అది కాదు సార్.. మీది మాంఛి..." ఇంకా ఏదో చెప్పబోయాడు రచయిత చీకుల.
" ఆ..మాంఛి జీవకలున్న పాతరంతావా ? మరి కాదేటి ? నోర్మూయస్సా..సిడతలు కొట్టే నాయాలా.." ఉరిమాడు పులిలా. ఒంట్లో రక్తం ఇంకి పోయింది చీకుల కొమరయ్యకి.
"కదలడు అంటే టైటిల్ రోల్ కదా సార్..! బాగా వెరైటీగా కూడా వుంటుంది.." తన వంతు ప్రయత్నం చేసాడు పాపం బి.యస్.మయ్య.
" మరి మా గొప్ప ఎరైటీ..కాదేటి మరీ..? ఏటివాయ్..నీ పేరు బి.యస్.మయ్య అంటే ఎరైటీ అనుకుంతన్నావా...? ఎవులికి తెలీదు..నీ పేరు బొచ్చుల సోమయ్యని..." గాలి తీసేసాడు బి.యస్.మయ్య గా గొప్పపేరు సంపాదించుకోవాలని కలలు కంటున్న బొచ్చుల సోమయ్యది.
"మూర్తిగారు..ఏమన్నా తేడా జరిగితే క్షమించండి..." అభర్ధిస్తూ చెప్పాడు వాలేశ్వరరావు. ఇంతలా రియాక్ట్ అవుతాడని వూహించలేదు వాలేశ్వరరావు ఎప్పుడూ కూడా-
"ఏటివాయ్..తేడా ఏటి..? అంత సొమ్మిచ్చింది ఇసుంటి దిక్కుమాలిన పాతరకేటీ..? ఆ పాతరా వొద్దూ...ఈ జాతరా వొద్దూ..నా పైకం నాకిప్పించు..నానూరెల్లిపోతాను..ఛి..ఛీ.." చీదరించేశాడు వాలేశ్వరరావును, హీనంగా చూస్తూ -
సరిగ్గ అప్పుడే గదిలోకి రాబోతున్న నూకరాజు, భిక్షపతి లోపలి వాతావరణాన్ని గ్రహించి, బయటే నిలబడిపోయి వినసాగారు చెవులురిక్కించి....
" అది కాదు మూర్తి గారు ! సిన్మా మధ్యలో మీరిలా...." అనునయంగా చెప్పబోయాడు వాలేశ్వరరావు. "మజ్జలో ఏటి..? ఆదినుంచి సూత్తానే వున్నా మీ సిన్నెలన్నీ.పదెకరాల రేగడి పొలం..పోరంబోకు ఎదవలకి ఖర్చెట్టేసినాను.. మోజుపడి వొచ్చినందుకు తీర్చేసినారు బులబాటం..నేర్పించేసినారు గునపాటం...." ఆపై మాటలు పెగలక, పొంగుకొచ్చే దు:ఖాన్ని దిగమింగుకుంటూ వడివడిగా వెళ్ళిపోయాడు కేశవమూర్తి.
మాటలను విన్న భిక్షపతికి గానీ, నూకరాజుకి గానీ, కేశవమూర్తిని అంత బాధించిన ఆ 'కదలడు 'పాత్రేమిటో అర్ధంకాలేదు.అరగంట తరువాత బయటకొచ్చిన రచయిత చీకులని అడిగాడు నూకరాజు.
" సి.కే.సి. గారు ఇంతకీ కదలడు పాత్ర అంటే ఏంటండీ..?
" వాడి పేరులోని తలా-తోకా తీసెయ్యండి..మిగిలిన మొండెమే వాడి పాత్ర.. " కసిగా చెప్పాడు రచయిత చీకుల కోపంగా వెళ్ళిపోతూ.
ఒక్కక్షణంలో అర్ధమైంది యిద్దరికీ కదలడు అంటే ఏమిటో..?
" ఓరి దొంగముండా కొడుక్కుల్లారా ! కదలడూ అంటే శవమనా అర్ధం ?
అవునులే..! పాపం నోరులేని కేశవమూర్తికి.. మీరిచ్చింది నోరుమెదపని శవం పాత్ర.
ఆయన దగ్గర సొమ్ములు అయిపోయేంత వరకూ దెయ్యంలా పట్టుకున్న మీరు వదలరూ...
అసలు 'కదలడూ-వదలరూ ' అన్న టైటిల్.. సినిమాకి కంటే, మీ బతుకులకే బాగా సరిపోతుంది .."
మనసులో అనుకున్న మాటలను, తట్టుకోలేక పైకే అనేసాడు బిక్షపతి, కాళి బ్రీఫ్ కేస్ని ఒక మూలకి విసిరేస్తూ - కొయ్యబారిపోయాడు ప్రొడక్షన్ మేనేజర్ నూకరాజు శవం లా...గొప్ప షాకుతో...!!!
* * * * *

21, డిసెంబర్ 2008, ఆదివారం

ప్రేమ తురాయి....!!!


ఆ ఇన్విటేషన్ కార్డ్ చూడటం తోనే, నా మనసు గతంలోకి జారిపోయింది. ఆ గతం నిన్నా-మొన్నటిది కాదు. పరుల వశమై నా మనసు పారవశ్యాన్ని తొలినాళ్ళది. కన్నుల్లో పున్నమి కాంతుల్ని నింపుకుని తొలిసారిగా క్లాసురూములోకి అడుగుపెట్టిన ' వైదేహి ' పదహారేళ్ళ ప్రాయానిది.
సరిగ్గా మా కాలేజీ ని స్థాపించి పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా , సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని నిర్వహిస్తూ, కాలేజీ యాజమాన్యం పంపిన ఆహ్వాన పత్రికది .
అతివల నుదురుపై కుదురైన పెద్ద బొట్టుని చూసినా, విశాల నేత్రాలలో వెలుగుని చూసినా, అందంతో కూడిన అమాయకత్వాన్ని చూసినా.. నిజం చెప్పొద్దూ... నాకు వైదేహే గుర్తుకు వస్తుంది. కళ్ళముందు నుంచి నడిచి వెళుతున్న ఆమెను చూసిన క్షణంలోనే తెలిసింది .. నా మనసు ఎంతో గాఢంగా ఆమెనే కోరుకుంటోందని .. ఆమెలోనూ అదే కోరిక తీవ్రమవుతున్నదనీ -
* * * * *
మా కాలేజీకి అల్లంత దూరాన ప్రవహిస్తూ వుంటుంది ఏలూరు కాలువ. ఆ కాలువ గట్టున మరో ఇద్దరమ్మాయిలతో నడుచుకుంటూ వచ్చేది వైదేహి. నేను లంచ్ కి ఇంటికొచ్చి ఐదు నిముషాల్లో అయ్యిందనిపించి, వెంటనే పరుగు పరుగున వెళ్ళేవాడిని మరలా కాలేజీకి. ఆలుచిప్పలాంటి కళ్ళతో నాకై ఎదురుచూస్తూ వుండేది వైదేహి. నన్ను చూడటంతోనే ఆమె కన్నుల్లో చెమక్కుమంటూ మెరిసే మెరుపుని, ఆకాశంలో సైతం చూడలేదింతవరకూ నేను -

మనసు పోరు తట్టుకోలేక మాటకలపడం మొదలెట్టాన్నేను. అర్ధశాస్త్ర నిర్వచనాన్ని, ట్రయల్ బ్యాలెన్స్ టోటల్స్ ని ఎన్నోసార్లు ఆమెనే అడిగి తెలుసుకున్నాన్నేను. ఒకసారి అలానే...
"పౌరుని ప్రాధమిక హక్కుల్లో మొదటి పాయింట్ ఏమిటి వైదేహి ..? అని అడిగాను.
" ప్రేమించడం " బదులిచ్చింది నాకే వినిపించేలా. గుండె ఝల్లుమంది ఆమె సమాధానం విని.
"అవును అరవింద్..అదే ఫష్ట్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్.." ఈసారి గట్టిగా నలుగురికీ వినిపించేలా చెప్పింది. మొదటిసారిగా ఆమె మనసు మాట్లాడటం మొదలెట్టింది నోరు తెరిచి. అలా ఆరంభమైన మా మాటలు ...
' ఐ..లవ్..యూ..' అనడానికి ఎంత ఆరాటపడ్డాయో మా కంటే మా మనసులకే బాగా తెలుసు. తనువులు చేరువై మాటలు సుదూర తీరాలకి పరుగులిడుతున్నాయి..
"అరవింద్..మన ప్రేమ ఎప్పటికీ ఇలానే వుంటుందా...?" నా అరచేతిలో ఆమె మోముని వాల్చుతూ అడిగింది వైదేహి..
"ప్రేమకు మరణం లేదు వైదేహి..అది ఎప్పటికీ బతికే వుంటుంది..మనం చనిపోయినా.." చెప్పాన్నేను..
నా మాటలకు చెమర్చిన కళ్ళతో నా భుజం పై తల వాల్చేసింది. గతం తాలూకూ అనుభూతులన్నీ,
నన్నో.. ఆనందపు టూయలలో ఊపుతుండగా వినిపించింది సెల్ ఫోన్ లో రింగ్ టోన్ ...
' ఫీల్ మై లవ్ ' అంటూ...
* * * * *
నేనూ, జోసఫ్ బయలుదేరాం కారులో - హైదరాబాదు నుంచి హనుమాన్ జంక్షన్ కు. కాలేజీ ఫంక్షన్ కు -పాతికేళ్ళనాటి విషయాలు మా ముచ్చట్లలో దొర్లాయి.
" యశస్వీ..చాలా బాగుందిరా నీ పెన్ నేం.. మొన్న మొన్నటివరకూ తెలియదు. నువ్వే యశస్వీవనీ. మనసే వెన్నెల సీరియల్ అదిరి పోతుందిరా పాపులర్ పత్రికలో .." ఎక్సైటింగ్ గా వుంది జోసఫ్ వాయస్.
వాడివంక చూశాను చిరునవ్వుతో -
" ఇప్పుడు నీ విషయం తెలిసి..నీ వైదేహి.. ఎంత గొప్పగా ఫీలవుతుందిరా ? " అడిగాడు జోసఫ్. నా సమాధానానికై ఎదురుచూస్తూ...నేను ఆలోచనలో పడ్డాను.
" అవునురా అరవింద్.. వైదేహి డిగ్రీ పూర్తి చేయకుండానే పెళ్ళి చేసుకున్నట్లుంది కదూ..? "
" చేసుకోలా..బలవంతంగా చేసారు.." సరిదిద్దాన్నేను.
" ఆ..అది నిజమే.. అయినా తొందరపడి ఎందుకు చేశారంటావ్..? " కుతూహలంగా అడిగాడు జోసఫ్.
"మేము ప్రేమించుకుంటున్నామని మాకు తెలియక ముందే.. అందరూ చెప్పుకోవడం మొదలెట్టారు. ఏలానో చేరిందా వార్త వైదేహి ఇంట్లో. మనం ఇంటర్ పూర్తిచేసి డిగ్రీలోకి వచ్చాం.. ఆమె జీవితంలోకి ప్రవేశించింది. " గతం కళ్ళ ముందు నిలిచింది. తొంగిచూసింది గుండెల్లోని బాధ గొంతులోకి.
"నీకు తెలియదనుకుంటా..? " ప్రశ్నించాడు జోసఫ్.
కలుక్కుమంది నా గుండెలో బాధ. నాకు తెలిస్తే జరగనిస్తానా మరొకడితో వైదేహి పెళ్ళిని..?
సుళ్ళు తిరగసాగింది నాలో దు:ఖం. మాట్లడకుండా ఎం.పి.త్రి. సిడీ ఆన్ చేశాను పెద్ద సౌండ్ తో.
* * * * *

ఎందరో విద్యార్ధులకి భవిష్యత్తును ప్రసాదించిన మా కాలేజ్ పెద్దగా అభివృద్ది చెందలేదనే అనిపించింది. నా ఉన్నతికి పునాది వేసిన మా కాలేజ్ కి ఓ లక్ష రూపాయిలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాన్నేను వెంటనే. అదీ..చనిపోయిన మా తల్లితండ్రుల పేరుమీద.

ఆనాడు మాతోపాటు చదివిన అమ్మాయిల్లో రాని, ఐదుగురిలో వైదేహి ఒకతి. ఇప్పుడెలా వుండి వుంటుంది వైదేహి..? మెదడునిండా నిండిపోయిందాలోచన. నా నిరీక్షణ కొండంత ఆశతో కొనసాగుతుండగా, ఓ ఆటోవచ్చి ఆగింది గేటువద్ద. ఆటోలోంచి దిగిన మనిషిని చూడటంతోనే నా హృదయ స్పందన వేగవంతమైంది. ఆశ్చర్యంతో నిశ్చేష్టుడనయ్యాను. ఆమె అచ్చు వైదేహి లానే వుంది కానీ- వైదేహి కాదు.

ఇరవై ఏళ్ళకు పైబడిన వయస్సు, అందంతో వెలుగుతున్న ముఖవర్చస్సు, చకచకా నడుచుకుంటూ రాసాగింది. ఆమెనే పరికించసాగాయి నా కళ్ళు. ఏదో అడుగుతున్నట్లుంది ఎవరినో, తెలియదన్నట్టు తలూపుతున్నారు అవతలి వాళ్ళు. మెల్లగా ఆమె చెంతకు వెళుతుండగా, ఠక్కున వెనక్కి తిరిగింది . ఉలిక్కిపడ్డాన్నేను. సందేహం లేదు. ఆమె ముమ్మాటికీ వైదేహీ కూతురే..!

నా ముందు నుంచే వెళుతుందామ్మాయి. నా మనసులోని మాటని జోసఫ్ కి వివరించి, ఆమెను అనుసరించమని చెప్పాను. ఆ అమ్మాయి వెళ్ళి హిష్టరీ మేడం ని కలవడం, వారి చెంతకు వెళ్ళిన జోసఫ్ కి మేడం ఆ అమ్మాయిని అప్పగించడం, ఆమెను తీసుకుని జోసెఫ్ తిరిగి రావడం అంతా గమనించసాగాను.

" ఒరేయ్..యశస్వి..ఈ అమ్మాయి మన అరవిందకుమార్ ని కలవడానికి వచ్చిందట. నువ్వు కంపెనీ ఇవ్వు..వాడ్ని వెదికి పట్టుకొస్తా.." కన్నుగీటి చెప్పాడు జోసఫ్.

" మీరు పస్ట్ బ్యాచ్ స్టూడెంటా..? " ప్రశ్నించిందామ్మాయి ఎంతో ఉత్సాహంగా

" పేర్లతో మొదలు పెడదామా ? మన పరిచయాల్నీ , పద ప్రయాణాల్నీ.." అడిగాను కుర్చీలో కూర్చుంటూ.

" నా పేరు అరవింద..! " చెప్పింది నా పక్కనే కూర్చుంటూ.

ఆమె చెప్పిన పేరు వినగానే ఆశ్చర్యపోవడం నా వంతైంది - మా ఇద్దరి పేర్లూ ఒకటే కావడం యాదృచ్చికం కాదు ..అది వైదేహి ఐచ్చికం అనిపించింది. ఎంత ప్రేమగా నా పేరుని తన కూతురికి పెట్టుకుంది వైదేహి ? ఆ ఆలోచన ఎంతో గర్వాన్నిచ్చింది నాకు, సంతోషంతో కలిసి - అంతలోనే నా చెంపను ఛెళ్ళుమనిపించినట్టుగా ప్రశ్నించింది నా మనసు నన్నే..

' మరి నీ కూతురికి ఏం పేరు పెట్టావ్ రచయిత మహాశయా ?' అంటూ -

ఏ రచయితా రాయని పేరుని, నిఘంటువులో వెదికి మరీ పెట్టాన్నేను..నా కూతురికి ' హసిత మాల్యా ' అని - సింధువు లాంటి వైదేహి ప్రేమ ముందు బింధువైంది నా ప్రేమ యిప్పుడు.

" నా పేరు యశస్వి.." నా మనసు నోరు మూసేస్తూ చెప్పాను అరవిందతో. ఆమె ఎందుకు నన్ను కలవాలని వచ్చిందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో.

" విచిత్రంగా వుందే..నీ పేరు..మావాడి పేరు ఒకటే..అతనిని కలవాలనే నువ్వొచ్చావు..ఎనీ రిలేషన్ విత్ హిం.? " విషయ సేకరణా నిమిత్త్తం అడిగాను..

" ఎస్..వుంది..అతను ఆత్మ బంధువు.."

" ఎవరికి ఆత్మబంధువు ? "

" మా అమ్మగారికి.." మెడలోని బంగారం గొలుసుని పంటికింద నుంచి లాగుతూ చెప్పింది అరవింద సమాధానం.

ఆమె చేస్తున్న తీరు చూస్తుంటే.. నాకు వైదేహే గుర్తుకు వచ్చింది వెంటనే. వైదేహి అంతే.. ఏవో ఆలోచనలల్లో మునిగి వున్నప్పుడల్లా మెడలోని ముత్యాల గొలుసుని పెదవుల మధ్య వుంచుకునేది.

సభ ప్రారంభమైనట్ట్లుంది. మినిస్టర్ గారు ఉపన్యాసం దంచేస్తున్నారు. కరస్పాండెంట్ శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపాల్ వెంకట రమణారావు గారు వేదిక మీదున్న తదితర పెద్దలు చాలా శ్రద్దగా వారి మాటలను ఆలకిస్తున్నారు.

అంతలో 'అరవింద్ ' అన్న పిలుపు వినగానే నేను ఎంతలా ఉలిక్కిపడ్డానో, అంతలా ఉలిక్కిపడింది అరవింద కూడ. ఎదురుగా జోసెఫ్ నవ్వు మొహంతో -

" అరవింద్ గాడు కనిపించ లేదురా.మరలా వెళ్ళి వెదుకుతాను గానీ, నిన్ను వేదిక ముందుకు వచ్చి కూర్చోమని మన సివిక్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు చెప్పారు.." నన్ను గుచ్చిగుచ్చి చూస్తూ వినయంగా చెప్పాడు.

" నేను వెళతా గానీ..నువ్వెళ్ళి అరవింద్ ని వెతకరా.." కసిరాను వాడిని.

అరవిందకుమార్ కనిపించలేదన్న వార్తకు ఆమె మొహలో నిరాశ తొంగిచూసింది. అంతలో స్టేజీ మీద ప్రభాకర్ గారు, తమ విధ్యార్ధులు సాధించిన గౌరవాన్నీ, గుర్తింపుని తెలియజేస్తున్నారు. నేను చెప్పకుండానే నేనెవరో ఆమెకు తెలిసి పోతుందేమోనని కుర్చీలోనుంచి లేచే ప్రయత్నం చేశాను.
* * * * *


"అరవింద్ కుమార్ గారిని కలవమని ఆ అమ్మ గారు చెప్పారు.. " మెల్లగా చెప్పింది అరవింద.

బహుశా నేను కూడా వెళ్ళిపోతే, అరవిందకుమార్ గురించి మరే సమాచారం తెలుసుకోలేనని దిగులు కాబోలు..పాపం పిచ్చిపిల్లకి..నవ్వుకున్నాను

మనసులో." ఎవరు మీ అమ్మా ..? ఎందుకు కలవమంది..? " అడిగాను నా మనసు నర్తనను గమనిస్తూ..

వై..దే..హి.." చెప్పింది అరవింద.

" అవునవును..వైదేహీ..నిన్నుచూసి ..ఎక్కడో చూశాననుకుంటున్నా..గుర్తుకువచ్చింది..అవునూ..మరి ఆమె రాలేదే..? ప్రశ్నించాను సునామీలా చెలరేగుతున్న ఆనందాన్ని అదుపులో వుంచుకుంతూ..

అంతలో సివిక్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు నా రచనల గురించి వివరిస్తున్నారు మైక్ లో.లేచి నిలబడ్డాను. ఇక వెళ్ళేందుకు ఉధ్యుక్తుడనవుతూ..

" ఆమె రాలేదు.." బదులిచ్చింది అరవింద. గొలుసుని మరలా పంటికింద జరుపుతూ.

" అదే..ఎందుకని..." ఆనందాన్ని అదిమిపెడుతూ, టక్ సరిచేసుకున్నట్లు నటించాను. "ఆమె....రాలేదు....ఆమె....చని..పోయింది.... " మూగగా కుమిలిపోతూ అస్పష్టంగా పలికింది అరవింద.

ఒక్కసారిగా నా కాళ్ళు చచ్చుబడిపోయినట్లు కుప్పకూలిపోయాను కుర్చీలో. మెదడు మొద్దుబారిపోతుంది.

అంత ఘోరమైన వార్త వింటానని ఆ క్షణం వరకూ తెలియదు. ఎన్నో ఆశలనూ, ఊసులనూ మోసుకుంటూ ఇంత దూరం వచ్చిన 'నా మనసు ' ఇంత భయంకరంగా ఓ క్షణంలోనే తునాతునకలై పోతుందని తెలియదు.. సజీవమైన నా పాతికేళ్ళ స్మృతులన్నీ చితిలో కాలిపోయి.. ఇలా శూన్యంగా మారాయని అస్సలు తెలియదు. శక్తిని కూడదీసుకుంటూ చూశాను అరవింద వైపు. పంటిమధ్య గొలుసుని పట్టి వుంచి పొంగుకొచ్చే దు:ఖానికి ఆనకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది.

" ఏలా... చని....పోయింది....? " అడిగాను నా దు:ఖాన్ని బయటపడనీకుండా.

" ఆమె చావుకి..ఆమె భర్తే కారణం..." బదులిచ్చింది.

' భగవంతుడా..! ఏ పాపం చేసిందని ఆమెకిలాంటి బతుకునిచ్చావ్..? ప్రేమ నిండిన మనిషి పట్ల నీ కెందుకింత అసూయ..? మౌనంగా రోదిస్తుంది నా మనసు.

" ఆమె భర్త అంటున్నావ్..మరి నీ తండ్రి కాడా..? "

" అలా బతకవలసి రావడం..నాకో శాపం.." పొంగుకొస్తున్న దు:ఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది. నా గుండెను చీల్చుకుంటూ వెళ్ళిందామె జవాబు.

'వైదేహి..నేనెంత దురదృష్టవంతుడిని..? నీకు పెళ్ళైపోయిందని తెలిసి..మరలా కలవడానికే ప్రయత్నించనందుకు ఇంత శిక్ష విధించావా..? కుమిలిపోతుంది నా హృదయం. అరవింద వైపు చూశాను. ' అమ్మా..! " అంటూ ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చలేక .. మనసు శూన్యమై .. మాట్లడలేని మూగవాడినయ్యాను.

" ఇప్పుడే వస్తా అరవింద.. నేను తిరిగొచ్చే వరకూ వెయిట్ చెయ్యి..అరవిందకుమార్ ని నువ్వు కలుసుకుంటవ్.. నీ ఆత్మ బంధువుని ..నువు కలుసుకుంటావ్.." చెప్పాను భారంగా కుర్చీలోంచి లేస్తూ.

నా మాటలు ఆమెకెంతో శక్తినిస్తాయని తెలుసు. నేను ఉండగా ఇక భవిష్యత్తులో అరవిందను ఏ కష్టం దరిచేరదు. నా ' ప్రేమపై ' వైదేహీ పెట్టుకున్న ' నమ్మకం ' ఎప్పటికీ తరిగిపోదు .

* * * * *

అప్పటివరకూ తనతో మాట్లాడిన వ్యక్తి గురించే ఆలోచిస్తుంది అరవింద. ' యశస్వి..' ఎంత మంచి పేరు..? పేరుకు తగ్గట్టు మంచి మనస్వి కూడా - తన క్లాస్ మేట్ చనిపోయిందని తెలిసి..ఎంతలా చలించిపోయారు..? ఓదార్పు కోసమే అయినా ' నీ ఆత్మ బంధువుని ' కలుసుకుంటావని ఎంత మంచిమాట చెప్పారు..?

ఏ పరిస్థితులలో తన తల్లి పాతికేళ్ళనాడు తన మనసులో పదిలపరుచుకున్న ప్రేమను తనకు తెలియచేసింది..? 'ధర్మేచ..అర్ధేచ..కామేచ..నాతిచరామి...' అంటూ ..పెళ్ళినాడు ప్రమాణం చేసిన వ్యక్తిపై లేని నమ్మకాన్ని, పాతికేళ్ళనాడు పరిచయమై, 'రెండేళ్ళ 'పాటు ఆమె మనసుకు దగ్గరగా చరించిన వ్యక్తిపై, తన కూతురి భవిష్యత్తు గురించి నమ్మకాన్ని వుంచుకుంది..? తనువు చాలిస్తున్న క్షణాలలోనూ అతని కోసం ఆమె హృదయం ఎంతలా తహతహలాడింది..? ఎప్పటికైనా, వైదేహీ కూతురుగా, అరవింద కుమార్ గారిని తను కలవాలని, ఎంత దృఢంగా తన నుంచి మాట తీసుకుంది ? తన కళ్ళతో ఆమె మనసులోని మనిషిని చూడగలనని ఎంత గాడంగా విశ్వసించింది ?

యశస్వి గారు ఎంత మంచి మనిషైనా..తమకేమీ కాని మనిషికి ఎలా చెప్పగలదు తను యివన్నీ..? ఆలోచనల్లోంచి బయటపడింది అరవింద, మైక్ లోనుంచి వినిపిస్తున్న మాటలు విని -

" ప్రముఖ వార పత్రికలో మనసే వెన్నెల సీరియల్ ద్వారా పాఠకుల హృదయాలను దోచుకుంటున్న మన రచయిత..మన కాలేజ్ పూర్వ విధ్యార్ధి అయిన అరవింద కుమార్ ని వేదికమీదకు రావలసిందిగా కోరుతున్నాను..." ఆహ్వానించారు సివిక్స్ లెక్చరర్ ప్రభాకర్ గారు.

ఉలిక్కిపడింది అరవింద మైక్ లో వినిపించిన పేరుని గుర్తించి. ఉత్తుంగ తరంగమై లేచింది కుర్చీలోంచి. మెల్లగా వేదిక మీదకు వచ్చి అందరికీ అభివాదం చేస్తున్న మనిషిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఇంతవరకూ నేను మాట్లాడింది 'అమ్మ మనసు ' తోనా ? 'అమ్మ ప్రేమ 'తోనా ? కళ్ళల్లో అనందభాష్పాలు పొంగుకొస్తుండగా, తలెత్తి ఆకాశంలోకి చూసింది..

' అమ్మా..! నీ కోరిక నెరవేర్చానమ్మా..!' తపిస్తుంది ఆమె మనసు తల్లితో ఆ మాట చెప్పాలని....

* * * * *

" అరవింద కుమార్ ని మాట్లడవలసిందిగా కోరుతున్నాను.. " మైక్ వద్దకు ఆహ్వానించారు నన్ను ప్రభాకర్ గారు -

మౌనంగా చేతులు జోడించి అందరివైపూ చూసాను. అందరిలోనూ వైదేహి రూపమే కనిపిస్తుంది నాకు. సుళ్ళు తిరుగుతుంది నా హృదయం లో బాధ. అరవింద వైపు సారించాను నా దృష్టిని. కళ్ళల్లో కోటి కాంతులను నింపుకుని నన్నే చూస్తుంది అరవింద ఎంతో సంబరంగా. అందరికీ అభివాదం చేస్తూ, గొంతు సవరించుకున్నాను మనసు లోని మాటలను తెలియచేసేటందుకు.

" అందరికీ వందనం ..! నా పేరు అరవిందకుమార్... రచయితగా అవతరించిన పేరు యశస్వి..ఈ ఊరివాడిని.. ఈ కళాశాల మొదటితరం విధ్యార్ధిని.. అమ్మ బ్రతుకిస్తుంది..! కళాశాల బ్రతికేందుకు బాటనిస్తుంది..!!

' అనుభవం క్షణం..అనుభూతి అనుక్షణం..'

గతించిన కాలం తిరిగి వస్తే ఎంత బాగుంటుందీ అనిపిస్తుంది యిప్పుడు. ఎన్నో మధురమైన అనుభూతులు మమేకమై వున్నాయి నాలో..ఈ కళాశాలలో పొందినవి..! ఈ కళాశాలను స్థాపించి ఎందరికో విద్యను ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగు నింపిన శ్రీ శ్రీనివాసరావు గారు దైవస్వరూపులు. ఈ కళాశాలే లేకుంటే నాకీ ఉన్నతే లేదు. బ్రతుకిచ్చిన తల్లితండ్రులు బ్రతికున్నా, లేకున్నా, బ్రతికేందుకు బాటనిచ్చిన కళాశాల బ్రతికుండాలీ కలకాలం.. అలా బ్రతికించుకోవాల్సిన భాధ్యత పూర్వ విధ్యార్ధులందరిపైనా వుంది..!!

ఈ భావనతొనే కన్నతల్లిలాంటి మన కళాశాలకు ..ఓ లక్ష రూపాయిలు విరాళంగా ఇవ్వదలిచాను. ఆ మొత్తాన్ని ఇదే కళాశాలలో మాతోపాటు విద్యనబ్యసించి, మా అందరికంటే మిన్నగా మార్కులు సాధించి...ఇవాళ ఈ ఫంక్షన్ లోనే కాదు.. ఈ... లోకంలోనే ... లేని... నా....


పొంగుకొస్తోంది నా గుండెల్లోంచి దు:ఖం. అందరిమొహాల్లోనూ విషాదం తొంగి చూస్తుంది. అలానే కొనసాగించాను వైదేహినే తలచుకుంటూ -

" నా సహచర విద్యార్ధినీ 'శ్రీమతి వైదేహి ' పేరుమీద ..ఆ లక్ష రూపాయిల మొత్తాన్ని ఇవ్వదలిచాను. యజమాన్యం సహృదయంతో స్వీకరించి, ఆమె పేరు మీద గ్రంథాలయ భవనాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాను. స్నేహ సౌహార్ధాలను పంచిన నా సహచర విద్యార్ధినీ,విద్యార్ధులకు , అభిమానాన్ని పంచుతున్న మా తరువాత తరాల విద్యార్ధినీ, విద్యార్ధులకు ... అభివందనాలు..అభినందనాలు..సెలవ్...." ముగించాను ప్రసంగాన్ని.

మిన్నుముట్టాయి కరతాళధ్వనులు..వెన్నుతట్టాయి ప్రశంసాపూర్వక కనులు. ఈ కళాశాల ద్వారానే పరిచయమైంది వైదేహి. ఓ శాశ్వతమైన అనుభూతిగా మారింది. మనసు మురుస్తుండగానే మంచులా కరిగిపోయింది.ఇప్పుడీ భవన నిర్మాణం ద్వారా వైదేహి ఓ స్మృతిలా మారుతుంది అందరికీ.

తన గుండెలో చోటిచ్చి నాకు ప్రేమామృతాన్ని పంచిన మనిషి, రేపు భవిష్యత్తులో తన గూడు నిచ్చి అందరికీ ఙ్ఞానామృతాన్ని పంచుతుంది. సంతృప్తితో నిండింది నా మనసు.

మినిష్టర్ గారి చేతుల మీద నన్ను పుష్పమాలాంకృతుడిని చేసి, శాలువాకప్పి, మా కళాశాల ఙ్ఞాపికను అందచేశారు శ్రీనివాసరావు గారు. నా ధాతృత్వాన్ని, సహచర విద్యార్ధిని పట్ల నా స్నేహ సౌజన్యాన్ని, ఎంతో గొప్పగా అభివర్ణిస్తున్నారు ప్రిన్స్ పాల్ గారు. నింగినంటాయి అభినందన పూర్వక ద్వనులు.

ఆనందభాష్పాలతో,బరువెక్కిన హృదయంతో వేదిక మీద నుంచి దిగాను.అందరి చప్పట్లూ ఏకమై, అందరి ఆనందమూ మమేకమై, ఆమె సొంతమైనట్లుగా 'చంద్ర ఛాఫం ' పై కూర్చుని చిరునవ్వుని చిందిస్తుంది వైదేహి నన్నే చూస్తూ.

ఏలా నడిచి వచ్చానో తెలియదు. ఆనందంతో వెలిగిపోతున్న అరవిందను చేరుకున్నాను. ఎంతో ఆర్తిగా నన్నే చూస్తుంది. నా మనసు లోని శాంతి కన్నుల్లో కాంతిగా మారుతున్న వేళ ...నా చేతిలోని ఙ్ఞాపికను ఆమె చేతిలో వుంచి, తియ్యని అనుభూతిగా నా శరీరాన్ని అంటివున్న శాలువాను తీసి.. నిండుగా ఆమెకు కప్పాను.

అంతే... అప్పటి వరకూ నిలిపివుంచిన దు:ఖం కట్టలు తెంచుకుంది ఆమెలో. అమాతం వచ్చి నా గుండెపై తలవాల్చి, గాడంగా హత్తుకుపోయి దు:ఖిస్తుంది అరవింద...

అలానే పొదవి పట్టుకున్నాన్నేను ఆ పసి పాపాయిని.. 'మా ప్రేమ తురాయిని ' - ఓ...కన్నతండ్రిలా..!!!

*****

( స్వాతి సపరి వార పత్రిక ... 17-11-2006 )

20, డిసెంబర్ 2008, శనివారం

కొత్త పుంతలు...!


చెంచురామయ్యకు ఆ దారి కొత్త కాదు. ఎడ్లబండ్లు నడిచే మట్టి రోడ్డు, దారి పొడవునా తుమ్మ చెట్లు, అక్కడక్కడా ఎంతో జీవితాన్ని చూసిన అనుభవంతో ఊడలు దిగిన మర్రిచెట్లు. ఇవన్నీ చెంచురామయ్య రోజూ చూసేవే. చూడనిదల్లా వేపచెట్టు దగ్గర కొత్తగా వెలిసిన కల్లు పాక.

మూడు రోజుల క్రితం తను ఆ దారిన వెళుతున్నప్పుడు, ఏవరో చిన్న పాక వేస్తున్న హడవుడి కనిపించింది. తను పెద్దగా పట్టించుకోలా.ఇవాళ కొత్తగా కనిపిస్తుంది కల్లుపాక కూడా కాదు, రంగు కాగితాల తోరణాలు కావు, అలికిపెట్టిన ముగ్గులూ కావు, నురగతో నిండివున్న కల్లుకుండలూ కావు,

వయసు పొంగుతో నిండి, నలుపు రంగులో వుండి, లేత సూర్యకిరణాలకి మిలమిలా మెరుస్తున్న కొరమీను చేప లాంటి పిల్ల. పిల్లంటె పిల్ల కాదు,ముప్పై, ముప్పై ఐదుకి మధ్య వుండొచ్చేమో వయసు. లేత తమలపాకులా కాకుండా, ముదురిన కోనసీమ కొబ్బరిబొండంలా వుంది. పెదాల మీద పరిచయమున్న నవ్వుతో, ఓరకంట చూసిన చూపు, సుడిగుండంలా చుట్టేసింది చెంచురామయ్యను.

చెంచురామయ్యకు యాభై ఏళ్ళు దాటి రెండెళ్ళైయ్యింది.మనిషి పెద్ద పొడవు కాదు. పొట్ట బాగా పెరిగినందువల్లనేమో, పొట్టే అంటారు చాలామంది. మూతిమీద మీసాల్లానే పెరిగాయి, చెవులమీద వెంట్రుకలు. మిగిలిన కాసిన్నీ.. కోటకు కాపలా కాస్తున్న సైనికుల్లా బుర్ర చుట్టూ పెరిగాయి. గింజలు రాల్చడానికి చదును చేసిన చేనులా వుంటుంది బట్టతల.
చెంచురామయ్యకు ఊళ్ళో మంచిపేరే వుంది. ఇరవై ఐదు ఎకరాల రైతేగానీ, ఏనాడూ పనివాళ్ళను గట్టిగా తిట్టికూడా ఎరగడు.
' గాడిద కొడకా ' అనిగానీ అన్నాడంటే చాలా కోపంగా వున్నాడన్నమాటే. భార్య చనిపోకముందు చెరువు దగ్గరి రావిచెట్టు కింద చేరి, ఊరి పెద్దలతో పిచ్చాపాటి మాట్లాడటం చేస్తుండే వాడు. విలేఖరిలాగా వార్తా సేకరణలేగాని, ఏనాడూ గట్టిగా స్టేట్ మెంట్ ఇచ్చికూడా ఎరగడు. అందుకే కాస్త నోరున్నవాళ్ళు, తాము చెప్పిందాన్ని బలపర్చుకోవటానికి .. చెప్పాల్సింది చెప్పి...
" నువ్వేమంటావు చెంచురామయ్య..? " అని అడుగుతారు.
" అనటానికేముంది నువ్వు చెప్పింది సబబే.." అనేవాడు.

ఏడేళ్ళ క్రితం భార్య చనిపోయినప్పటి నుంచి, ఆ పక్కకు వెళ్ళటం తగ్గించేశాడు. పొలం పనులు చూసుకోవటం, సాయంత్రమయ్యేసరికి పడక్కుర్చీ వేసుకుని టి.వీ చూడటం దినచర్యగా గడపసాగాడు. అలా సాఫీగా, తాపీగా సాగిపోతున్న చెంచురామయ్య జీవితంలో ఇవాళ 'అలజడి 'మొదలైయ్యింది.


పొలం దగ్గరకు వచ్చాడన్నమాటే గానీ, పనిమీదకు మనసు మళ్ళడం లేదు. పొద్దుతిరుగుడు పువ్వులాగా మనసు కల్లుపాక దగ్గర చూసిన పిల్లమీదకే మళ్ళుతుంది. ' దీని సిగతరగ ' ఎలాంటి చూపు చూసింది..? ' ఈతముల్లు గుచ్చుకున్నట్టు బాధతో గిలగిల్లాడిపోయాడు. తన పరిస్థితి తనకే ఆశ్చర్యమేసింది. ' తనేమిటి ? అదేమిటీ..? ' ఆలోచనలో పడిపోయాడు.

* * * * *

" బాబు ఆ దిగువ పొలానికి నీళ్ళెట్టమంటారా..? " ఆలోచనలకు అంతరాయం కలిగేసరికి కళ్ళు తెరిచి చూశాడు . ఎదురుగా కిష్టిగాడు కనిపించాడు. పెట్టమన్నట్టు కళ్ళతోనే సైగచేశాడు.

" ఓరే కిష్టిగా..ఇలా దగ్గరికి రా " వెళ్ళిపోతున్న కిష్టిగాడిని పిలిచాడు చెంచురామయ్య. రాములవారి పాదాలవద్ద హనుమంతులవారి ఫోజులోలా ఎంతో వినయంగా వచ్చి నిలబడ్డాడు కిష్టిగాడు.

" ఎవర్రా అది ? నాయుడి గారి పొలం పక్క కల్లు పాక పెట్టింది..? " లేని గంభీరతని ప్రదర్శించాడు.

సారా ప్యాకెట్టును చూసినప్పుడు కలిగే ఆనందం కంటే రెట్టింపు ఆనందం కలిగింది కిష్టిగాడికి. యజమాని అటువంటి ఆరాలడగటం పనివాళ్ళకు ఎంతో ఉత్సాహాం కల్గిస్తుంది.

" ఎక్కడ్నుంచి వచ్చిందో నాకుమాత్రం తెల్దండి..ఇద్దరు పిల్లలంట. పెద్దాడేమో అప్పిగాడి సైకిల్ షాపులో పనిచేత్తనాడండి..చిన్నాడేమో.." చిరాకేసింది చెంచురామయ్యకు. ఈ వెధవ ఎప్పుడూ ఇంతే. కావాల్సింది మాత్రం చెప్పడు.

" గాడిదకొడకా..పెట్టినోడు ఎవర్రా అంటే ఎదవ సొద చెబుతావు " విసుకున్నాడు..కాదు నటించాడు. పైగా 'పెట్టినోడు ' అంటూ వత్తి పలికాడు.

" ఆడమగోళ్ళెవరూ లేరు బాబు..ఆడకూతురే ఎట్టినాది. మొగుడు వదిలేసినాడల్లేవుంది బాబు. అక్కడెవ్వరూ కానరారు. అయినా యాపారం కూడా మాంచిగా సాగుతున్నాది బాబు. దీని దెబ్బకు కొండలుగాడి దుకాణం కాళీ అయిపోనాది.." హుషారుగా చెబుతున్నాడు కిష్టిగాడు.

మళ్ళీ దారి తప్పుతున్నాడు వెధవ అనుకున్నాడు చెంచురామయ్య.
" పోరా పోయి నీళ్ళపని చూడు. పోరంబోకు సొద ఎప్పుడూనూ.." విసుక్కున్నాడు.

తనేం తప్పుచేశాడో అర్ధంకాలేదు కిష్టిగాడికి. మొహం వేలాడేసుకుని వెళ్ళిపోయాడు. అందిన సమాచారం ఆనందాన్నే ఇచ్చింది చెంచురామయ్యకు. పైగా మొగుడొదిలేశాడన్న మాట మరింత హుషారునిచ్చింది. అంతలోనే దిగులు కమ్ముకుంది. తనకేమో కల్లు తాగే అలవాటు లేదు. మరి దేని కోసమని కల్లుపాక దగ్గరకెళ్ళటం ? మళ్ళా ఆలోచనలో పడిపోయాడు చెంచురామయ్య.

* * * * *

" రండీ బాబూ..! ఈ నులక మంచమ్మీద కుర్చోండి.." పాక లోపలికి ఆహ్వానించింది రత్తాలు. చెంచురామయ్య వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు.

" పిల్లా..నీ పేరేంటే..? " అన్నాడు కాస్త భయంగా.

" రత్తని అంటారుగానీ, నా పేరు రత్తాలండీ.." వినయంగా చెప్పింది.

తాటి ఆకును కత్తితో మధ్యగా చీల్చుతుంది రత్తి. అది చూస్తున్న చెంచురామయ్య హృదయం కూడా తాటి ఆకులానే సర్రున తెగినట్లైంది.

రవిక లోపల వేరే తొడుగు లేదేమో, చిన్న లొట్టెలు రెండు గుండెలమీద పెట్టుకున్నట్లనిపించింది. ముందుకు వాలిన పొట్ట నల్లని కొత్తకుండలా నిగనిగలాడుతోంది. వంగుని వుండటం మూలానా, చీర ఒంటికి బాగా అంటుకుపోయి అవయవ సౌష్టవాన్ని చూపిస్తోంది. కనిపించని కాలి తొడలు ఎదిగిన తాటిచెట్టు మొదలునే గుర్తుకుతెస్తున్నాయి. కత్తిని కిందపడేసి, ఆకుని ముడులు వేస్తూ నిలుచుంది రత్తి. చీర బాగా కిందకు కట్టిందేమో, లోతైన బొడ్డు కల్లుముంత నోరులా కనిపించింది.

దొంగ చూపులు చూస్తున్న చెంచురామయ్యలో యవ్వనం గువ్వలా ఎగిరి, రగులుకోవటం మొదలెట్టింది కామపు సెగ.

' దోనెను 'తెచ్చి చెంచురామయ్య చేతికి అందించింది. మారుమాట్లాడకుండా అందుకున్నాడు . కల్లు ముంతను ఎత్తి, అభిముఖంగా వచ్చి వంగుని వంపసాగింది.

"మెల్ల్లగా పొయ్యవే పెద్దగా అలవాటు లేదు.." గుసగుసలాడినట్టు చెప్పాడు.

" గుటకేసి చూడండి బాబు.. కమ్మగుంటేనే తాగండి..నాకాడ కల్లు రుచి చూసినోళ్ళు మరేకాడికీ పోరు.." అంది కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ.

ఒక్కసారిగా షాకు తగిలినట్లనిపించింది చెంచురామయ్యకు. మెల్లగా గుటకలు వేస్తూ, కళ్ళెత్తి చూశాడు రత్తి వైపు. అంత దగ్గరగా అమెను చూసిన చెంచు రామయ్యకు గుటక పడలేదు. పొలమారింది వెంటనే. ఒళ్ళంతా పడింది కల్లు.
టప్ టప్ మని అతని నెత్తిన అరచేత్తో కొట్టింది రత్త్తి. ఆశ్చర్యంగా చూశాడు రత్తి వైపు.

" సమించండి బాబు..పొలమారితేనూ..." సంజాయిషీగా చెప్పింది..

" నెత్తినేమి ఒలికిందే, ముందు ఇక్కడ తుడూ.." అంటూ రత్తి చెయ్యిని తన గుండెల మీద పెట్టి రుద్దుకోసాడు. ఆశ్చర్యపోలేదు రత్తి. చెంచురామయ్య రాకలోని కోరికను ఎప్పుడో పసికట్టింది. సిగ్గులొలకబోస్తూ మొహం తిప్పుకుని రుద్దసాగింది. అతి సుకుమారంగా కదులుతున్న ఆమె చేతివేళ్ళ స్పర్శకు గమ్మత్తైన అనుభూతి కలిగింది చెంచురామయ్యకు. తమకంతో ఆమెవంక చూశాడు.

అదే క్షణంలో ' ఇక చాలు బాబు ' అన్నట్టు కళ్ళార్పుతూ ఓరకంటగా చూసింది రత్తి.

'దీని సిగతరగ మళ్ళా అదే చూపు ' మనసులోనే మురిసిపోయాడు చెంచు రామయ్య.

' కల్లిచ్చిన కైపూ- కామపు ఊపూ ' ఇక నిభాయించుకోలేక పోయాడు. అమాంతం రత్తిని వాటేసుకుని వెనక్కి వాలిపోయాడు నులకమంచం మీద. పత్తిపువ్వులా ఒదిగిపోయింది రత్తి, చెంచురామయ్య కౌగిట్లో. ఆమె పెదవులు అతని బుగ్గల్ని తాకుతున్నాయి. ఆమె గుండెలమీ బరువు తన గుండెలమీద పడ్డట్టనిపించింది. గట్టిగా బంధించాడామెను తనలో వున్న శక్తినంతా కూడదీసుకుని.

" వదలండి బాబు..! ఎవరైనా చూత్తారు .." అంది వదిలించుకోబోతూ.
"చూస్తే చూడనీయే. మన్నేటి చేత్తారు..నీయవ్వ..! ఒక్క గుక్క ఏస్తేనే ఇంత మత్తుగుందేటే..? " ఆన్నాడు మైకంగా. ఆమె బుగ్గను కొరకబోతూ.

" మీకు మత్తిచ్చింది కల్లేటీ..? " అంది మొహాన్ని అతనికి అందకుండా చేస్తూ.

" మరేటే..?" ప్రశ్నించాడు మరింత కౌగిలి బిగిస్తూ.

" అబ్బ..! మొరటోళ్ళు బాబూ..పక్కటెముకలు యిరగొట్టేత్తున్నారు.." అంది అతని గుండేల మీద గోళ్ళతో రాస్తూ.

గిలిగింతలు పెట్టినట్టనిపించింది చెంచురామయ్యకు. ఆమె వీపు మీద నుంచి చేతిని మెల్లగా కిందకి జరిపాడు. కండపట్టి కవ్విస్తున్న నడుము ముడతల్ని అరచేత్తో గట్టిగా నొక్కాడు. సన్నగా మూలిగింది రత్తి మరింత దగ్గరవుతూ. చెంచురామయ్య చేతులు ఒక్కచోట నిలవడం లేదు - రత్తి ముద్దులు ఒక్కచోట ఆగటం లేదు -

ఆ ..ఆటలో ఎవరు నెగ్గారో తెలియదు కానీ, నైతికంగా ఓడిపోయాడు చెంచురామయ్య నిజజీవితంలో. గెలుపూ-ఓటములూ తెలియని ఆ ఆట రోజూ ఆడుతూనే వున్నాడు చెంచురామయ్య రత్తితో -

* * * * *

కమ్మని తాటికల్లు బాగా మషాలా దట్టించిన కోడికూర మనసారా తింటున్నాడు. ఇలాంటి సరికొత్త రుచులు గత మూడు నాలుగు నెలలుగా కొనసాగుతూనే వున్నయి చెంచురామయ్య జీవితంలో. తొలినాడు పరిచయమైన రత్తికి, ఇప్పటి రత్తికి తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. కట్టూ , బట్టా పద్దతుల్లో శుభ్రత ఎక్కువైంది. కల్లు అమ్ముకుని బతకాల్సిన అవసరం ఇంక లేకపోయింది. చెంచురామయ్య హైదరాబాదు నుంచి కొని తెచ్చిన 'దిల్ కుష్ ' అత్తరును క్రమం తప్పకుండా వాడుతూనే వుంది. చుక్కల చీర కట్టిన రత్తి, ఈ రోజు ఎందుకో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ మాటే అన్నాడు ఆమె బుగ్గగిల్లుతూ..

" ఏంటే..ఆకాశంలో మెరిసే చుక్కల్ని చీరలో సింగారించావు..? పైగా మొహం చంద్రబింబంలా వెలిగిపోతాంది..? ఏంటి కత..? "

" ఏంలేదు మామ..! ఆ విషయం నీకు చెప్పాలంటేనే సిగ్గవుతా వుంది.." అంది

కులుకుతూ" చెప్పవే చిలకా..! పండక్కేమన్నా కొత్తకోక కావాల్నా..?" అడిగాడు చెంచురామయ్య పక్కనే వున్న కల్లుముంతను అందుకుంటూ.

" ఛ..ఛ..అదేం కాదు మామ.." సిగ్గుపడిపోయింది. ముచ్చటగా వుంది అతనికి దాని సిగ్గు.

" చెప్పవే నా దొంగముండా..? ఏటి కావాలే..? " అన్నాడు నడుమ్మీద గిల్లుతూ .

" నువ్వు తండ్రివవుతున్నావు మామ..! " అంది రత్తి గారాలు పోతూ.
తాగుతున్న కల్లు పొలమారింది..

"ఏంటే నువు చెప్పేది..?" ఆడిగాడు ఆశ్చర్యంగా.

"నిజం మామ ఇప్పుడు రెండో నెల.." అంది.

తాటిచెట్టు మీద నుంచి కిందపడ్డట్టుగా గతుక్కుమన్నాడు చెంచురామయ్య. తనెప్పుడూ ఊహించలేదీ విషయం. ఊహించాల్సిన అవసరం లేదనుకున్నాడు తన వయస్సుకి. నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. ప్రతి పురుషుడూ, ఆనందించే ఈ సమయంలో ఎదో తెలియని భయంతో వణికిపోయాడు చెంచురామయ్య. తాగలేకపోయాడు ఆపైన. ఉండలేకపోయాడు అక్కడ. లేచి నిల్చున్నాడు..

"అదేమిటి మామ..అర్దాంతరంగా లేచిపోనావు.." అంది రత్తి చెయ్యిపట్టి ఆపుతూ..

" రేపు వస్తాలే .." అంటూ ముఖం చూపించకుండా ఏదో పనున్నట్లు వచ్చేశాడు బయటకు

* * * * *

ఇది జరిగి వారం పది రోజులు అవుతున్నా, పొలం వైపుకు వెళ్ళలేదు చెంచురామయ్య. ఒంట్లో బాగుండలేదని ఇంటిపట్టునే వుండిపోసాగాడు.ఏంచెయ్యాలో తోచకుండా వుంది. ఆలోచించటానికి కూడా మనస్కరించంటం లేదు. ఈ విషయం బయటపడితే ఎంత పరువుదండగా ? ఊళ్ళో తలెత్తుకుని తిరగలేడు. ఇంతకాలం ఎంతో గుట్టుగా బతికాడు.

యాభై ఏళ్ళకు పైగా పెంచుకున్న మంచీ - మర్యాదా, ఓ.. ఐదు నిముషాల బలహీనతకు బలికానున్నాయా..? బుద్దిమాలిన పని చేశానని దిగులు పడ్డాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకుండా వుంది. మనసంతా నిస్తేజమై పోయింది. మునుపటి ఉత్సాహం లేదు. దెయ్యం పట్టిన మనిషిలా నీరసించిపోయాడు -

' మనసు తీర్చుకుంది కరువు. వయసుకు తెచ్చింది బరువు. '

కొంతకాలం ఆ పక్కకు వెళ్ళకుండా వుంటే సమసిపోతుందని సమాధానపడ్డాడు. దేవునిమీద భారం వేసి ఈ కష్టం నుంచి గట్టెక్కించమని ప్రార్ధించాడు.

* * * * *

గదిలో కూర్చుని టీ.వి చూస్తున్న చెంచు రామయ్యకు, కాంపౌండ్ వాల్ గేటు తీసుకుని లోపలకు వస్తున్న రత్తి కనిపించింది. చెమటలు పట్టాయి చెంచు రామయ్యకు. ' ఈ దరిద్రపు ముండ ఇక్కడుకు దాపురించిందేమిటీ..? కొంపమీదకు తెచ్చిపెడుతుందా ఏమిటి నిప్పు.. ? వణికిపోసాగాడు.

" ఎవరుకావాలి ? " ప్రశ్నించాడు చెంచురామయ్య పెద్దకొడుకు రత్తిని చూసి

" ఏం లేదు బాబు..! నాయుడు గారు ఏప చెట్టుకాడ స్థలం కాళీ చెయ్యమంటున్నారు..పిల్లలు గలదాన్ని.. అయ్యగార్ని అడిగి.. మీ పెద్ద బావికాడ కాస్త జాగా ఇప్పిస్తే, చిన్న గుడిసేసుకు బతుకుతాము..ఈ మాటే అయ్యగార్ని అడిగిపోదామని వచ్చా.." అంది ఎంతో వినయంగా -

ఆ మాటలు విన్న చెంచు రామయ్యకు ఒంటిమీద గొంగళిపురుగు పాకినట్లు కంపరమెత్తింది.

' దొంగముండ..మెల్లగా పాగా ఏద్దామనుకుంటుంది.. దీని సంగతి తేల్చాలి..లేకుంటే తను మునగటం ఖాయం ' అనుకున్నాడు దృడంగా. ఇంతలో పెద్దకొడుకు గదిలోకి వచ్చి చెప్పాడు రత్తి విషయం.

" తర్వాత చూద్దాంలే..ముందు పొమ్మను.." సౌమ్యంగా చెబుదామనుకున్నాడుగానీ, చెప్పలేకపోయాడనే అనిపించింది ..తనకే. ఇక లాభంలేదు..దీనికి ముగింపు పలకాల్సిందే. ఎవరి ప్రాణం పోయినా పర్వాలేదు. తన పరువు మాత్రం పోకూడదు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చేశాడు.

* * * * *

" ఇదిగో పదివేలు..ఈ డబ్బు తీసుకుని ఊరువదిలి పెట్టి ఫో.." డబ్బుకట్టను ఆమె ఒళ్ళోకి విసిరి ఆఙ్ఞాపిస్తున్నట్టుగా చెప్పాడు చెంచు రామయ్య.

" అన్నాయం బాబు..కల్లాకపటం తెలీనిదాన్ని తల్లిని చేశారు.. ఈ విషయం నలుగురికి తెలిస్తే నా బతుకేం కాను..? " వలవలా ఏడ్చింది.

' నీ బతుకేం కాదు..పోయేది నా బతుకే.. ' అనుకున్నాడు లోలోపలే.

" తెలిసేదేముంది..ఎక్కడనుంచి వచ్చావో ఎవరికి తెలుసు..అట్లానే గుట్టు చప్పుడు కాకుండా ఎల్లిపో.." సూటిగానే చెప్పాడు.

" నా వల్ల కాదు..నన్నాయం చెయ్యకండి బాబు..మిమ్మల్నే నమ్ముకున్నాను.."భోరున ఏడ్చింది.

ఇదంతా చూస్తున్న చెంచ్చు రామయ్యకు చిరాకేసింది. ఇవాళే దీని విషయం పరిష్కరించుకోవాలి. మరల ఈ తోవకు రాకూడదు అనుకున్నాడు. కుడిపక్క జేబులోంచి మరో ఐదువేల రూపాయిల కట్టను బయటకు తీశాడు.

" ఇదిగో మరో ఐదువేలు. మొత్తం పదిహేను వేలు. ఇవి తీసుకుని పట్నం వెళ్ళిపో..నేను వచ్చి కలుత్తా వుంటాగా.." అనునయంగా చెప్పాడు. నిజమేనా అన్నట్టు చూసింది.

" నిజమేనే పిచ్చిదానా.." అన్నాడు తల నిమురుతూ.

సుడిగాలిలా వచ్చి వాటేసుకుంది రత్త్తి. ఇంతకు ముందు ఇలా వాటేసుకుంటే, ఒంట్లో వేడి రగులుకునేది. ఇప్పుడు మంటల్లో కాల్చుతున్నట్టుగా వుంది.

" మామ నువ్వు లేందే బతకలేను. నన్నాయం చెయ్యకు..నా మీద ఒట్టేసి చెప్పు.."

" ఎందుకే మనం శాశ్వతంగా ఏరై పోతున్నట్టు యిదై పోతున్నావు. నేను పట్నం వచ్చి కలుత్త్తానంటున్నాగా.." రత్తి కన్నీళ్ళు తుడుస్తూ ప్రేమగా చెప్పాడు.

'అవసరం అన్నింటిని నేర్పిస్తుంది..నటన నేర్చాడు చెంచు రామయ్య ' -

" రేపు తెల్లారి బస్సుకెళ్ళిపో..పట్నంలో అన్ని ఏర్పాట్లు చూసుకుని రా.. అడ్రస్సు యిద్దువుగానీ.." అన్నాడు శాంతంగా నమ్మబరుస్తూ. సరేనంది రత్తి.

" చీకటిపడింది. పెద్దాడు వచ్చే ఏళయ్యింది. మరి వస్తా.. డబ్బు జాగ్రత్త.." అంటూ వడివడిగా వచ్చేశాడు. మారు సమాధానం కోసం ఎదురుచూడకుండా -

పోతేపోయింది వెధవ డబ్బు. గుండెల మీద బరువు ఇంత తేలికగా వదిలిపోతుందనుకోలేదు. ఎలాగైతేనేం.. వదిలించుకున్నాడు ఇలాంటి బుద్దితక్కువ పని జీవితంలో మరోసారి చెయ్యకూడదని మనసులోనే ఒట్టు పెట్టుకున్నాడు.
* * * * *

ఆ..దారి..చెంచు రామయ్యకు..కొత్తే..!

కాలువగట్టు - దారి పొడవునా ముళ్ళకంచెలూ - జిల్లేడు చెట్లు - పాముల పుట్టలూ -

అది తన పొలానికి అడ్డదారేకానీ, దొడ్డదారి మాత్రం కాదు. అయినా ఆ దారినే ఎంచుకున్నాడు. పరిసరాలని పరికించడం మానివేశాడు.

పైగా ఇప్పుడు 'కల్లు ' తాగడం పూర్తిగా మానివేశాడు చెంచు రామయ్య...!!

* * * * *

( స్వాతి సపరి వార పత్రిక 15-9-1995 )